24, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 111 (ప్రహేళిక)

భర్త పేరు చెప్పిన పద్మనయన
చం.
"సరసిజనేత్ర! నీ విభుని చారుతరంబగు పేరు చెప్పుమా!"
"అరయఁగ నీవు న న్నడుగు నాతని పే రిదె చిత్తగింపుమా,
కరియును వారిరాశి హరుకార్ముకమున్ శర మద్దమున్ శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్కరముల్ గణుతింపఁ బే రగున్"

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఆమె భర్త పేరు చెప్పగలరా?
(గమనిక - అన్నీ మూడక్షరాల పదాలు. పదాల వ్యావహారికరూపాలనే స్వీకరించండి. ఉదాహరణకు కరికి ‘మాతంగము’ అని తీసికొంటే నాలుగక్షరాల పదం అవుతుంది. ముప్రత్యయం స్థానంలో అనుస్వారాన్ని ఉంచి ‘మాతంగం’ అనే మూడక్షరాల పదాన్నే తీసికోవాలి)
సమాధానం మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

9 కామెంట్‌లు:

 1. మందాకిని గారూ,
  కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  మీ యిద్దరి సమాధానాలు సరైనవే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 2. వసంత కిశోర్ గారూ,
  మీ సమామాధానాలు సరైనవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. మందాకిని గారి సమాధానం (24-7-11, 8.07 am)

  కరి --- సారంగం
  వారిరాశి --సాగరం
  హరుకార్ముకము ----పినాకం
  శరము ------సాయకం
  అద్దము ----ముకురం
  శుకము ----చిలుక.
  మొత్తం పేరు మధ్య అక్షరాలతో ----రంగనాయకులు.

  రిప్లయితొలగించండి
 4. కోడీహళ్ళి మురళీమోహన్ గారి సమాధానం (24-7-11, 8.11 am)

  కరి = సా`రం'గం
  వారిరాశి =సా`గ'రం
  హరు కార్ముకము = పి`నా'కి
  శరము = సా`య'కం
  అద్దము = ము`కు'రం
  శుకము = చి`లు'క

  రిప్లయితొలగించండి
 5. వసంత కిశోర్ గారి సమాధానం (24-7-11, 8.28 am)

  సారంగం
  సాగరం
  పినాకం
  సాయకం
  ముకురం
  చిలుక

  "రంగనాయకులు"

  రిప్లయితొలగించండి
 6. గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం (24-7-11, 8.41 am)

  ఈ దినము ప్రహేళిక యిదివకు ఒక సారి యిచ్చారు.అప్పుడు పప్పులో కాలు వేసాను.

  సారంగం
  సాగరం
  పినాకం
  సాయకం
  ముకురం
  చిలుక

  రంగనాయకులు

  రిప్లయితొలగించండి
 7. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  అభినందనలు. మీ సమాధానం సరియైనది.
  ఈ ప్రహేళికను ఇంతకు ముందు ఇచ్చా నన్నారు. నాకు గుర్తు లేదు. పాతపోస్టులు వెదకినా కనిపించలేదు. ఏరోజు పోస్ట్ చేసానో దయచేసి చెప్తారా!

  రిప్లయితొలగించండి
 8. ఈ ప్రహేళికను మీరు శంకరాభరణంలో ఇచ్చినట్లు గుర్తు లేదు కాని చింతారామకృష్ణారావుగారు వారి ఆంధ్రామృతం బ్లాగులో ఇదివరకు ఇచ్చారు. అయితే దానిలో వారిరాశి బదులుగా రక్కసుండు అని ఉంది.

  రిప్లయితొలగించండి
 9. సారంగము అంటే లేడి అని తెలుసును కానీ కరికి సారంగం అనే పర్యాయ పదం ఉందని ఈరోజే తెలుసుకున్నాను.

  రిప్లయితొలగించండి