15, జులై 2011, శుక్రవారం

సమస్యా పూరణం -394 (ముక్కంటికి మ్రొక్కువాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్.

42 కామెంట్‌లు:

  1. చక్కగ మోక్షము నిచ్చును
    మిక్కిలి భక్తిని గొలిచిన మీదట శివుడే !
    తిక్కల లౌకిక ములకై
    ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్!!

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! బావుంది !

    బోయ తిన్నడు :

    01)
    __________________________________

    అక్కజమౌ భక్తి గలిగి
    చక్కని బుక్కపు తునుకల - చండీశునిచే
    మక్కువతో దినిపించెను !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  3. సాలె పురుగు :

    02)
    __________________________________

    చక్కని దారపు పోగుల
    మక్కువతో గూడు నల్లె - మర్కట మదిగో !
    అక్కున జేర్చెను శివుడే !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  4. మ్రొక్కిన వరముల నిచ్చెడు
    ముక్కంటిని మ్రొక్కు! వాఁడు మూర్ఖుడు జగతిన్
    ముక్కంటిని మ్రొక్కనిచో!
    మక్కువ మీరగను నేఁను మనమునఁ గొలుతున్.

    రిప్లయితొలగించండి
  5. చక్కని కోర్కెలు కోరక
    దిక్కులకే దిక్కు హరుడు దిగిరాగానే !
    ప్రక్కన వారిని త్రొక్కగ
    ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్!!

    రిప్లయితొలగించండి
  6. అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సర్పము :

    03)
    __________________________________

    పెక్కగు పూసల గొలిచెను
    మక్కువ , కన్నులవినికలి - మాహేశ్వరునే !
    ఉక్కడచగ, యేనుగునకు !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________
    15 జూలై 2011 7:49 ఉ

    రిప్లయితొలగించండి
  7. కిశోర్ జీ ! ధన్యవాదములు. శ్రీ కాళ హస్తీశ్వరుని దర్శింప జేస్తున్నారు.అభినందనలు.
    మందాకిని గారూ !బాగుంది .౧వ పూరణ ౨ వ పాదం లో వేడెన్ అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  8. శాస్త్రీజీ ! ధన్యవాదములు !

    భస్మాసురుడు :

    04)
    __________________________________

    మిక్కిలి తపమును జేయగ
    మక్కువతో వరము దీర్చి - మదనాంతకుడే
    పిక్క బెదరి పరువెత్తెను !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  9. గజరాజు :

    05)
    __________________________________

    తక్కువ జేసెను తననని
    వెక్కసముగ మణుల ద్రోసి - భేరము జచ్చెన్ !
    ముక్కున దూరగ సర్పము !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  10. దశ కంఠుడు :

    06)
    __________________________________

    మొక్కల మెక్కువ కాగా
    పక్కగ పోవక ,శిఖరిని - బలముగ లేపెన్ !
    రక్కసి రావణు డంతట !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  11. దక్షుడు :

    07)
    __________________________________

    స్రుక్కము పెరిగిన దక్షుడు
    ముక్కపరచి పలు విధముల - బూచుల దొరనే
    బుక్కపు తలనే బొందెను !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    స్రుక్కము = గర్వము
    ముక్కపరచి = అవమాన పరచి
    బుక్కము = మేకపోతు

    రిప్లయితొలగించండి
  12. నక్కీరుడు :

    08)
    __________________________________

    ముక్కంటి రచన జేసిన
    న్యక్కరణము జేసె, నంత - నక్కీరుడు దా
    రుక్కున బడి చింతించెను !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    న్యక్కరణము = తిరస్కారము
    నక్కీరుడు = ఒక తమిళ కవి
    రుక్కు = కుష్ఠు వ్యాధి

    రిప్లయితొలగించండి
  13. పీతాంబర్ గారూ ! మంచి విరుపు , పూరణ . అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఒక్కండున్నను చాలును
    ముక్కంటిని మ్రొక్కు వాడు! మూర్ఖుడు, జగతిన్
    చిక్కులు బెట్టెడు వాడును
    పెక్కండ్రు oడినను పేడ పిడకలు గావే!!!

    రిప్లయితొలగించండి
  15. పీతాంబరధరా ! బావుంది !

    గజాసురుడు :

    09)
    __________________________________

    మ్రొక్కెను ,పరమేశునకే
    బుక్కములో నుంచు కొనెను ! - పొంగిన శూలే
    గ్రక్కున చీల్చెను పొట్టను !
    ముక్కంటికి మ్రొక్కువాఁడు - మూర్ఖుఁడు జగతిన్ !
    __________________________________

    బుక్కము = హృదయము

    రిప్లయితొలగించండి
  16. చక్కని ఉడుపులు లేవిక
    మిక్కను భోజనము లేదు మ్రింగును విషమున్,
    నక్కునొలుకిమిట్టను, నా
    ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్!
    మనవి: శివుడు నా యిష్ట దైవం. మూడో పాదంలో "నా" "నా సొంతమైన" అనే అర్థంలో.

    రిప్లయితొలగించండి
  17. శాస్త్రి గారు ధన్య వాదములు .చివరి పాదములో యతి కుదరలేదని సవరించాను.

    రిప్లయితొలగించండి
  18. చక్కగఁ దపములఁ జేసిన
    రక్కసుడా పరమశివునిఁ రణముల జయమున్
    పెక్కువిధంబులఁ వేడెన్
    ముక్కంటికి మ్రొక్కు-వాఁడు మూర్ఖుఁడు జగతిన్.

    శాస్త్రి గారూ,
    సరిగ్గా గమనించి చెప్పినందుకు ధన్యవాదములు.
    అది డిలిట్ చెయ్యటం మాత్రం అప్పుడే అయిపోయింది.
    ఇప్పుడు మార్చాను. నెట్ సమస్య వల్ల ఆలస్యంగా స్పందిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  19. క్షమించాలి. నాకు పద్యాలు రాయటం రాదు. ఇక్కడ కామెంట్ రాయవచ్చో లేదో నాకు తెలియదు. రాయకుండా వుండలేక రాస్తున్నాను. నాకు ఇది అంతా చూస్తుంటే ఇంటర్నెట్ లో అష్టావధానం ఆడుతున్నట్టుగా వుంది. మనలో ఇంతమంది కవులా? మీకు హేట్సాఫ్ అండీ. నాకు అన్నిటికీ అర్థం తెలీయక పోయినా తెలుగు చదువుకుని ఆనందపడుతున్నాను.

    రిప్లయితొలగించండి
  20. ikkaTla paalavaDu aa
    mukkaMTiki mrokkuvaaDu ; moorkhudu jagatin
    cakkani dEvuni gaadani
    mukkucu moolgucu Silalaku mrokkedi vaaDE !

    రిప్లయితొలగించండి
  21. శ్రీ నాగ రాజు రవీందర్ గారి పూరణ
    ఇక్కట్ల పాలవడు ఆ
    ముక్కంటికి మ్రొక్కువాడు ; మూర్ఖుడు జగతిన్
    చక్కని దేవుని గాదని
    ముక్కుచు మూల్గుచు శిలలకు మ్రొక్కెడి వాడే !

    రిప్లయితొలగించండి
  22. మిక్కుటమౌ తామసమున
    నిక్కము గనలేక హరుని, నీరజ నాభున్
    యెక్కువ తక్కువ లనుచును
    ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  23. పెక్కురు వేలుపు లం దత
    డొక్కండే మీస మున్న యోధుం డగుటన్
    తక్కుం గల వారికి వలె
    ముక్కంటిని మ్రొక్కు వాడు మూర్ఖుడు జగతిన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    --- బ్లాగు : సుజన సృజన

    రిప్లయితొలగించండి
  24. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జులై 15, 2011 11:10:00 PM

    దిక్కులకధిపతినీశుని,
    చిక్కని మోక్షమ్ముకోరి జేరితరింతున్,
    స్రుక్కెడు ధనమును కోరుచు
    ముక్కంటిని మ్రొక్కువాడు మూర్ఖుడు జగతిన్.

    చిక్కని = దుర్లభమైన,
    స్రుక్కెడు = నశించునటువంటి

    రిప్లయితొలగించండి
  25. కందము మీ చేతుల లో
    నందముగా రూపు దిద్దు నవ్విధి కనగా
    విందారగించి నట్లా
    నందింతును మిస్సనార్య! నానా రుచులన్

    --- మీ రాజారావు

    రిప్లయితొలగించండి
  26. పెక్కేండ్లసంప్రదాయముఁ
    బక్కనబెట్టిపెరబుద్ధిఁబరమశివునకున్
    చెక్కించిప్రతిమ నందున్
    ముక్కంటిని మ్రొక్కువాడు మూర్ఖుడు జగతిన్.

    ------------------------------------
    గురుపూర్ణిమనాడు, వెళ్దామనుకొని గురువుగారివద్దకు వెళ్లలేకపోయిన నన్ను నేను నిందించుకుంటూ:

    చక్కగ జీవిక గడువగ
    మక్కువ విద్యలనొసగినమాన్యగురువుకున్
    మ్రొక్కక; రాతింగని యా
    ముక్కంటిని, మ్రొక్కువాడు మూర్ఖుడు జగతిన్.

    రిప్లయితొలగించండి
  27. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 16, 2011 6:58:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    మిక్కిలి మోదము నొందుచు
    ఒక్కడినే చుట్టె భృంగి నోరిమి తోడన్
    ప్రక్కన అంబను విడచుచు
    ముక్కంటిని మ్రొక్కువాడు మూర్ఖుడు జగతిన్

    రిప్లయితొలగించండి
  28. naa padyaanni telugulO peTTinaMdulaku bahudhaa kRtajnatalu maMda peetaaMbar garoo !

    - sent from my iPhone

    రిప్లయితొలగించండి
  29. రాజారావు గారూ మీ అభిమానానికి కృతజ్ఞతలు.

    లక్కను ఆభరణంబుల్
    చక్కగ నతికించునట్లు సరస పదంబుల్
    చిక్కగఁ వ్రాతురు పద్యము
    లక్కాకుల రాజ! మిత్ర ! లక్షణ సుకవీ!

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రు లందరికీ నమస్కృతులు.
    పూరణలు పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి, వసంత కిశోర్, మందాకిని, మంద పీతాంబర్, చంద్రశేఖర్, నాగరాజు రవీందర్, మిస్సన్న, లక్కాకుల వెంకట రాజారావు, సంపత్ కుమార్ శాస్త్రి, ఊకదంపుడు, శ్రీపతి శాస్త్రి గారలకు అభినందనలు.
    అత్యవసరంగా వేరే ఊరికి వెళ్తున్న తొందరలో మీమీ పూరణలను విశ్లేషించలేక పోతున్నాను. మన్నించండి. తిరిగి వచ్చిన వెంటనే (బహుశా ఈ సాయంత్రానికి) వ్యాఖ్యానిస్తాను.

    రిప్లయితొలగించండి
  31. సునీత గారూ,
    స్వాగతం! మీరు నా బ్లాగును వీక్షించినందుకు సంతోషం.
    మీరు స్వయంగా బ్లాగును నిర్వహిస్తూ "ఇక్కడ కామెంట్ రాయవచ్చో లేదో నాకు తెలియదు" అన్నారెందుకు? మీరు నిరభ్యంతరంగా వ్యాఖ్యలు పెట్టవచ్చు.

    రిప్లయితొలగించండి
  32. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.*
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణల నవరత్నాలను చూసాను. బాగున్నాయి. అభినందనలు.
    కాని తిన్నడు, శ్రీకాళహస్తులది మూఢభక్తి కదా! మిగిలిన వారిది మూర్ఖభక్తే. సందేహం లేదు.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలలో మొదటిది మంచి విరుపుతో ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    రెండవపూరణలో అన్వయం కుదరడంలేదని అనుమానం.
    *
    మంద పీతాంబర్ గారూ,
    చక్కని విరుపూతో మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
    రవీందర్ గారి పూరణను తెలుగులిపిలో మార్చినందుకు ధన్యవాదాలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మిక్కను’ అనేది ‘మెక్కను’ కు టాపాటా? ఇంతకీ ‘మీ’ ముక్కంటికి మీరు గాక ఇంకెవరు మొక్కినా మూర్ఖులవుతారా?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ముందు కొద్దిగా తికమకపడ్డాను. అది ‘పాలు + అవఁడు’ అయితే నేను ‘పాల + పడు’ ఆని చదువుకున్నాను. తరువాత ‘పాలన్ + పడు’అనేది పాలంబడు, పాలఁబదడు, పాలన్బడు అవుతుంది కాని గసడదవాదేశ సంధి రాదు కాదా. సంతోషం!
    *
    మిస్సన్న గారూ,
    శివకేశవాద్వైతాన్ని దర్శింపజేసారు. మంచి పూరణ. అభినందనలు.
    లక్కాకుల వారిని గురించి చెప్పిన పద్యం సముచితంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సరదాగా నవ్వించింది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.
    మిస్సన్న గారి గురించి మీరు చెప్పింది అక్షరసత్యం. కందం వారి చేతుల్లో అందంగా ఒదుగుతుంది.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రశస్తమైనది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    నిజమే. అర్ధనారీశ్వరుని సగభాగానికే మ్రొక్కినవాడు మూర్ఖుడే. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. మాస్టారూ, టైపాటు సవరించినదులకు ధన్యవాదాలు. అంతే కదా, కట్టుకోవటానికి బట్టలు లేని వాడికి, తింటానికి తిండిలేని వాడికి, ఉండటానికి ఇల్లు లేని వాడికి నాలాంటి మరో మూర్ఖుడు తప్ప యెవరు మ్రొక్కుతారు, సార్?

    రిప్లయితొలగించండి
  34. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 16, 2011 11:13:00 PM

    గురువుగారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  35. వక్కలు నములుచు పొగలను
    తిక్కగ పీల్చుచు వదలుచు తీరని కోర్కెల్
    నిక్కముగ తీర్చు వాడని
    ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి
  36. చక్కని యాలిని ద్రోలుచు
    ప్రక్కన మాధురి నిడుమని పరిపరి విధముల్
    ముక్కుచు మూల్గుచు గుడిలో
    ముక్కంటికి మ్రొక్కువాఁడు మూర్ఖుఁడు జగతిన్

    రిప్లయితొలగించండి