30, జులై 2011, శనివారం

ప్రహేళిక - 48

సీ.
రావణాసురుఁడు శ్రీరామున కేమగు?
వానలు లేకున్న వచ్చు నేది?
బంగారు నగలమ్ము వర్తకు నేమందు?
రైరావతాఖ్యమైనట్టి దేది?
సంపన్నతను దెల్పఁజాలు బూడిద యేది?
ప్రాణమ్ములను దీయు వస్తు వేది?
సూక్ష్మాతిసూక్ష్మవస్తువుకు గుర్తింపేది?
మ్రొక్కి దేవున కిచ్చు మూట యేది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లందు మధ్యాక్షరమ్ముల నరసి చూడ
నష్టదిగ్గజకవులలో నగు నొకండు
చెప్పువారల నేఁ బ్రశంసింతు నిపుడు.
కవిమిత్రులారా,
ఆ కవి పేరు (వివరణతో) చెప్పండి.
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

6 కామెంట్‌లు:

  1. వసంత కిశోర్ గారూ,
    మీ సమాధానం సరియైనదే. అభినందనలు.
    కానీ .. నింజము ?

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా !
    మీరిచ్చినది రైవతకాద్రే గదా ?

    నింజము = వింధ్య పర్వతము
    జి*ఎన్*రెడ్డి గారినిఘంటువు

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా !
    అది ఐరావతమా !
    ఐతే గజము లేక కుంజరం లోని
    "జ" నచ్చట జేర్చుడు !

    రిప్లయితొలగించండి
  4. ‘కమనీయం’ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
    మీ సమాధానం 100% సరియైనది. అభినందనలు.
    దానిని రేపు ఉదయం ప్రకటిస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మందాకిని గారూ,
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    వసంత కిశోర్ గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    ‘కమనీయం’ గారూ,
    మీ అందరి సమాధానాలు సరియైనవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం ...
    అరాతి,క్షామము, షరాబు,గజము,విభూతి,విషము,అణువు ముడుపు
    ' రామరాజ భూషణుడు '
    *
    మందాకిని గారి సమాధానం ...
    అరాతి, క్షామము, షరాబు, గజము,
    విభూతి, విషము, అణువు, ముడుపు.
    రామరాజభూషణుఁడు.
    *
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం ...
    అ‘రా’తి
    క్షా‘మ’ము
    ష‘రా’బు
    కంజరం/కుంజరం/గ‘జ’ము (?)
    వి‘భూ’తి
    వి‘ష’ము
    అ‘ణు’వు
    ము‘డు’పు
    *
    వసంత కిశోర్ గారి సమాధానం ...
    అరాతి - క్షామము - షరాబు - కుంజరం - విభూది - విషము - అణువు - ముడుపు
    *
    చంద్రశేఖర్ గారి సమాధానం ...
    అ-రా-తి
    క్షా-మ-ము
    ష-రా-బు
    గ-జ-ము
    వి-భూ-తి
    వి-ష-ము
    అ-ణు-వు
    ము-డు-పు
    రా-మ-రా-జ-భూ-ష-ణు-డు.
    *
    ‘కమనీయం’ గారి సమాధానం ...
    అరాతి,క్షామము,షరాబు,గజము,విభూతి,విషము,అణువు,ముడుపు,-అంటే మధ్య అక్షరాలను తీసుకొంటే రామ రాజ భూషణుడు అని సరీఇన సమాధానం వస్తుంది.

    రిప్లయితొలగించండి