1, నవంబర్ 2015, ఆదివారం

పద్యరచన - 1051

కవిమిత్రులారా!
“భరతభూమి రక్ష బడులు గుడులు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
(రామడుగు రాంబాబు గారికి ధన్యవాదాలతో...)

32 కామెంట్‌లు:

  1. భరత భూమి రక్ష బడులు గుడులు గాదు
    మహిని రక్ష జేయు మాన్యు డనగ
    కొండ కోనలందు కొదమసిం గపురీతి
    సంచరించు నట్టి సైనికుండు

    రిప్లయితొలగించండి
  2. భరతభూమి రక్ష బడులు, గుడులు, వరి
    మడులు, చెడుగుల దిగదుడుపులు, పెను
    జడుపు విడుపులు, కడు బడుగుల ముదములు,
    విడువ రాని జనుల నడుమ ముడులు!!

    రిప్లయితొలగించండి
  3. జిగురు సత్యనారాయణ గారూ,
    వృత్త్యనుప్రాసతో మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. దండయాత్ర లెల్ల దండిగా జరిగినా
    జడవ బోదు ధృడత విడదు
    వేదభూమి మనది వేల చరిత గలది
    భరత భూమి రక్ష బడులు గుడులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      'జరిగినన్' అనండి. రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  5. దండయాత్ర లెల్ల దండిగా జరిగినన్
    జడవ బోదు తాను ధృడత విడదు
    వేదభూమి మనది వేల చరిత గలది
    భరత భూమి రక్ష బడులు గుడులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దృఢతను ధృడత అన్నారు.

      తొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. అందరికినంస్కారములు.

    భరతభూమిరక్ష బడులుగుడులునాడు,
    నేడునాటిమాట నిజముగాదు.
    సగటుమనుజునకివి చాలదూరమ్మాయె,
    పూర్వవిధమునెట్లుపొందగలము?

    రిప్లయితొలగించండి
  8. భరతభూమి రక్ష గుడులు బడులు సుమ్మ
    పూర్వకాలమందు పుడమిలోన
    మారిపోయె నేడు మనుజుల మనసులు
    పగలతోడనవియు రగులుచుండె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. భరత భూమి రక్ష బడులు గుడులు మరి
    కార్మికులు భటిలురు కమతగాళ్ళు
    శాసనములు జేయు శాఖలందుజనులు
    ప్రాపు గాదె నిలకు పౌరులెల్ల !!!

    రిప్లయితొలగించండి
  10. భరతభూమి రక్ష బడులు గుడులు వేద
    శాస్త్ర తతులు మరియు సంయమనము
    భిన్న జాతు లైన భేదభావులు గారు
    భరత మాత ముద్దు పౌరు లెల్ల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. భరతభూమి రక్ష బడులు గుడులు కావు
    రాత్రి బవలు దేశ రక్షణమొన
    రించు జై జవాన్లు, రెక్కలోడ్చిభుక్తి
    జనుల కిచ్చు జై కిసాను లంతె.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. భరతభూమి రక్ష బడులు గుడులు కావు
    రాత్రి బవలు దేశ రక్షణమొన
    రించు జై జవాన్లు, రెక్కలోడ్చియు తిండి
    జనుల కిచ్చు జై కిసాను లంతె.




    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరతభూమిరక్షబడులుగుడులుగాదు
      మంచిశిక్షణగల మాన్యు డైన
      సైనికుండునగును శర్మ తెలియు
      బడులు గుడులు బుధ్ది వడయు మిగుల

      తొలగించండి
    2. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం.

      తొలగించండి
  14. భరత భూమి రక్ష బడులు,గుడులుఁ,జూడ
    బడులు తీర్చి దిద్దుఁ బండితులను
    యాలయాలు మదిని యాధ్యాత్మికతనింప
    ఋషులు కన్న కలలు వృద్ధినంద!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. భరత భూమిరక్ష బడులు ,గుడులటంచు
    విద్యకున్న శక్తి విశదబరచ
    భక్తి పుట్టుకలకు శక్తియు జనియించ?
    దేశ రక్ష దెలియ దివ్యరక్తి

    రిప్లయితొలగించండి
  16. భరతభూమి రక్ష బడులు గుడులహహ!
    బడులు బూజు బట్టె పాడుబడగ
    గుడుల లోని ధనము గోవింద!గోవింద!
    రాజకీయ మదియె రక్ష! రక్ష!

    రిప్లయితొలగించండి

  17. వేదధర్మపధము విభవమైనిండుట
    సత్యమార్గమందుసాగుటనగ
    భరతభూమిరక్ష ,బడులుగుడులు
    మహితపుణ్యదములు ,మహినిజూడ.

    రిప్లయితొలగించండి
  18. మనిషి యెదుగు నచట మానవత్వమ్మును
    మంచిచెడులు నేర్చి మసలుకొనుచు
    త్యాగగుణము గల్గి దయ జూపు ప్రాణుల
    భారత భూమి రక్ష బడులు గుడులు!

    రిప్లయితొలగించండి
  19. విద్యనేర్చునపుడు విద్యార్థిగా నుండి
    గుడుల పూజసేయ గురువునయ్యి
    సైనికుడిగ తాను చక్కగా కాపాడ
    భరతభూమి రక్ష బడులు, గుడులు!!

    రిప్లయితొలగించండి