కలువలరాజు బావ సతి కన్నకుమారుని యన్న మన్మనిన్
దొలఁచినవాని కార్యములు తూకొని చేసినవాని తండ్రినిం
జిలికినవాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడి నింటికిఁ జూడవే చెలీ!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా, ఆ వస్తున్న వాడెలా ఉన్నాడో వివరించండి.
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
మందాకిని గారూ,
రిప్లయితొలగించండివాయుదేవుని వరకు సరిగానే వచ్చారు. ప్రయత్నించండి. ఇక్కడ వాయువును చిలికినవాడు అంటే ‘శేషుడు’. ఇక ముందుకు సాగండి.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిఇప్పుడు మీ సమాధానం 100% కరెక్ట్! అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం 100% సరియైనది. అభినందనలు.