16, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 106 (ప్రహేళిక)

సీ.
రాముఁ డెవ్వరిఁ గూడి రావణు మర్దించె?
పరవాసుదేవుని పట్ణ మేది?
రాజమన్నారు చే రంజిల్లు శర మేది?
వెలయ నాలుగువంటి విత్తమేది?
సీతను జేకొనఁ జెఱచిన ధను వేది?
సభవారి నవ్వించు జాణ యెవఁడు?
అల రంభ తుఱుములో నలరు మాలిక యేది?
శ్రీకృష్ణుఁ డేయింటఁ జెలఁగుచుండె?
తే. గీ.
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరమ్ము
లొనర నిరుదెసఁ జదివిన నొక్క తీరె
చెప్పఁగల్గిన నే నిత్తు జిన్నమాడ
చెప్పలేకున్న నవ్వుదుఁ జిన్ని నవ్వు.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

9 కామెంట్‌లు:

 1. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 16, 2011 10:52:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  రాముడెవ్వరిగూడి రావణు మర్ధించె = తోకమూకతో
  వాసుదేవునిపట్నము = రంగనగరం
  రాజమన్నరుచే రంజిల్లు శరము = కిటికోటికి
  నాలుగు వంటి విత్తు = జంబీరబీజం
  సీతనుజేకొన జెరచిన ధనువు = పంచాస్త్రచాపం
  సభవారినవ్వించు జాణ = వికటకవి
  రంభ తురుములో నలరు మాలిక = మందారదామం
  శ్రెకృష్ణుడేయింట జెలగుచుండె = నందసదనం

  గురువుగారి దయవల్ల ఈరోజు పాత పెద్దబాలశిక్షను వెదకి పరిశీలించి వ్రాస్తున్నను. ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు.

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి గారి వ్యాఖ్య ...

  శంకరార్యా ! సమాధానములు పంపుచున్నాను. చిత్తగించండి .

  రాముఁ డెవ్వరిఁ గూడి రావణు మర్దించె? = తోకమూకతో
  పరవాసుదేవుని పట్ణ మేది? = రంగనగరం
  రాజమన్నారు చే రంజిల్లు శర మేది? = లకోరికోల
  వెలయ నాలుగువంటి విత్తమేది? = జంబీరబీజం
  సీతను జేకొనఁ జెఱచిన ధను వేది? = పంచాస్త్రచాపం
  సభవారి నవ్వించు జాణ యెవఁడు? = వికటకవి
  అల రంభ తుఱుములో నలరు మాలిక యేది? = మందారదామం
  శ్రీకృష్ణుఁ డేయింటఁ జెలఁగుచుండె? = నందసదనం

  (ఇదికూడా పెద్దబాల శిక్షలో చదివానండీ )

  రిప్లయితొలగించండి
 3. గురువుగారికి జన్మదినశుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
 4. గురువుగారూ పై పద్యం, జవాబులూ చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో చదివేను.

  రిప్లయితొలగించండి
 5. మురళీ మోహన్ గారూ,
  నిజమే సుమా! ఈ రోజు నా పుట్టినరోజని మీరు చెప్పేదాకా గుర్తుకు రాలేదు.
  ఉదయాన్నే గుర్తుకు తెచ్చి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. ఈ పద్యం, సమాధానాలు అందరికి తెలిసినవే కదా! అందువల్ల ప్రత్యేకంగా సమాధానాలు ప్రకటించడం లేదు.
  సమాధానాలు పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి, శ్రీపతి శాస్త్రి గారలకు అభినందనలు.
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీరు చూసిన పెద్ద బాలశిక్షలో ‘కిటికోటికి’ అనే ఉందా?

  రిప్లయితొలగించండి
 7. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  జ్యోతి గారూ,
  వసంత కిశోర్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి