20, నవంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1551 (పాదమ్ములు లేని తరులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.
(1901 లో విశాఖపట్టణంలో జరిగిన తిరుపతివేంకటకవుల అష్టావధానములోని సమస్య)

59 కామెంట్‌లు:

subbarao చెప్పారు...

ఏదరి జూచిన నుండవు
పా దమ్ములు లేని తరులు ,పరుగిడ జొచ్చె
న్నాదర బాదర నొకపులి
తా దాపున వేటగాడు తరుముచు రాగన్

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

సాగుతున్న రైలులోనుండి బయటకు చూస్తే - పరుగెత్తేవి పాదపమ్ములే గదా :

01)
____________________________

పోదామని తిరుపతికే
సాధారణ బోగి యందు ♦ సాగుచు నుండ
న్నాదూరమ్మున గనపడు
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
____________________________

వసంత కిశోర్ చెప్పారు...

సైనికులు, పోలీసులు ఏదైనా భవనమును చుట్టుముట్ట దలచినపుడు
పొదల నడ్డం పెట్టుకొని ముందుకు సాగునపుడు కనుపించేదదే మరి :

02)
_____________________________

సోదా చేయగ భటులే
గోదా లోనికి దిగుటకు ♦ గుట్టుగ పొదలన్
బోదురు గద దానిని గన
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________

వసంత కిశోర్ చెప్పారు...

"లార్డ్ ఆఫ్ ద రింగ్స్" సినిమాలో నే జూసిన వింత - చెట్లు పరుగెడు తుంటాయి :

03)
_____________________________

ఏదో యొక సినిమాలే
చూదామని వెళ్ళి నేను ♦ చూసిన వింతే
పోదూ యందురు చెప్పిన
"పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ "!
_____________________________

వసంత కిశోర్ చెప్పారు...

నాలుగైదు అడుగుల ఎత్తున్న కొబ్బరి మొక్కలను నర్సరీ
నుండి తోటలో పాతుటకు ట్రాక్టరులో తీసుకెళ్తున్నప్పుడు :

04)
_____________________________

గోదావరి తీరములో
పాదపములను తరలించు - పాటున్ జూడన్
సాధారణ శకటములో
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________

వసంత కిశోర్ చెప్పారు...

వరి చేను నాటే వాళ్ళు వరి మొక్కల కట్టలను తలపై పెట్టుకొని
ఒక మడిలో నుండి మరొక మడి లోనికి వెళ్ళడాన్ని గమనిస్తే :

05)
_____________________________

మోదలుగా వరి మొక్కల
నౌదల దాల్చిన యువతులు ♦ నయముగ పాఱన్
కాదా మరి వింతయె గన
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________
మోద = కట్ట
ఔదల = తల
పాఱు = పరుగెత్తు

వసంత కిశోర్ చెప్పారు...

హుద్‌హుద్ తుఫాను లో గాలి వేగం 209 కిలోమీటర్లు గంటకు
ఆ వేగానికి పీకబడిన చెట్లూ, విరిగిన కొమ్మలూ చేసిన దదే గదా:

06)
_____________________________

బాధా మయమౌ గాలే
బోదెల, గొమ్మలను వేగ ♦ మోసుకు పోవ
న్నదియును విధికృత చిత్రమె
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________

Sumalatha Majeti చెప్పారు...

హనుమంతుడు లంకకు పోవటానికి ఎగిరినప్పుడు, గిరి కదలి, చెట్లపై నుండి మెరిసే సుగంధ పుష్పములన్ని రాలగ, బలమైన గాలికి, అతని వెనుకనే, చెట్లు కూడ ఎగిరి కొంత దూరము ప్రయాణించాయని, వాల్మీకి సుందరాకాండలో చదివినట్టు గుర్తు.

పాదము దన్ని నెగురగ ధ
రాధరము కదలి సుగంధ లసిత కుసుమముల్
పాదపములవీడ పిదప
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్ !

వసంత కిశోర్ చెప్పారు...

శ్రీకృష్ణ పాండవీయము చిత్రములో
ఛాంగురే బంగారు రాజా పాట తరువాత
భీముడూ హిడింబాసురుడూ చెట్లు పీకి విసురుకున్నప్పుడు :

07)
_____________________________

క్రోధోద్ధురుడై భీముడు
నా దారుణ రూపి యైన - నర భక్షకుడే
పాదపములతో బోరిన
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________

శంకరార్యా !

"పాండవీయము " నకు

సంధికార్యము మరియు అర్థము చెప్పండి

వసంత కిశోర్ చెప్పారు...

లంకలో రాక్షసులతో పోరిన హనుమకు - పాదపములే గద - ఆయుధములు :

08)
_____________________________

శోధింపగ సీతమ్మను
కైదువు గద పాదపమ్మె ♦ కలహించుటకై
యోధులతో హనుమంతుడు
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________
కైదువు = ఆయుధము

వసంత కిశోర్ చెప్పారు...

కఠినమైన సమస్య విన్న వెంటనే యొక యవధాని స్వగతం
పాదపములు పరువెత్తడ మేమిట్రా - భగవంతుడా - కరుణించు :

09)
_____________________________

బాధా మయమీ పూరణ
"పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చె "
న్నో దేవా కరుణింపుము
సాధింపగ నీ సమస్య ♦ సరిపడు రీతిన్ !
_____________________________

వసంత కిశోర్ చెప్పారు...

చివరకు - భగవంతుని కరుణ - అవధానికి స్ఫురణ :

10)
_____________________________

పాదమ్ములు పరువెత్తగ
నేదైనను జీవ జాతి ♦ కిమ్మహి వలయు
న్నేదీ చూపు మదెచ్చట
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________

వసంత కిశోర్ చెప్పారు...

అదేదో సినిమాలో రాక్షసుడో యక్షుడో ఆవహించిన చెట్టు ఎగురుతుంటుంది
కొంతమందికి ఉపకారం చేస్తేనే శాప విమోచనం !
కాంతారావు ఆ చెట్టు సాయంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంటాడు :

11)
_____________________________

పాదపమున నో యక్షుడు
పాదుకొనెను శాప వశము ! - పాపము దీరన్
వేదన దీర్చగ జనులకు
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్ !
_____________________________

krkr చెప్పారు...

కాదారి వేళ తరులవి
రాదారిన సాగుచుండె రాక్ష స లీలన్ ,
శ్రీ దర్శన చందనముల
పాదమ్ము లు లేని తరులు పరిగిడ జొచ్చెన్
కొరుప్రోలురాధా కృష్ణ రావు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కిశొర్జీ ! ఈ రోజు పరుగెత్తే పాదపములన్నింటినీ మీరే పట్టుకున్నారు..అభినందనలు..
మాకు మాకొకటైనా దొరుకుతుందా...చూస్తా...

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

దుబాయి లో పాత పెట్టుటకు ఈత చెట్లును హెలికాప్టరు సాయంతో తీసికెళ్ళారు ఆ చిత్రాన్ని ఇక్కడ చూడ వచ్చు

http://www.khaleejtimes.com/images/fly1711.jpg

ఏ దారీ లేనప్పుడు
పైదారే గతి ఎడారి ప్రాంతము నందున్
కాదా చిత్రము చిత్రము
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

రాదారి మీద జోరుగ
మోదమ్మున సాగుచున్న మోటరు కారున్
లోదరి బుడుగిట్లనియెను
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.

sailaja చెప్పారు...

ఈదురు గాలులు ధాటికి
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్
భూదేవియె శోకించెను
రాదారుల పాదపములు రాలుటగనుచున్

sailaja చెప్పారు...

ఓ దేవా! కరుణించుము
సాధించగ నీ సమస్య సద్భావముతో
నీదయయున్నను ధరలో
పాదమ్ములు లేని తరులు పరుగిడజొచ్చెన్!!!

కంది శంకరయ్య చెప్పారు...

తిరుపతి వేంకట కవుల పూరణ....
ఏదెస వానలు గురియన్,
గోదావరి పొంగివచ్చె గుములుగ నందున్,
వేదొరలి నీట దృఢతర
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ఖేదంబుల నెలవై ని
ర్వేదంబుల సాక్షియై భవిత శూన్యంబై
రాదే హుధుద్ వరదన్
పాదపములు లేనిచెట్లు పరుగిడజొచ్చెన్

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
ఈరోజు మీరు విజృంభించి పూరణలు చే(స్తున్నా)శారు. మీ పదకొండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆరవపూరణలో ‘గాలే’ అన్నారు. గాలియె అనండి.
‘అనియర్’ ప్రత్యయం (సంబంధించినది అనే అర్థంలో) చేర్చినప్పుడు పాండవ, రాఘవ, బిల్హణ శబ్దాలు పాండవీయము, రాఘవీయము, బిల్హణీయము అవుతాయి.. పాండవీయము = పాండవులకు సంబంధించినది అని అర్థం.
****
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Venki చెప్పారు...

ఖేదములఁ బాప తరులకు
న్నాదైవమ్మిడ కదలిక లానందముగన్
భూదానవులకు చిక్కక
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

Venki చెప్పారు...

ఖేదములఁ బాప తరులకు
న్నాదైవమ్మిడ కదలిక లానందముగన్
భూదానవులకు చిక్కక
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

A.Satyanarayana Reddy చెప్పారు...

ఖేదములఁ బాప తరులకు
న్నాదైవమ్మిడ కదలిక లానందముగన్
భూదానవులకు చిక్కక
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం ప్రారంభంలో ద్విత్వం (న్నా) అవసరం లేదు. దానివల్ల గణదోషం. టైపాటు కావచ్చు.

A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...

పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. మన్నించండి. పొరపాటున మా అబ్బాయి మైయిలు ద్వారా రెండు సార్లు పోష్టు అయ్యింది. తమరి సవరణకు ధన్యవాదములు.

A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
A.Satyanarayana Reddy చెప్పారు...

వసంత కిషోరు గారు ఈరోజు విశ్వ రూపం ప్రదర్శించారు. "ధ" కు "ద" కు ప్రాస చెల్లుతుందా? దయ చేసి తెలియ జేయండి.చిన్న చిన్న అనులమానా లొస్తున్నాయి.

Unknown చెప్పారు...

పూజ్యగురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు

ఆదుష్ట తుఫానుకు బలి
పాదమ్ములు లేని తరులు.పరుగిడ జొచ్చె
న్నాదరి గుహలన్ దాగగ
భేదమ్ములు మఱచి ప్రాణభీతిని మృగముల్

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
‘స్వవర్గజప్రాస’ పేరుతో థ,ధలకు, ద,ధలకు ప్రాస వేయడం ఉంది. కాని సాధ్యమైనంతవరకు దానిని పాటించవద్దని నా సలహా.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...


కె ఈశ్వరప్పగారి పూరణ

ఆదరణకు నోచని పా
పా!దమ్ములు లే నితరులు పరుగిడ?జొచ్చెన్
మోదమ్మొసగెడి బుద్ధి వి
వాదము లేనట్టి చదువు వంతుగ నీలో

Unknown చెప్పారు...


కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

ఆధూమశకట మేగన్
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్
భూధరములు తిరుగాడెన్
బోధపరచునీవిషయము భూభ్రమణ౦బున్

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
గోదావరి ఉప్పొంగగ
రాదారిన నీరు జొచ్చి రయమున బారన్
ఆ దుడుకు నీటి ధాటికి
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్.

కంది శంకరయ్య చెప్పారు...

కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకర్ చెప్పారు...

కేదారుని క్షేత్రమున ప
యోదము లెల్ల గురిసి వరద లురకలు బెట్టన్
ఆ దరిదాపున యుండెడి (కేదారునితో బాటుగ)
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్!

కంది శంకరయ్య చెప్పారు...

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో గణదోషం. ‘ప|యోదములే గురిసి...’ అనండి. ‘దాపున నుండెడు’ అని ఉండాలి.

బొడ్డు శంకర్ చెప్పారు...

ధన్య వాదములు గురువు గారు, సవరణతో

కేదారుని క్షేత్రమున ప
యోదములే గురిసి వరద లురకలు బెట్టన్
ఆ దరిదాపున యుండెడు
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కవిమిత్రులకు నమస్కారములు!

మోదముతోడుత నరులటఁ
బాదపముల మొదలు నఱకి వాహనమం దా
ఛేదిత తరులనిడి నడుపఁ
బాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!

(పాదములు=వ్రేళ్ళు)

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా రెండవ పూరణము:

మోదిత మతులై నఱకిన
పాదపములఁ బల్లమునకుఁ ♦ బడఁద్రోయంగన్
రోదించుచు దొరలుచు నా
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!

krkr చెప్పారు...

కాదారి వేళ తరులవి
రాదారిన సాగుచుండె రాక్ష స లీలన్ ,
శ్రీ దర్శన చందనముల
పాదమ్ము లు లేని తరులు పరిగిడ జొచ్చెన్
కొరుప్రోలురాధా కృష్ణ రావు

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

వాదమ్మున నిలువకున్న
మోదమ్మది కాదువిద్య-మూలము నీటన్
వే దేలియాడు చుండెడి
పాదమ్ములు లేనితరులు పరుగిడ జొచ్చెన్

పాదులు పూవులు చెట్లున్,
తాదమ్మున నిలచు,పెద్దతరువులె కూలున్
వే దూకెడి వాగులచే
పాదమ్ములు లేని తరులు పరుగిడజొచ్చెన్

వే దలలూచుచు గాలికి
నాదమ్ముల నిడెడి చెట్లు నాశనమయ్యెన్
హుదూద్ తుఫాను దెబ్బకు
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

పాదాలను చేర,బదరి
నా దారుణ యాత్రలోన నదులే పొంగన్
కేదార తీరమందున
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

వే దేలియాడు తూడది
మీదను తేలుచు పరుగిడు మెల్లగ,వరదన్
చీదర చేయుచు నీటిని
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

కంది శంకరయ్య చెప్పారు...

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘హుదూద్’ అన్నచోట గణదోషం. ‘హూదుద్’ అనండి.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

యతి చలవన ప్రవరుం డ
ప్రతి హతముగ చనుచునుండ పాదమ్ములు లే
ని తరులు పరుగిడఁ జొచ్చెన్
క్షితిమండలమంత యతనికింపుగ తోచెన్

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా మూఁడవ పూరణము:

(సత్యభామా సమేతుఁడై శ్రీకృష్ణుఁడు నందవవనమందలి పారిజాతవృక్షమునుం గొని, గరుడునిపైనిడుకొని పైకెగురఁగా, గరుడుని ఱెక్కల గాడ్పుల తాఁకిడికి పెల్లగిలిన యితర దేవతరువులు కూడ నా గాలితోపాటు పైఁకిలేచి వెంటఁదవిలిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)

మోదము సతికిడ దివిఁ జని,
పాదపముం గొనియు గరుడ ♦ వాహనము పయిన్
బోఁదలఁచి యెగుర, గాలినిఁ
బాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!


కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
సమస్య పాదాన్ని స్థానభ్రంశం చేసి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
****
గుండు మధుసూదన్ గారూ,
మీ మూడవ పూరణ ముచ్చటగా ఉండి అలరించింది. అభినందనలు.

Unknown చెప్పారు...

పాదమ్ములు లేక జలము,
పాదమ్ములు లేని పాము పరుగిడు, నిక నే
పాదములు లేక గా,లెటు (గాలి+ఎటు)
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆదాయమొసఁగు భూములు!
రాదారులు పట్ట నటుల లావాదేవీ
లా! దిశను రాచవీడని
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!
( తరి = మాగాణి, తరులు = మాగాణులు )
లేక ( తరువు = తొందర, తరులు = తొందరలు)

వసంత కిశోర్ చెప్పారు...

శాస్త్రీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు !

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

పాదుపముల రక్షించుచు
నాదుకొనన్నెవరు లేక యడవుల లోనన్
ఛేదింపగ వృక్షంబుల
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాదపముల.. పాదుపముల అని టైప్ అయింది.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

యాదవ ప్రసాదు లాలుని
మోదమ్మగు పాలనమున పోచలు మరుగై
గేదెలు స్త్యేనమ్మివగా
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

Zilebi చెప్పారు...


ఎన్ డీ టీ వి వార్త చదివేక

ఆదరముగ చెట్లనటన్
వేదారణ్యంబుగాను వేడ్కగ నిలుపన్
బాధాతప్తులవంగన్
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్!


తెలంగాణా లో ట్రీ ట్రాన్స్ ప్లాంట్ !



https://www.ndtv.com/telangana-news/a-telangana-hospital-that-gives-dying-trees-a-second-life-1845101


జిలేబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

చాదస్తముతో పరుగిడ
గోదావరి యొడ్డు నున్న కొండొక గజమే
పాదమ్ముల పీకి తరులు
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

పాదము = 1. వేరు, 2. కాలు