శ్రీపతి శాస్త్రి గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని ‘ప్రాస’ను గమనించలేదు. సమస్యపాదం అన్వయిస్తున్నట్లు కూడా లేదు. అన్వయం కుదరకున్నా మీ భావానికి ప్రాస సవరించిన నా పద్యరూపం ...
మాస్టారూ, క్రింది సమస్యను పరిశీలించి వేయవలసినదిగా మనవి. ఈ రోజు టీవీ లో చూసిన సంఘటనే ప్రేరణ (ఢిల్లీ ఆంధ్ర భవన్లో జరిగింది): భృత్యుని మోదగ హరీశుఁ బలుమెచ్చిరహో!
చంద్రశేఖర్ గారూ, మంచి విషయంతో సమస్య నిచ్చారు. కాని యతి తప్పింది. సవరించి ఇస్తాను. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, అంటే ఇవన్నీ మామ అత్త దగ్గర చూపించాడా? అయితే బాగుంది. మంచి పూరణ. అభినందనలు. * మందాకిని గారూ, చక్కని పూరణ. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
ఫణి ప్రసన్న కుమార్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, ఇప్పుడు మీ పూరణ సలక్షణంగా శోభిస్తున్నది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ శ్రేష్ఠమై అలరారుతున్నది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, సమయానుకూలమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపదముల గూర్చగ పద్యము
కుదరదులే యతి గణములు కొదవైనపుడున్
కుదురుగ కబ్బము వ్రాయగ
మగడెఱుగని మర్మములవి మామ యెఱుంగున్
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని ‘ప్రాస’ను గమనించలేదు. సమస్యపాదం అన్వయిస్తున్నట్లు కూడా లేదు. అన్వయం కుదరకున్నా మీ భావానికి ప్రాస సవరించిన నా పద్యరూపం ...
సొగసగు పద్యముఁ గూర్చఁ బొ
సగవు యతి గణములు; ప్రాస సరిపోదు కదా!
తగ నొక కబ్బము వ్రాయఁగ
మగడెఱుగని మర్మములవి మామ యెఱుంగున్
మాస్టారూ, క్రింది సమస్యను పరిశీలించి వేయవలసినదిగా మనవి. ఈ రోజు టీవీ లో చూసిన సంఘటనే ప్రేరణ (ఢిల్లీ ఆంధ్ర భవన్లో జరిగింది):
రిప్లయితొలగించండిభృత్యుని మోదగ హరీశుఁ బలుమెచ్చిరహో!
కొన్ని విషయాలు అనుభవముతో గాని అలవాటుకాదు. ఈ నేపథ్యములో తలచిన భావన.
రిప్లయితొలగించండివగచిన సతినలరించుట,
సగభాగమ్మీవె యనుచు సన్నుతి జేయన్,
జగమే నీవని బలుకుట,
మగడెరుగని మర్ములివి మామ యెరుంగున్.
తగవులలోఁ దన పిత వలె
రిప్లయితొలగించండితగదని పలుకఁడు. మరింత ధనమున కైఁదాఁ
రగిలెడి యత్తమనంబున
మగడెఱుగని మర్మములవి. మామ యెఱుంగున్.
కట్నం కోసం వేధించే అత్తకు మామ బుద్ధులు చెప్తాడు కానీ తన మగడు ఏమీ పలుకడని ఒక వనిత వాపోవుట.
సిగలూడి జరయు రుజయును
రిప్లయితొలగించండిపగలంబడి నవ్వుచుండు పట్టున తగునా?
నగుబాటు గాదె ! యెటువలె
మగడెరుగని మర్మము లవి మామ యెరింగెన్ ?
మగడలుగ మదన వేదన
సెగలంబడి చంద్రు జూచి చెలి తన బాధన్
బొగులుచు వినిపించె శశికి
మగడెరుగని మర్మము లవి మామ యెరుంగున్
--- వెంకట రాజారావు . లక్కాకుల
మగనిని గూర్చిన తలపులు
రిప్లయితొలగించండిమగువదె మదివిప్పి చందమామకు చెప్పెన్
మగడవి యెరుగునొ లేదో
మగఁడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.
మిగుల తలచె వాణి యిటుల
రిప్లయితొలగించండిమగడొసుగును దనుజులకును మహిమల్ వరముల్
జగమును కావగ తెలియడు
మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్!!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిగురువుగారు పద్యమును సవరించినందులకు కృతజ్ఞతలు.
నెట్ లింక్ దొరికిందికదా అనే ఆత్రంలో ప్రాస గమనించక "మదినెరుగని" అనితలచుకొంటు దకార ప్రాసతో వ్రాశాను. కవిమిత్రులు మన్నింపప్రార్థన.
తగునా పద్యము వ్రాయగ
నగునా ప్రాస యతి విడచి నా నాథుడిటన్
సొగసగు కబ్బము వ్రాయగ
మగడెఱుగని మర్మములను మామ యెఱంగున్
కావ్యాలు వ్రాసె విధానంలో (మర్మములు =) కిటుకులు మామకు తెలుసు. పద్యం వ్రాయుటయే రాని నా మగడు యతి ప్రాసలు లేకుండా పద్యం వ్రాయుట తగునా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపగ బట్టిన మరువడు యీ
రిప్లయితొలగించండిమగధీరుడు కంసవిభుడు మాయావీ! నీ
మగతనమును, నా చెల్లెలు
మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
మయసభలో జరిగిన అవమానాన్ని తలచుకొని కుములుతున్న
సుయోధనుని నోదార్చుతూ మాతులుడు శకుని :
01)
___________________________________
పగవారిని వంచించుట
మగటిమితో వీలు గాదు - మానుము చింతన్!
ఆగడము జేయ; ద్రౌపది
మగఁ డెఱుఁగని మర్మము లవి - మామ యెఱుంగున్ !
___________________________________
ఆగడము = మోసము
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...
రిప్లయితొలగించండిజగనును వివేకానందను దృష్టిలో ఉంచు కొని జగను భార్య గారి స్వగతము ;
' సెగఁ బెట్టిన పొగ పుట్టును
పగ నూనిన పరువు తరుగు పత్రికలందున్
తగువాడిన వగ పొగులును
మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్ '
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమంచి విషయంతో సమస్య నిచ్చారు. కాని యతి తప్పింది. సవరించి ఇస్తాను.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
అంటే ఇవన్నీ మామ అత్త దగ్గర చూపించాడా? అయితే బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
*
మందాకిని గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
ఫణి ప్రసన్న కుమార్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
ఇప్పుడు మీ పూరణ సలక్షణంగా శోభిస్తున్నది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ శ్రేష్ఠమై అలరారుతున్నది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
సమయానుకూలమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమాస్టారూ, ధన్యవాదాలు. యతి మీద ఋవళి, సంబంధం గానీ సామ్యం గానీ కుదరలేదు., ఇది చూడండి:
రిప్లయితొలగించండిభృత్యుని మోదగ హరీశుఁ ప్రజమెచ్చిరహో!
తగవుల దీర్చును, గ్రామము
రిప్లయితొలగించండిమగువలు మగవారు మెచ్చు మాటలు జెప్పున్ !
తగ పెద్దరికము జేయును
మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్!!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడూ యతి కుదరలేదు. ‘భృ’తో యతి కుదరాలంటే అక్కడ ‘ప్రి-ప్రీ-ప్రె-ప్రే’లుండాలి.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచంద్ర శేఖరుల సమస్యను ఇలా మార్చవచ్చు ననుకొన్టున్నాను.
భృత్యుని మోదగ హరీశుఁ భేషనిరి జనుల్!
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిభేషుగ్గా సరిపోతుంది. ధన్యవాదాలు. కాకుంటే మధ్యలో ఆ అరసున్నా అవసరం లేదు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిబహుశా " హరీశుని భేషనిరి " అన్న భావంగా అన్వయించు కోవచ్చునేమో.
అందుకే అరసున్న కాబోలు.
మాస్టారూ, మిస్సన్న గారూ మెరుగు దిద్దినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమగనికి దెలియదు సమముగ
రిప్లయితొలగించండిజగడము పుట్టింటిలోని జంజాటమ్మున్
నగుమోమున గప్పినతన
మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్
ప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అగచాటులు నగుబాటులు
రిప్లయితొలగించండిబిగువులు పూర్వపు తరముల భీభత్సమ్ముల్
తగవులు పుట్టింటివి తన
మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్
మామ = మేనమామ