గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, గీతాచార్యుల మీద మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు. ముంబాయి దారుణకాండ పట్ల మీ స్పందనకు ధన్యవాదాలు. * మిస్సన్న గారూ, ముక్తికాంతతో సరసమా? చాలా బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘త్యజించి’ అంటే గణదోషం. ‘సర్వ భోగంబుల్,త్యజియించి’ అందామా? * లక్కాకుల వెంకట రాజారావు గారూ, సర్వోత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ, నిజమే. నా దృష్టి దాని ప్రక్కనే ఉన్న ‘పుడికిరించె" మీదనే ఉండి దాని అర్థం తెలుసుకొనే ప్రయత్నంలో గణదోషం గమనించలేదు. ధన్యవాదాలు.
మందాకిని గారూ, ధన్యవాదాలు. క్షమించు తల్లీ! మీ పూరణ ఎందుకో నా దృష్టికి రాలేదు. సమస్య పాదాన్ని చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ నిచ్చారు. చాలా బాగుంది. అభినందనలు.
వేల గోపికలను గూడి వెన్ను డాడె
రిప్లయితొలగించండిఅష్ట భార్యల తాజేరి హాయి నిచ్చె
గీత బోధించి నరునకు హితము జేసె
సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి.
సర్వమున్ మిధ్య యౌ నను సత్య మెరిగి
రిప్లయితొలగించండిచిత్తమున్నిల్పి శ్రీ దివ్య చింతనమున
ముక్తి కాంత కవుంగిట మోద మందు
సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిముంబాయి నగరంలో జరిగిన వరుస ప్రేలుళ్ళ లో మృతి చెందిన, క్షతగాత్రులైన వారికి సంతాపాన్ని సానుభూతిని ప్రకటిస్తూ ......
రిప్లయితొలగించండిపొంచి ముంబాయి నగరాన పోటు పొడిచి
ముంచి నారయ్యొ! నెత్తుటి ముద్ద లోన
నరకు మించిన వారిని నరుకు వారు
నరుల లేరయ్య, రావయ్య నార సింహ!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
యోగి వేమన :
01)
___________________________________
సాని కొంపల తిరిగిన - సరసు డయ్యు
సర్వ భోగంబు,త్యజించి - సాధు వయ్యె
సత్య ,ధర్మంబు , బోధించె - సకలురకును !
సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి !
___________________________________
మిథ్య యైనట్టి భోగమే మేలు మేల
రిప్లయితొలగించండినియెడు; హితమగు బోధల నెన్నబోడు,
సరసుడైనట్టి భోగి; యే జ్ఞానయోగి
దివ్య చరితలు వినినంతఁ దెలిసి కొనునొ!
సతత వేశ్యాంగనా పరిష్వంగ సుఖ ర
రిప్లయితొలగించండిసార్ణవ విషయ లోలుడై సాగి - తుదకు
విడిచె కట్టు పుట్టము కూడ వేమ యోగి
సరసు దైనట్టి భోగియే .........
--- వెంకట రాజారావు . లక్కాకుల
పుండరీకుని కథలు పుడికిరించె
రిప్లయితొలగించండివేమన చరిత దెలిపెనా వివర మెటుల
సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి
యగుకడకు,సాన బట్టిన యక్షజముగ!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిగీతాచార్యుల మీద మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
ముంబాయి దారుణకాండ పట్ల మీ స్పందనకు ధన్యవాదాలు.
*
మిస్సన్న గారూ,
ముక్తికాంతతో సరసమా? చాలా బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘త్యజించి’ అంటే గణదోషం. ‘సర్వ భోగంబుల్,త్యజియించి’ అందామా?
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
సర్వోత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
మాస్టారూ,
రిప్లయితొలగించండిమీరు ఊరికినే మార్కులిచ్చేస్తున్నారు. నా పద్యం మొదటిపాదంలో గానదోషం సవరించటానికి "కథలు" ను "గాధలు" గా చదువ వలసినదని మనవి. ధన్యవాదాలు.
గురుపూర్ణిమ సందర్భంగా గురువు గారికి నమస్సుమాంజలులు.
రిప్లయితొలగించండిగురువు గారూ,
నా పూరణను దయచేసి పరిశీలించగలరు.
కామి గానట్టి వారలు కారు,కారు
రిప్లయితొలగించండిమోక్ష గాములు యేనాడు; మున్ను,నిన్న,
నేడు మరియును రాబోవు నాడు కూడ
సరసు డైనట్టి భోగియే జ్ఞాన యోగి!!!
శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండినిజమే. నా దృష్టి దాని ప్రక్కనే ఉన్న ‘పుడికిరించె" మీదనే ఉండి దాని అర్థం తెలుసుకొనే ప్రయత్నంలో గణదోషం గమనించలేదు. ధన్యవాదాలు.
మందాకిని గారూ,
ధన్యవాదాలు.
క్షమించు తల్లీ! మీ పూరణ ఎందుకో నా దృష్టికి రాలేదు.
సమస్య పాదాన్ని చక్కని విరుపుతో ప్రశస్తమైన పూరణ నిచ్చారు. చాలా బాగుంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘మోక్షగాములు + ఏనాడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మోక్షగాములేనాడును’ అందాం.