15, మార్చి 2013, శుక్రవారం

పద్య రచన – 281 (శల్య సారథ్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"శల్య సారథ్యము"

17 కామెంట్‌లు:

  1. ధర్మయుతులకు రణమందు తనదు చేత
    నైన సాహాయ్యమునుఁ జేయ- నినసుతునకు
    రణమున శల్యుండను రాజు రథముఁ ద్రోలు
    వేళ కర్ణునితో ధృతి వీడఁ బలికె.

    రిప్లయితొలగించండి
  2. వీరత్వము మనకున్నను
    నీరసమును దెచ్చు మాట నెయ్యెడ బలికే
    తీరే శల్యుని పద్ధతి
    ఆ రథ సారధ్యమన్న నది మన బలికే.

    రిప్లయితొలగించండి
  3. సారథ్యంబును బూని శల్యుడు మహాసంగ్రామ రంగమ్ములో
    వీరావేశ విరాజితున్ రవిసుతున్ వీక్షించుచున్ బల్కె ని
    స్సారంబున్ బొనగూర్చు బల్కులు నిరుత్సాహంబు గల్పించు న
    ట్లౌరా! యవ్విధమే ప్రసిద్ధి గనె శల్య ప్రఖ్య సారథ్యమై

    రిప్లయితొలగించండి
  4. తిక్కన కవితాశిల్పం :(శల్యుడు అర్జునుడితో కర్ణుణ్ణి పోలుస్తూ చెప్పిన మాటలు):


    సీ.
    రోషమహాటోపభీషణహరి తోడ
    ........................ సమరంబునకు హరిణము గడంగి
    దానధారాభీలదంతావళము తోడ
    ....................... సంగ్రామమునకు శశంబు గడఁగి
    చండస్వభావోగ్రపుండరీకము తోడ
    ......................... నాజికి సారమేయంబు గడఁగి
    దారుణతుండాతి ఘోరగృధ్రము తోడఁ
    ......................... గలహంబునకు నురగంబు గడఁగి
    ఆ. వె.
    యడరు నట్లుగాదె యస్త్రకళాసము
    జ్జ్వలుఁడు పార్థుతోడ సంగరమున
    కీవు గడఁగి యడరుటెల్ల రాధేయ, నీ
    కెట్టిబలము నమ్మ నెందు గలదు (కర్ణ. 2.42)

    రిప్లయితొలగించండి
  5. శల్యు డనువాడు కర్ణుని సార ధి యయి,
    గెలువ లేనిచొ వారలు గేలి సేతు
    రనుచు భయమును రేకెత్త నతడు పొగిలె
    శల్య సారధ్య ఫలమిది సములు లార !

    రిప్లయితొలగించండి
  6. ముందు కెగయఁ జూడగ తా
    గందర గోళంబుఁ జేసి గతిఁదప్పించున్
    పొందగ రథి వైఫల్యము
    చందనమనుకొనుట శల్య సారథ్యమనన్!

    రిప్లయితొలగించండి
  7. శల్య సారథ్యము......

    శస్త్రాస్త్రవిద్యనీశ్వరునితోఁబోరాడె
    పరశురామునిచేత భంగపడితి
    వఖిలలోకాధీశుఁడాతనిసారథి
    గతిలేని నీకు సారథిని నేను
    దేవేంద్రసుతుఁడు తా దివ్యధనుర్ధారి
    కవచ కుండలములఁ కానవీవు
    గీతోపదేశంబు కృపగాంచె పార్థుండు
    చపలచిత్తుడవైన కుపితుడీవు

    కఠినపాషాణపర్వతాఘటితమేష
    గతిని కల్గించు నీకు సంగరము నేడు
    ఇంతఁజెప్పిన వినవిసుమంతయైన
    దైవనిర్ణయమెన్నుట తప్పుగాదె.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి ప్రతిభ ఈ పద్యములో ప్రస్ఫుటముగా గోచరించుచున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. "శల్య సారథ్యము"పై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యంలో రెండు టైపాట్లు కనిపిస్తున్నవి.
    మొదటి పాదంలో "తనకు చేతనైన..." మూడవ పాదంలో "రణమునను..." అనికదా ఉండవలసింది..
    *
    గోలి వారూ,
    ’పలికే" అని వ్యావహారికం ప్రయోగించారు. "ఎయ్యెడ నను నా..." అందామా?
    *
    సుబ్బారావు గారూ,
    "సములు లార"?
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రత్యేకంగా అభినందించ దగిన మనోహరమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. పార్థుని మౌల్యము పార్థసారధి;నీకు
    ………. మౌల్యము రారాజు మత్సరమున
    శక్యమె తుల్యత శంకరు మెప్పున
    ………. పాశుపతంబొందు ఫల్గునియెడ
    గురుభీష్మద్రోణుల కుల్యుడర్జునుడన
    ………. ఖల్య సంపర్కాన ఖలుడవీవు
    స్థౌల్యమరయ నీవు సంగరమందున
    ………. మూల్యము చెల్లించి మునిగి పోదు

    లౌల్య భావాల నోడంగ లజ్జ లేక
    సవ్యసాచిచేత యనుచు శల్యు డటుల
    శూల్య శల్యపు మాటల సూక్తు లిడెను
    సారమంత కర్ణునికి నిస్సార మవగ.

    రిప్లయితొలగించండి
  11. గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి, పూజ్యనీయులైన శ్రీ నేమాని గురువులకు నమస్కారములు.

    పద్యరచన చేయడానికి తగు ప్రోత్సాహాన్ని సూచనలను అందజేస్తున్న ఇరువురు గురువులకు శిరసాభివందనములు.

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గరూ! శుభాశీస్సులు.
    శల్య సారథ్యమును మనము చూడలేదు కానీ, మీ కవితా సామర్థ్యమును ఆనందముతో చూచేము. బాగు బాగు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. అడుగడుగున వెన్నుతట్టి సాన బెట్టుచూ శిష్యవాత్సల్యము జూపు మాన్యశ్రీ నేమానిపండితార్యులకు శిరస్సు వంచి పాదాభివంద్నము చేయుచున్నాను.

    రిప్లయితొలగించండి
  14. అమితోత్సాహము నీదు వైభవమహో! ఆనంద సాంద్రాకృతీ!
    కమనీయార్థ సువర్ణశోభితముగా గ్రాలున్ సదా నీదు ప
    ద్యములో భవ్య గుణాభిరామ! శుభధామా! మంగళాశీస్సులన్
    ప్రమదంబొప్పగ నీకు గూర్తు నివె సుబ్రహ్మణ్య శర్మా! సుధీ!

    రిప్లయితొలగించండి





  15. కలదు శల్యసారథ్యమ్ము ,కలదు నేటి
    కాలమందు స్వపక్షమ్ము గలచివైచి
    వెన్నుపోటును బొడుచుచు విజనులకు స
    హాయమందించు కపటజనాళి కలరు.

    రిప్లయితొలగించండి