షిర్డి సాయి కథలో నీళ్ళు పోసి దీపాలు వెలిగించిన సంఘటన ఒకటి ఉంది. అచ్చుకీ, హల్లుకీ యతి కుదిరినప్పుడు గమనించవలసిన నియమాలు గురువుగారు ఒక్కసారి చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఉదయం బాసు సాయంత్రానికి భామ అయింది. ఇద్దరినీ మాటలతో ప్రసన్నం చేసికొనడం కష్టమే. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
మందాకిని గారూ, మంచి విషయాన్ని ఎత్తుకొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. కాని విసంధి, యడామం, యతిదోషం ఉన్నాయి. మీ పద్యానికి (బ్రాకెట్లో) నా సవరణలు ... కుదరదునూనెలని(చ్చుట) (యు)దకము తోడవెలిగించు (టొనరునె యనుచున్) బెదరించగనే బాబా (యు)దకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
శ్రీపతి శాస్త్రి గారూ, సవరించిన తర్వాత మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, తపస్సనే ఉగ్రమైన అగ్నిమీద మీరు చెప్పిన పూరణ చాలా బాగుంది. అభినందనలు. అయితే ‘కుటిల + ఔపాయము, మేఘుడు + ఉదకముల’ అని విసంధిగా వ్రాసారు. ‘కుటిల మగు మార్గములన్, మేఘుం డుదకముల" అందాం.
గురువుగారూ, సవరణలకు ధన్యవాదాలు. యు, ఉ లో ఉన్న ఉకారము చూ లో ఉంది కదా! నేను ఇలా ఎప్పుడు పూరణ చేసినా తప్పు అవుతోంది అందుకే ఇలా కోరాను--"యుదకము, చూతము" "అచ్చుకీ, హల్లుకీ యతి కుదిరినప్పుడు గమనించవలసిన నియమాలు గురువుగారు ఒక్కసారి చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. " వివరించగలరు.
గురువుగారూ, ఇచ్చుట తర్వాత నుగాగమం రావాలేమో అనుకుంటున్నాను. తప్పైతే మన్నించండి.వ్యాకరణ విషయంలో నా అజ్ఞానాన్ని మన్నించి విసంధి గురించి దయచేసి స్పష్టము చేయగలరు.
మందాకిని గారూ, మీ చివరి రెండు పూరణలూ నిర్దోషంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు. రెండవ పూరణ చివరి పాదంలో "వదనసరోజ మ్మొలికెను / వదనసరోజమున నొలికె " అంటే ఇంకా బాగుంటుంది. ఇక యతిమైత్రిని గురించి ... పాదాదిని అచ్చు ఉంటే యతిస్థానంలో అచ్చుకు మాత్రమే యతిమైత్రి కూర్చాలి. ఉదా. (వసంత కిశోర్ గారి పూరణలో) ‘ఉదయము నే నడచు చుండ - నోకము నెదుటన్’ ఇక్కడ పాదాదిని ఉకారం ఉంది. యతిస్థానంలో (చుండన్ + ఓకము) ఓకారం ఉంది. ఉ ఊ ఒ ఓ లకు యతిమైత్రి ఉంది కదా. ‘ఉదయము నే గౌరి నోము నోచితి మింటన్’ ఇక్కడ ఉ - నో లకు యతి చెల్లదు. ‘నూతనగృహమందు నోము నోచితిమి కదా’ అన్నప్పుడు నూ - నో లకు యతి చెల్లుతుంది. మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్న కారణంగా ఇంతకంటె వివరంగా చెప్పలేక పోతున్నాను. రెండు మూడు రోజుల్లో ‘యతిమైత్రి - గమనించ వలసిన అంశాలు’ శీర్షికతో ఒక పోస్ట్ వివరంగా పెడతాను.
ఉదయము బాసుకు కోపము,
రిప్లయితొలగించండిపదపడి నే బ్రతిమి లాడ ఫలితము లేదే !
సదమల వాక్కులు చెల్లునె ?
ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్!!
కుదరదునూనెలనివ్వము
రిప్లయితొలగించండిఉదకము తోడవెలిగించు, చూతము యనగా
బెదరించగనే బాబా
ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
షిర్డి సాయి కథలో నీళ్ళు పోసి దీపాలు వెలిగించిన సంఘటన ఒకటి ఉంది.
అచ్చుకీ, హల్లుకీ యతి కుదిరినప్పుడు గమనించవలసిన నియమాలు గురువుగారు ఒక్కసారి చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
చిన్ని సవరణ చేశాను.
రిప్లయితొలగించండికుదరదునూనెలనివ్వము
ఉదకము తోడవెలిగించు, చూతమటంచున్
బెదరించగనే బాబా
ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిబ్రతుకగ నేర్చిను విద్యను
పదుగురిలో నింద్రజాల పాటవములన్
కుదురుగ చూపుచు నాతడు
ఉదకమ్మును పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
వదలని తపమును గనితా
రిప్లయితొలగించండినదవదపడె వజ్రి, కుటిల ఔపాయికమున్
చెదరగ బంపిన, మేఘుడు
ఉదకంబును పోయ నగ్ని ఉగ్రతి దాల్చెన్.
అదవదపడి = కలత చెంది
ఔపాయికమున్ = ఉపాయములచేత
వజ్రి = ఇంద్రుడు
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిచిన్న సవరణ. మన్నించవలసినది
బ్రదుకగ నేర్చిను విద్యను
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
1)
_______________________________
పదమునకే దెబ్బ తగిలె
ఉదయము నే నడచు చుండ - నోకము నెదుటన్ !
సదమదమౌ పాదముపై
ఉదకమ్ములు పోయ నగ్ని - యుగ్రత దాల్చెన్ !
_______________________________
ఓకము = ఇల్లు
అగ్ని = మంట
కం: మది నిలువగ రాదు-ముదిత-
రిప్లయితొలగించండికదురుచు వాతెరలు దోచె , కవ్గవ లరమో
డ్చె - దవిలి తాపోప శమన
కుదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్ .
---వెంకట రాజారావు . లక్కాకుల
---బ్లాగు : సుజన సృజన
చిన్న సవరణ.........
రిప్లయితొలగించండివదలని తపమును గనితా
నదవదపడె వజ్రి, కుటిల ఔపాయికమున్
చెదపగ బంపిన, మేఘుడు
ఉదకంబును పోయ,నగ్ని ఉగ్రతి దాల్చెన్.
అదవదపడి = కలత చెంది
ఔపాయికమున్ = ఉపాయములచేత
వజ్రి = ఇంద్రుడు
ఉదయమున యమ్మ గారెలు
రిప్లయితొలగించండిముదముగ జేయుటకు బూని మూకుడు వెట్టెన్ !
అదమరచి నూనెలో చిరు
యుదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్ !
- మూకుడు = బాణలి
- సలసల క్రాగే నూనెలో పొరపాటున నీళ్ళు పడితే, ఉవ్వెత్తుగ మంటలు లేస్తాయన్న సంగతి మనకందరికీ తెలిసిందే !
సవరణ.........
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
ముదముగ నేర్చెను విద్యను
పదుగురిలో నింద్రజాల పాటవములనున్
కుదురుగ చూపుచు నాతడు
ఉదకమ్మును పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
చిన్న సవరణ తో ...
రిప్లయితొలగించండిఉదయము భామకు కోపము,
పదపడి నే బ్రతిమి లాడ భగ్గున మండెన్ !
సదమల వాక్కులు చెల్లునె ?
ఉదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్!!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణ "ఉదయము భామకు కోపము,"చాలా బాగుంది.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఉదయం బాసు సాయంత్రానికి భామ అయింది. ఇద్దరినీ మాటలతో ప్రసన్నం చేసికొనడం కష్టమే. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
మందాకిని గారూ,
మంచి విషయాన్ని ఎత్తుకొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
కాని విసంధి, యడామం, యతిదోషం ఉన్నాయి. మీ పద్యానికి (బ్రాకెట్లో) నా సవరణలు ...
కుదరదునూనెలని(చ్చుట)
(యు)దకము తోడవెలిగించు (టొనరునె యనుచున్)
బెదరించగనే బాబా
(యు)దకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన తర్వాత మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తపస్సనే ఉగ్రమైన అగ్నిమీద మీరు చెప్పిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
అయితే ‘కుటిల + ఔపాయము, మేఘుడు + ఉదకముల’ అని విసంధిగా వ్రాసారు. ‘కుటిల మగు మార్గములన్, మేఘుం డుదకముల" అందాం.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణ. బాగుంది. అభినందనలు.
లక్కరాజు వెంకట రాజారావు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
లక్కరాజు వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
లక్కాకుల వారూ,
మన్నించాలి. ఈ లక్కరాజు, లక్కాకుల మధ్య నేను కొద్దిగా తికమకపడుతున్నాను. మీ ఇంటిపేరు తప్పుగా టైప్ చేసాను.
గురువుగారూ, సవరణలకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండియు, ఉ లో ఉన్న ఉకారము చూ లో ఉంది కదా! నేను ఇలా ఎప్పుడు పూరణ చేసినా తప్పు అవుతోంది అందుకే ఇలా కోరాను--"యుదకము, చూతము"
"అచ్చుకీ, హల్లుకీ యతి కుదిరినప్పుడు గమనించవలసిన నియమాలు గురువుగారు ఒక్కసారి చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. "
వివరించగలరు.
గురువుగారూ, ఇచ్చుట తర్వాత నుగాగమం రావాలేమో అనుకుంటున్నాను. తప్పైతే మన్నించండి.వ్యాకరణ విషయంలో నా అజ్ఞానాన్ని మన్నించి విసంధి గురించి దయచేసి స్పష్టము చేయగలరు.
రిప్లయితొలగించండికదలుము వేగమె రమ్మిక
రిప్లయితొలగించండినుదకమ్ములు పోయ; నగ్ని యుగ్రత దాల్చెన్
బెదరితి, గావుము రమ్మా!
చెదరెను మది,భీతియందుఁ జిక్కితి సుమ్మా
శతథా ధన్యవాదములు గురువుగారు. మీ యొక్క సవరణను మనస్ఫూర్తిగా గ్రహిస్తున్నాను. సర్వదా కృతజ్ఞుడిని.
రిప్లయితొలగించండిమదిలో చల్లని వలపుల
రిప్లయితొలగించండినుదకమ్ములు పోయ; నగ్ని యుగ్రత దాల్చెన్
మదనుడు పెంచెను తాపము
వదనసరోజముఁ నొలికెను వయ్యారములే.
గురువుగారూ,
రిప్లయితొలగించండిమీకు శ్రమ నిస్తున్నందుకు మన్నించాలి. విసంధి వెలిగించు, చూతము దగ్గర అనుకుంటున్నాను. వెలిగించుము , చూతము రావాలి కదా.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిలక్కరాజు గారూ ! ధన్యవాదములు.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ చివరి రెండు పూరణలూ నిర్దోషంగా, చక్కగా ఉన్నాయి. అభినందనలు. రెండవ పూరణ చివరి పాదంలో "వదనసరోజ మ్మొలికెను / వదనసరోజమున నొలికె " అంటే ఇంకా బాగుంటుంది.
ఇక యతిమైత్రిని గురించి ...
పాదాదిని అచ్చు ఉంటే యతిస్థానంలో అచ్చుకు మాత్రమే యతిమైత్రి కూర్చాలి.
ఉదా. (వసంత కిశోర్ గారి పూరణలో)
‘ఉదయము నే నడచు చుండ - నోకము నెదుటన్’
ఇక్కడ పాదాదిని ఉకారం ఉంది. యతిస్థానంలో (చుండన్ + ఓకము) ఓకారం ఉంది. ఉ ఊ ఒ ఓ లకు యతిమైత్రి ఉంది కదా.
‘ఉదయము నే గౌరి నోము నోచితి మింటన్’ ఇక్కడ ఉ - నో లకు యతి చెల్లదు.
‘నూతనగృహమందు నోము నోచితిమి కదా’ అన్నప్పుడు నూ - నో లకు యతి చెల్లుతుంది.
మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్న కారణంగా ఇంతకంటె వివరంగా చెప్పలేక పోతున్నాను. రెండు మూడు రోజుల్లో ‘యతిమైత్రి - గమనించ వలసిన అంశాలు’ శీర్షికతో ఒక పోస్ట్ వివరంగా పెడతాను.
గురువుగారూ, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపద! పద! పిన్నలు, పెద్దలు
రిప్లయితొలగించండిపదఁపడి పరుగెత్తు చుండ్రి భయ కంపితులై,
మొదలంట కాలు గృహములు,
ఉదకమ్ములు పోయ, నగ్ని యుగ్రత దాల్చెన్.
ఆలస్యానికి మన్నించాలి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఉత్కృష్టమైన పూరణ. అభినందనలు.
అదియొక ప్రయోగ శాలౌ
రిప్లయితొలగించండినుదయమ్మున మంట లెన్నొ నుదయించంగా
పది యౌన్సుల నామ్లజనివి
యుదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్
ఆమ్లజని ఉదకము = liquid oxygen
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిచెదిరెడి విద్యుతు బాక్సున
ముదిరిన యత్తయ గడుసుది ముచ్చట మీరన్
కుదురుగ నుండక స్పార్కుల
నుదకమ్ములు పోయ నగ్ని యుగ్రత దాల్చెన్