=======*=========== భోగియై విరాగియైన పుణ్య మూర్తి పుడమిపై రోగములకు వేసె రాతి రోటి మందు యోగియై జాగు సేయక గురు సేవ జరుపు మనుచు గురువుగా రాగ యుక్తముగను బల్కె రాజశేఖరుండుగా
పంతుల గోపాల కృష్ణారావు గారికి, అభినందనములు. మిమ్మల్ని ఇంతకుముందు శంకరాభరణ బ్లాగునందు చూసినట్లు లేదు. మీ పద్యం చాలా హృద్యంగా ఉంది. మనసా అభినందనలు. టి. బి. ఎస్ శర్మ గారు ! "పద్య రాజ్య మేలె ప్రతిభ తోడ" దీన్ని మీకు కూడా అన్వయించవచ్చని తోస్తున్నది. "వేమన మనకిచ్చె వే మన సుమములు" అన్నచోట వేవేల సుమములు గా మారిస్తే బాగుంటుందేమో పరిశీలించగలరు. ( నాకది ఛందోబద్ధమౌనొ, కాదో తెలియదు... అలా అనిపించిందంతె) భావాన్ని గ్రహించగలరు. అభినందనలతో....
వేమన వెలదిని వదలెను
రిప్లయితొలగించండివేమన తానాట వెలది వినుమని వ్రాసెన్
వేమన పద్యము లనగ ని
వేమన పద్యములనట్లు వేడుక గలుగున్
రిప్లయితొలగించండిరాసి పోయినాడు మనవాడు పద్యాలు
అవి రాసి పోసి ఉన్నవి మనకి ఈనాడూ
చెదిరి పోనివి అవి ఏనాడూ, అవే మన
వేమన పద్యాలు వినవె బ్లాగు బాల !
జిలేబి.
జిలేబి గారి భావానికి పద్య రూపముకై ప్రయత్నించాను.
రిప్లయితొలగించండివ్రాసెను వేమన ముందట
పోసెను ఘన పద్య రాశి పుణ్యము మనదే
వాసిగ తెనుగున, చదువగ
జేసిన పిల్లలకు శుభము చేకురు గదరా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేమన పద్యముల్ మిగుల వేడుకనభ్యసనమ్ము జేయనం
రిప్లయితొలగించండిదే మన యుప్పుకప్పురమదే విధముండుట జెప్పె యుక్తిగా
నీ మనుజుండె చిత్తము మరింతయు శుద్ధిగ జేయు రీతి దా
నేమరకుండ బల్కె; ధర నీతని సూక్తులు నిత్యసత్యముల్.
ఒప్పుల కుప్పయె శతకము
రిప్లయితొలగించండినుప్పున జవులెన్నొ గూడి, యుక్తుల బర్వన్
గప్పుర పరిమళ సాంద్రము
సెప్పెను వేమన్న నీతి జెవులకు నింపున్ !
విశ్వ దాభి రామ ! వినుర వేమ!యనుచు
రిప్లయితొలగించండిదనకు దాను జెప్పు కొను విధముగ
నీతు లుడివె జాల నీ తి శతకముగ
మఱువ దగని వవియ మనుగడకిల
శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభివందనము జేయుచు
రిప్లయితొలగించండిశ్రీ శ్రీ వేమన కవి గారికి పాదాభివందనములు.
వారి పద్యములను చదివి,నేను నిత్యానందపై పద్యములను వ్రాయుట జరిగినది.ఆ మొదటి పద్యమును శ్రీ శంకరయ్య గురువుగారు జూచి మెచ్చుకొని "శంకరాభరణం " బ్లాగు చూడమని జెప్పియుంటిరి.
========*===========
ఆటవెలధి నీటెను వాడె వాటముగను
క్రూర కట్టు బాట్లను ద్రుంచ,కుమ్మరిగను
తేటగీతి,కందము లందు తేట తెనుగు
బూసి వ్రాసె శతకములు పుణ్యముర్తి ।
ఆట వెలది తోడ నాట లాడుచు నుండి
రిప్లయితొలగించండిఆట వెలది యొక్క ఆట నెరిగి
ఆట వెలది తోడ నాటాడె పద్యముల్
పేట పేట నందు వేన వేలు.
అనుభవాల నింపి యల్లిన పద్యాలు
రిప్లయితొలగించండివేమన పలుకంగ వేదమయ్యె
తెలుగు వారి నోట దినమొక సారైన
నుచ్ఛరించ బడెడు యోనమాలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలదు లందు నలవోకగా వేమ
రిప్లయితొలగించండిమంచి చెడుల నెన్నొ మనకు జెప్పె
లోకమందున గల లౌకిక విషయాలు
వినుతి కెక్కు రీతి విన్నవించె
ఆట వెలదిఁ మీటు వాటమెరుఁగ వారు
రిప్లయితొలగించండితేట తెనుగు వీణ మీటినట్లు
మనుజ జాతి యెపుడు మరువజాలనటుల
తీర్చి దిద్ది నాడు తెగువఁ జూపి
కాకి పికము రూపు లేక రీతిగ నుండు
రిప్లయితొలగించండివినగ వినగ స్వరము విధము దెలియు
కుకవు లందు మెలగు సుకవులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ
భోగి వేమన వికటించి యోగి యయ్యె
రిప్లయితొలగించండికామ క్రోధము లనువీడి కాళి గొలిచి
నీతి పద్యము లల్లెను ప్రీతి గాను
యశము నొందెను నేటికి శతక కర్త
గణ దోషములను సవరించుచూ
రిప్లయితొలగించండితేనె పల్కులొలుకు తేటతేటపదాల
………. తెనుగుద నమునకు తియ్యదనము
దేశదేశంబుల తెల్గువారలయందు
………. నొక్క పద్యము రాని యొంటి గలడె?
శ్రమజీవ స్వేదనాశ్రయమైన శ్రావ్యంపు
………. శస్త్రాస్త్ర సంధాన సంచయమ్ము
సంప్రదాయపు దుష్ట సంభావ్య భావాల
………. సవ్యరీతిని జెప్పె నవ్య గతుల
భవ్య దివ్య నవ్య భావాల నొప్పెడు
పద్య రాజ్య మేలె ప్రతిభ తోడ
వేమన మనకిచ్చె వే మన సుమములు
“విశ్వదాభిరామ!” పిలువ వేమ.
@రాజేశ్వరి నేదునూరి గారూ -- వేమన జీవితాన్ని గురించి ఒక పాదంలో చెప్పారు. వావ్.
రిప్లయితొలగించండిభోగి వేమన వికటించి యోగి యయ్యె
@గోలి హనుమచ్ఛాస్త్రి గారూ --
రిప్లయితొలగించండిజిలేబి గారి భావానికి పద్య రూపము బాగుంది.
వ్రాసెను వేమన ముందట
పోసెను ఘన పద్య రాశి పుణ్యము మనదే
రిప్లయితొలగించండితేటతెనుగునందు తెల్లముగ రచియించె
సూక్తులెన్నొ సత్యశోధనమున
వెలది విడచి ' యాటవెలదిని 'జేపట్టి
వెలుగుదారి జూపె వేమరెడ్డి.
సాధనమ్మున పనుల్ సమకూరు ధరలోన
రిప్లయితొలగించండి.........తినగ తినగ వేము తీపి కాదె
లోభివాని నడుగ లాభమ్ము లేదయా
.........గొడ్డుటావు బిదుక గూడ దిలను
పురుషు లందున పుణ్య పురుషులు వేరగు
.........నుప్పు కప్పురముల యునికి రీతి
స్థాన బలిమి మిన్న తన బలమ్మున కంటె
.........బయట బడిన మొసలి భంగ పడదె
విశ్వ మానవాళి వేవేల సుఖములు
బడయ వలయు నీతి పథము నెరిగి
విశ్వదాభిరామ! వినుర! వేమా! యని
యెలుగు నెత్తి చాటి నిలచె నతడు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి=======*===========
రిప్లయితొలగించండిభోగియై విరాగియైన పుణ్య మూర్తి పుడమిపై
రోగములకు వేసె రాతి రోటి మందు యోగియై
జాగు సేయక గురు సేవ జరుపు మనుచు గురువుగా
రాగ యుక్తముగను బల్కె రాజశేఖరుండుగా
వేమా యను మకుటముతో
రిప్లయితొలగించండివేమన పద్యాల ఆటవెలదులు అన్నీ
సామాన్యుల నాల్కలపై
వేమరు నర్తించుచుండు వేయేండ్లయినన్
లక్కరాజు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఆటవెలది చేత నాడించి పాడించి
రిప్లయితొలగించండినోట నుడువ బనిచె మేటి నీతి
తేట తెనుగు వీణ మీటించి వేమన్న
బాట జూపె జనగ భావికవుల
వేమన్న వేదమ్ము
రిప్లయితొలగించండిమిస్సన్న పద్యమ్ము
నేమన్న హృద్యమ్మునందు
కోమన్న గీతాభినందనల్
శ్రీ లక్కరాజు గారికి ధన్య వాదములు
రిప్లయితొలగించండిఆటగత్తెనొదలి ఆటవెలది బట్టె
రిప్లయితొలగించండిచేలమొదలి కట్టె చిన్న గోచి
ముక్కుపుడక తెచ్చె ముక్తిని వేమకు
కామి అయ్యి, మోక్షగామి అయ్యె.
పంతుల గోపాల కృష్ణారావు గారికి,
రిప్లయితొలగించండిఅభినందనములు. మిమ్మల్ని ఇంతకుముందు శంకరాభరణ బ్లాగునందు చూసినట్లు లేదు.
మీ పద్యం చాలా హృద్యంగా ఉంది. మనసా అభినందనలు.
టి. బి. ఎస్ శర్మ గారు !
"పద్య రాజ్య మేలె ప్రతిభ తోడ" దీన్ని మీకు కూడా అన్వయించవచ్చని తోస్తున్నది.
"వేమన మనకిచ్చె వే మన సుమములు" అన్నచోట వేవేల సుమములు గా మారిస్తే బాగుంటుందేమో పరిశీలించగలరు. ( నాకది ఛందోబద్ధమౌనొ, కాదో తెలియదు... అలా అనిపించిందంతె) భావాన్ని గ్రహించగలరు. అభినందనలతో....
అంకిలెఱిగి మాటలాడనేర్చెనపుడె
రిప్లయితొలగించండిపిన్నపెద్దతనములెన్ననేల?
పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా?
విశ్వదాభిరామ వినుర వేమ.
ఏర్చి కూర్చి పేర్చి ఎన్నియో నీతుల
రిప్లయితొలగించండిమూడుపదములందు మృదువుగాను
వేదసార మంత వేమనయేజెప్పి
విశ్వమెల్ల తెలుగు వెలుగు నింపె !!!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న గ్రామాంతరం వెళ్ళడం వల్ల పూరణలను, పద్యాలను చూసి వ్యాఖ్యానించే అవకాశం లభించలేదు. మన్నించండి.
వేమనపై చక్కని పద్యాలను పంపిన మితులు....
గోలి హనుమచ్ఛాస్త్రి గారకి,
లక్ష్మీదేవి గారికి,
గన్నవరపు నరసింహమూర్తి గారికి,
సుబ్బారావు గారికి,
వరప్రసాద్ గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
కమనీయం గారికి,
మిస్సన్న గారికి,
పంతుల గోపాలకృష్ణారావు గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
సాహిత్యాభిమాని గారికి,
మంద పీతాంబర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
తోపెల్ల వారూ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిమ్మల్ని గురించి సాహిత్యాభిమాని గారు వెలిబుచ్చిన అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.