23, జులై 2011, శనివారం

సమస్యా పూరణం -403 (మగఁ డెఱుఁగని మర్మములు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.

28 కామెంట్‌లు:

  1. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 23, 2011 9:53:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    పదముల గూర్చగ పద్యము
    కుదరదులే యతి గణములు కొదవైనపుడున్
    కుదురుగ కబ్బము వ్రాయగ
    మగడెఱుగని మర్మములవి మామ యెఱుంగున్

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని ‘ప్రాస’ను గమనించలేదు. సమస్యపాదం అన్వయిస్తున్నట్లు కూడా లేదు. అన్వయం కుదరకున్నా మీ భావానికి ప్రాస సవరించిన నా పద్యరూపం ...

    సొగసగు పద్యముఁ గూర్చఁ బొ
    సగవు యతి గణములు; ప్రాస సరిపోదు కదా!
    తగ నొక కబ్బము వ్రాయఁగ
    మగడెఱుగని మర్మములవి మామ యెఱుంగున్

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ, క్రింది సమస్యను పరిశీలించి వేయవలసినదిగా మనవి. ఈ రోజు టీవీ లో చూసిన సంఘటనే ప్రేరణ (ఢిల్లీ ఆంధ్ర భవన్లో జరిగింది):
    భృత్యుని మోదగ హరీశుఁ బలుమెచ్చిరహో!

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, జులై 23, 2011 10:56:00 AM

    కొన్ని విషయాలు అనుభవముతో గాని అలవాటుకాదు. ఈ నేపథ్యములో తలచిన భావన.

    వగచిన సతినలరించుట,
    సగభాగమ్మీవె యనుచు సన్నుతి జేయన్,
    జగమే నీవని బలుకుట,
    మగడెరుగని మర్ములివి మామ యెరుంగున్.

    రిప్లయితొలగించండి
  5. తగవులలోఁ దన పిత వలె
    తగదని పలుకఁడు. మరింత ధనమున కైఁదాఁ
    రగిలెడి యత్తమనంబున
    మగడెఱుగని మర్మములవి. మామ యెఱుంగున్.

    కట్నం కోసం వేధించే అత్తకు మామ బుద్ధులు చెప్తాడు కానీ తన మగడు ఏమీ పలుకడని ఒక వనిత వాపోవుట.

    రిప్లయితొలగించండి
  6. సిగలూడి జరయు రుజయును
    పగలంబడి నవ్వుచుండు పట్టున తగునా?
    నగుబాటు గాదె ! యెటువలె
    మగడెరుగని మర్మము లవి మామ యెరింగెన్ ?

    మగడలుగ మదన వేదన
    సెగలంబడి చంద్రు జూచి చెలి తన బాధన్
    బొగులుచు వినిపించె శశికి
    మగడెరుగని మర్మము లవి మామ యెరుంగున్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  7. మగనిని గూర్చిన తలపులు
    మగువదె మదివిప్పి చందమామకు చెప్పెన్
    మగడవి యెరుగునొ లేదో
    మగఁడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.

    రిప్లయితొలగించండి
  8. మిగుల తలచె వాణి యిటుల
    మగడొసుగును దనుజులకును మహిమల్ వరముల్
    జగమును కావగ తెలియడు
    మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్!!

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 23, 2011 2:29:00 PM

    శ్రీగురుభ్యోనమ:
    గురువుగారు పద్యమును సవరించినందులకు కృతజ్ఞతలు.

    నెట్ లింక్ దొరికిందికదా అనే ఆత్రంలో ప్రాస గమనించక "మదినెరుగని" అనితలచుకొంటు దకార ప్రాసతో వ్రాశాను. కవిమిత్రులు మన్నింపప్రార్థన.


    తగునా పద్యము వ్రాయగ
    నగునా ప్రాస యతి విడచి నా నాథుడిటన్
    సొగసగు కబ్బము వ్రాయగ
    మగడెఱుగని మర్మములను మామ యెఱంగున్

    కావ్యాలు వ్రాసె విధానంలో (మర్మములు =) కిటుకులు మామకు తెలుసు. పద్యం వ్రాయుటయే రాని నా మగడు యతి ప్రాసలు లేకుండా పద్యం వ్రాయుట తగునా?

    రిప్లయితొలగించండి
  10. పగ బట్టిన మరువడు యీ
    మగధీరుడు కంసవిభుడు మాయావీ! నీ
    మగతనమును, నా చెల్లెలు
    మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మయసభలో జరిగిన అవమానాన్ని తలచుకొని కుములుతున్న
    సుయోధనుని నోదార్చుతూ మాతులుడు శకుని :

    01)
    ___________________________________

    పగవారిని వంచించుట
    మగటిమితో వీలు గాదు - మానుము చింతన్!
    ఆగడము జేయ; ద్రౌపది
    మగఁ డెఱుఁగని మర్మము లవి - మామ యెఱుంగున్ !
    ___________________________________
    ఆగడము = మోసము

    రిప్లయితొలగించండి
  12. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...

    జగనును వివేకానందను దృష్టిలో ఉంచు కొని జగను భార్య గారి స్వగతము ;

    ' సెగఁ బెట్టిన పొగ పుట్టును
    పగ నూనిన పరువు తరుగు పత్రికలందున్
    తగువాడిన వగ పొగులును
    మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్ '

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖర్ గారూ,
    మంచి విషయంతో సమస్య నిచ్చారు. కాని యతి తప్పింది. సవరించి ఇస్తాను.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అంటే ఇవన్నీ మామ అత్త దగ్గర చూపించాడా? అయితే బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ఇప్పుడు మీ పూరణ సలక్షణంగా శోభిస్తున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ శ్రేష్ఠమై అలరారుతున్నది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సమయానుకూలమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. మాస్టారూ, ధన్యవాదాలు. యతి మీద ఋవళి, సంబంధం గానీ సామ్యం గానీ కుదరలేదు., ఇది చూడండి:
    భృత్యుని మోదగ హరీశుఁ ప్రజమెచ్చిరహో!

    రిప్లయితొలగించండి
  16. తగవుల దీర్చును, గ్రామము
    మగువలు మగవారు మెచ్చు మాటలు జెప్పున్ !
    తగ పెద్దరికము జేయును
    మగడెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్!!

    రిప్లయితొలగించండి
  17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. చంద్రశేఖర్ గారూ,
    ఇప్పుడూ యతి కుదరలేదు. ‘భృ’తో యతి కుదరాలంటే అక్కడ ‘ప్రి-ప్రీ-ప్రె-ప్రే’లుండాలి.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ ధన్యవాదాలు.
    చంద్ర శేఖరుల సమస్యను ఇలా మార్చవచ్చు ననుకొన్టున్నాను.

    భృత్యుని మోదగ హరీశుఁ భేషనిరి జనుల్!

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్న గారూ,
    భేషుగ్గా సరిపోతుంది. ధన్యవాదాలు. కాకుంటే మధ్యలో ఆ అరసున్నా అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ ధన్యవాదాలు.
    బహుశా " హరీశుని భేషనిరి " అన్న భావంగా అన్వయించు కోవచ్చునేమో.
    అందుకే అరసున్న కాబోలు.

    రిప్లయితొలగించండి
  22. మాస్టారూ, మిస్సన్న గారూ మెరుగు దిద్దినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. మగనికి దెలియదు సమముగ
    జగడము పుట్టింటిలోని జంజాటమ్మున్
    నగుమోమున గప్పినతన
    మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్

    రిప్లయితొలగించండి
  24. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అగచాటులు నగుబాటులు
    బిగువులు పూర్వపు తరముల భీభత్సమ్ముల్
    తగవులు పుట్టింటివి తన
    మగఁ డెఱుఁగని మర్మము లవి మామ యెఱుంగున్

    మామ = మేనమామ

    రిప్లయితొలగించండి