1, మార్చి 2014, శనివారం

పద్య రచన – 522

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. వెన్నదొంగ యటంచు పేరు గాంచిన యట్టి
    తనయు కృష్ణుని కొంటె పనుల గనుచు
    విసుగుచెంది యశోద పిల్లవానిని బట్టి
    గట్టిగా రోటికి గట్టివేసె
    పిదప నా కృష్ణుండు వెడలగ బ్రాకుచు
    పెరటిలోగల రెండు వృక్షములకు
    నడుమ భాగమునుండి పడిపోయె నా చెట్టు
    లంత శాప విముక్తి యగుట జేసి
    భక్తితో లేచి నిలబడి ప్రణతి సేసి
    స్తుతు లొనర్చుచు గంధర్వపతు లిరువురు
    బాలకృష్ణుని నుండి వీడ్కోలు గొనుచు
    నిజ గృహమ్ముల కేగిరి నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  2. బాల కృష్ణుడు బంధింప బడెను జూడు
    ఏమి పాపము జేసెనో నిలను నతడు
    పిల్ల వాడని జూడక పెద్ద శిక్ష
    వేసె నాయశో ద మ్మ ట బాసి కరుణ

    రిప్లయితొలగించండి
  3. అమ్మా!నా పలుకుల్ నిజమ్ము లివియే, యాలింపుమా! కోపమున్
    నిమ్మూలన్ నను కట్టివేయ తగునే? హే నందరాజా!వడిన్
    రమ్మా, నన్ విడిపింప! బాలుడనుగా లాలించు తల్లీ! యపా
    యమ్మున్ నన్ పడవేయకమ్మ! యకటా! యన్యాయమౌ, నమ్మవే!

    రిప్లయితొలగించండి
  4. బాలుడ వనుకొని పాపము
    రోలుకు గట్టిన యశోద రుసరుస గనుచున్
    లీలలు జూపించిమరల
    బాలుడి వలెమాయజేయు పట్టికి జేజే

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    చిత్రానికి తగిన చక్కని సీసపద్యాన్ని రచించి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘జేసెనో యిలను’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. చిత్రంలోని కృష్ణుడి నోటినుండి వచ్చిన మాటలా అన్నట్టుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. సహదేవుడు గారి పద్యములు......

    పాల దొంగలించగ నింట బాలుడైన
    క్షీర సాగర శయనుడు దూరె ననగ
    తల్లి రోటికిఁ గట్టెను తనయు నచట
    రోటి కాకాశమును గట్ట పాటి యగునె?

    దీన జనులను గాచెడు తేజమతడె
    రోలు లాగగ మాకుల రూపు మారె
    చిన్ని కృష్ణుని లీలలు చెవిన బడగ
    తేలి లాలించె ప్రభుని ముదిత యశోద

    లోకమ్ము సౌఖ్య మందగ
    శ్రీకారము జుట్టుమనెడు శ్రీపతి వచనం
    బాకారము దాల్చనిచో
    భీకర జగడమ్ము లెగయు వేదన మిగులున్!

    రిప్లయితొలగించండి
  7. పాల దొంగలించగ నింట బాలుడైన
    క్షీర సాగర శయనుడు దూరె ననగ
    తల్లి రోటికిఁ గట్టెను తనయు నచట
    రోటి కాకాశమును గట్ట పాటి యగునె?

    దీన జనులను గాచెడు తేజమతడె
    రోలు లాగగ మాకుల రూపు మారె
    చిన్ని కృష్ణుని లీలలు చెవిన బడగ
    తేలి లాలించె ప్రభుని ముదిత యశోద

    రిప్లయితొలగించండి
  8. సహదేవుడు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మన్నును తినరాదన్నను
    కన్నా! వినకుంటి వేమి కల్లలు తగునే?
    హన్నా లాభము లేదిక
    నిన్నీ రోటికిని గట్టి నే పోదునికన్

    రిప్లయితొలగించండి
  10. కట్ట గోపాలు రోటికి కన్న తల్లి
    లాగి రోటిని తనతోడ వేగముగను
    కూల్చె రెండు వృక్షములను, కూర మోచ
    నమ్ము యక్షులిరువురకు, నిమ్ముగాను

    రిప్లయితొలగించండి
  11. యక్షులిరువురకు (లేక) గంధర్వ సుతులకు

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో....

    చిలిపి కృష్ణుని పలుకులు
    =============*===================
    నవనీత చోర కృష్ణా
    అవమానము లేల మాకు,నతివల యింటన్
    నవనీత మేల?గట్టిన
    నవతల రోలుకు తెగిపడు నవరము లెల్లన్!

    ( అవరము = నీచము )

    గట్టిగ గట్టుడు రోలుకు
    పట్టుకు వచ్చెద రయమున పాశము తల్లీ
    కట్టలు ద్రెంచగ కోపము
    గట్టెను రోలుకు యశోద కన్నసుతుడన్!

    రిప్లయితొలగించండి
  13. గోరు ముద్దలు తినిపించి గోము గాను
    ప్రేమ మీరగ లాలించి ప్రీతి నొంది
    గోప కాంతల చాడీలు కోరి వినగ
    యేల నన్నిట్లు బంధించ మూల తగునె ?

    రిప్లయితొలగించండి
  14. వెన్ననుదినెనని రోటికి
    వెన్నుని కట్టంగ నెంచె నెలత యశోదా
    వెన్నును వంచుచు నిలబడె
    వెన్నెల నగుమోము వాడు వేడుక జూపన్


    అల్లరి జేసిన పిల్లడు
    నల్లని కన్నయ్యకేమొ నడుముకు రోలున్
    తల్లి యశోదయె కట్టగ
    నల్లన నొకకార్యమునకు నారంభమిదే.

    రిప్లయితొలగించండి

  15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    నిన్ను గోపిక రోట బంధించె ప్రేమ
    పాశముకు లొంగి పోతివి బద్దు డగుచు
    ఎంత పుణ్యమ్ము జేసెనో ఏమొ గాని
    పెంచిపాలించి నిన్ను లాలించు టకును

    రిప్లయితొలగించండి
  16. వెన్ననుదినెనని రోటికి
    వెన్నుని కట్టంగ నెంచె నెలత యశోదా
    వెన్నును వంచక నిలబడె
    వెన్నెల నగుమోము వాడు వేడుక జూపన్


    అల్లరి జేసిన పిల్లడు
    నల్లని కన్నయ్యకేమొ నడుముకు రోలున్
    తల్లి యశోదయె కట్టగ
    నల్లన నొకకార్యమునకు నారంభమిదే.

    రిప్లయితొలగించండి