24, సెప్టెంబర్ 2013, మంగళవారం

పద్య రచన – 474 (కరివేపాకు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“కరివేపాకు”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ఔష ధీగుణ సంపన్న మన్న మందు
    పొడిగ- పచ్చడియై యాకు పులుసు లందు
    పెట్ట తాలింపులందున పెంచు రుచిని
    పలు విధాలమంచి “కరివే పాకు” మనకు.

    ఇంటి ముందటి వేపాకు వంటి కెపుడు
    ఇంట గల కరివేపాకు పంటి కెపుడు
    రెంటి గలవాని యింటను పంట పండ
    మంచి దనిపూర్వు లేచెప్పె మనకు నెపుడొ.

    రిప్లయితొలగించండి
  2. వంట యింటను ఘుమ ఘుమ మింట నంటు
    నాయు రారోగ్య ములకెల్ల యౌష ధమ్ము
    కరివె పాకన్న నిజమది కలుపు మైత్రి
    తీసి పారేయ వలదంట తినగ మేలు

    రిప్లయితొలగించండి
  3. శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో "మంచిదని పూర్వులే చెప్పె" అనుటకు బదులుగా చెప్పిరి అనే అర్థము వచ్చేటట్టు మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. సకల శాకములందునఁ జాల రుచినిఁ
    గలుగఁ జేయును కరివేఁప ఘనముగాను!
    కాని, కూర నుండియు నేఱి, దాని మనము
    పాఱవేతుము, దుష్టుల నేఱినట్లు!!

    రిప్లయితొలగించండి

  5. ధనియాలతో గల్పి దంచి పొడిని తిన
    నూరు శాతము పెర్గు నోటికి రుచి
    చింతపండు గలిపి చేయగా లేహ్యమ్ము
    పప్పు గలిపి తిన బాగు బాగు
    సాంబారు లో మరి చారులో నొక రెబ్బ
    వేయగా ఘుమఘుమ విస్తరించు
    తిరగమాతలోన తినగల్గు కూరలో
    ఫలహారములలోన పడిన చాలు

    తీయబోకుడయ్య తినకనే పక్కకు
    తెలిసికొనుడు దీని విలువ ధరను
    కర్వెపాకు తినుడు కర్రీల వేపాకు
    పెంచుడయ్య మీరు పెరటిలోన.


    రిప్లయితొలగించండి
  6. కరివేపాకు (కరి అంటే మత్తేభము కదా! అందుకే ఒక మత్తేభములో చర్ణన)

    కరివేపాకు రసప్రశస్తి మెరయంగా జేయు పత్రంబు, స్వా
    దురుచుల్ గూర్చును వంటకమ్ములకు సంతుష్టిన్ బ్రసాదించు నం
    దరకున్ దివ్య మహౌషధమ్మనుచు వైద్యశ్రేణియున్ మెత్తు రా
    దర మేపార బ్రశంస జేయుదును తత్ప్రాశస్త్య సౌభాగ్యమున్

    రిప్లయితొలగించండి
  7. ముందుగా గురువుగారికి,tbs శర్మగారికి,వరప్రసాద్ గారికి,ధన్యవాదములు,..నిన్న పద్యములో ప్రాస పొరపాటుపడితిని,, కేంప్ వెళ్ళే తొందరలో సరిగా చూసుకొనలేదు...కృతజ్ఞతలతో..

    ఆకమ్మదనమును ఆరుచి
    ఆకులఘుమఘుమ లలోని ఔషధ గుణముల్
    ఆకరి వేపాకు పోపులు
    ఆకలి బెంచును జనులకు అందరు మెచ్చున్

    ఆకు వేసిన శాకంబు అధ్బుతముగ
    ఆకు వేసిన ఉప్మాకు అసలు రుచియు
    ఆకు ప్రతిరోజుతినిన ఔషధమ్ము
    ఆకు కరివేప తీయక ఆరగించు.....

    రిప్లయితొలగించండి
  8. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తనరసము గుణము లన్నియు
    తనను తినెడి వారికిచ్చి తను మాత్రము పెం
    టను జేరును కరివేపా
    కనుట యథార్థమ్ము గాదె యవనిని జూడన్

    రిప్లయితొలగించండి
  9. ఆకులు పలురకములుండు,ఔషధముగ
    వాడబడి కరివేపాకు వాసికెక్కె
    రుగ్మతలబాపి,వంటకు రుచులనిచ్చి
    పెరటి మొక్కగా ఇంటింట పెరుగుచుండె.

    రిప్లయితొలగించండి

  10. రసము నుడికించు వేళలో రక్తి నొంది
    నోటి కందిన విసుగుతో నొసలు ముడచి
    యూచి వేయుదురంతలో నుర్వి జనులు
    మేలుఁ జేయఁ గృతఘ్నత మిగులు నేమొ?
    మనకు కరివేప భోధించు మాట యిదియె!

    రిప్లయితొలగించండి
  11. కరివేపాకులు వంటన
    విరివిగ వాడుచు రుచులను పెంచుచు కూరల్
    మరిమరి వడ్డన జేతురు
    పరివారమునకు వనితలు వసుధన మిత్రా.

    రిప్లయితొలగించండి
  12. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    తమరి సూచనానంతరం మరొక ప్రయత్నం

    ఇంటి ముందటి వేపాకు వంటి కెపుడు
    ఇంట గల కరివేపాకు పంటి కెపుడు
    రెంటి గలవాని యింటను పంట పండ
    మనకు పూర్వులు చెప్పిరి మంచి దనుచు.

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా బావమరదికి ఆపరేషన్ కారణంగా ఉదయమే కరీంనగర్ వెళ్ళి రాత్రి 11 గం.లకు తిరిగి వచ్చాను. అందువల్ల పూరణలను, పద్యాలను సమీక్షించే అవకాశం దొరకలేదు. మన్నించండి.
    చక్కని పద్యాల నందించిన ....
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    కుసుమ సుదర్శన్ గారికి,
    సహదేవుడు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి