17, జులై 2011, ఆదివారం

సమస్యా పూరణం -396 (పుట్టినదిన మని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పుట్టినదిన మని విషాదమున విలపింతున్.
ఉదయాన్నే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి
ధన్యవాదాలు.
వారు చెప్పే దాకా ఈరోజు నా పుట్టినరోజన్న విషయం గుర్తుకు రాలేదు.

56 కామెంట్‌లు:

  1. మాస్టరు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షల తో ....

    వట్టిగ కాలము నెట్టుచు
    గట్టిగ పది మంది మెచ్చు కార్యము నొకటిన్
    పట్టని నాకెందులకీ
    పుట్టినదిన మని విషాదమున విలపింతున్!

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ "వట్టిగ కాలము నెట్టుచు" పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. పుట్టిన గడ్డకు స్వేచ్చను
    పట్టుదలను తెచ్చినట్టి బాపూ యెదపై
    గట్టిగఁ గాల్చిన గాడ్సే
    పుట్టినదిన మని విషాదమున విలపింతున్.

    రిప్లయితొలగించండి
  4. గట్టిగ అణుబాంబును కని
    పెట్టిన దినమది, కనంగ పెను ముప్పులనే !
    పుట్టిని ముం 'చెడు ' బుద్ధులు
    పుట్టినదిన మని విషాదమున విలపింతున్!!

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్నగారూ! మీరు విలపించాల్సింది మే 19వ తేదీ అనుకుంటానండీ! :-))

    రిప్లయితొలగించండి
  6. జయ ఘన శోభియౌ, సహజ సద్గుణ శోభిత శంకరయ్యకున్
    జయమగుతన్. లసత్ సృజిత సత్కవి భాగ్యుఁడ! శ్రీకరుండ! ప్రా
    పయి మను మీరు యీ వరలు పుట్టిన రోజు శుభంబు గాంచుడీ!
    ప్రియ సుకవీశ్వరా! శుభము శ్రేయము భాగ్యము చొచ్చు మిమ్ములన్.

    ఘన శోభియౌ, సహజ స
    ద్గుణ శోభిత శంకరయ్యకున్జయమగుతన్.
    మను మీరు యీ వరలు పు
    ట్టిన రోజు శుభంబు గాంచుడీ! ప్రియ సుకవీ!

    సహజ సద్గుణ శోభిత శంకరయ్య!
    సృజిత సత్కవి భాగ్యుఁడ! శ్రీకరుండ!
    వరలు పుట్టిన రోజు శుభంబు గాంచు!
    శుభము శ్రేయము భాగ్యము చొచ్చు మిమ్ము.

    రిప్లయితొలగించండి
  7. గురువు గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  8. లక్కరాజు గారు ! ధన్యవాదములు.
    మిస్సన్న గారూ ! గాడ్సే పుట్ట్టిన 'దినం ' బాగుంది.

    గిట్టిన రోజును 'దినమని'
    గట్టిగ చెప్పుదుము గాదె, గాడ్సే వలెనే
    పుట్టను పట్టిన చెదలన్
    పుట్టిన; 'దినమని' విషాదమున విలపింతున్!!

    రిప్లయితొలగించండి
  9. జట్టుగ నేస్తుల జూడక
    పట్టున పదిమంది తోడ పండుగ లేకన్
    గట్టి యయె విదేశ గతిని
    పుట్టిన దినమని విషాదమున విలపింతున్ !

    రిప్లయితొలగించండి
  10. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంఆదివారం, జులై 17, 2011 9:45:00 AM

    గురువు గారికి,
    జన్మదిన శుభాకాంక్షలు.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  11. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు. మీ చెదల దినం చాలా బాగుంది.

    మురళీ మోహన్ గారూ మీరు మరీ అంతలా అనేస్తే మీ వ్యాఖ్య చూసి విలపించాల్సి వస్తోంది. వా..వా..వా..:-((

    మూర్తి మిత్రమా మీ విషాదంతో అలరించారు.

    రిప్లయితొలగించండి
  12. పద్యము కోసము వ్రాసా గాని బంధు మిత్రు లందఱితో అంతర్జాలము ద్వారా దగ్గర గానే వుంటున్నాము. గురువుగారికి మిత్రులందఱికీ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యుల జన్మదిన సందర్భముగా ఆశీ: పూర్వక ౩ in1 పద్యమధురిమను మరొక్క సారి మాకు రుచి చూపిన చింతా వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ ధన్యవాదములు. మీ పద్యము ,హనుమచ్ఛాస్త్రి గారి పద్యాలు చాలా బాగున్నాయి. గురువుగారిపై కవిత లల్లిన శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  15. మూర్తి గారూ ! ధన్యవాదములు. జన్మ భూమి లో జన్మదినోత్సవాన్ని జరుపుకొన లేని బాధను వ్యక్తం చేశారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  16. మాస్టారూ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు, నాకూ ఇంటిపోరు తప్పటంలేదని యెన్నో పద్యాలలో ముచ్చటించుకొన్నాం. అలానే, హాస్యరస పూరణ, శాంతిగారికి క్షమాపణలతో:
    ఇట్టుల మురిసితి శంకరు
    పుట్టిన దినమని;; విషాదమున విలపింతున్
    ఎట్టుల వారికి నాకున్
    తిట్టులెపుడు తప్పు నింట తెల్పుము బ్రహ్మా!

    రిప్లయితొలగించండి
  17. మోక్షగామి అయిన సన్యాసి, మోక్షం రాకుండానే ఆయుష్షు తరిగిపోతోందనే చింతతో:
    తొట్టియవిడచిన దాదిగ
    మిట్టాడితి మిడిసిపడుచు, మేకొనుదైవం
    బెట్టుల నాయువు తరుగను
    పుట్టిన దినమని విషాదమున విలపింతున్

    రిప్లయితొలగించండి
  18. డా.మూర్తి మిత్రమా! విదేశాలని యేమీ చింతించకండి. ప్రౌఢలను తేలేను గానీ, చంద్రభాసురం పట్టుకొని వస్తాను మీ పుట్టినరోజు జులైలోనే అని గుర్తు. తారీకు చెప్పండి.

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శంకరార్యా ! జన్మదిన శుభా కాంక్షలు!

    సత్యభామ స్వగతం :
    01)
    _____________________________________

    ఒట్టులు వేసితి వెన్నియొ !
    మెట్టిన దినమని బిలిచిన - మెరమెచ్చులకై
    గుట్టుగ సాగితివి , సవతి
    పుట్టిన దినమని ! విషాద - మున విలపింతున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  20. పట్టువలువయో, నగయో
    పట్టీలో యిల్లాలడుగగ, పైపైకిమరి ఊ
    కొట్టియె, నోటనబద్ధము
    పుట్టిన దినమని ! విషాద - మున విలపింతున్ !
    ____________________________


    సమస్యలో యతి చెల్లినట్లేనా మాష్టారూ

    రిప్లయితొలగించండి
  21. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జులై 17, 2011 3:26:00 PM

    గురువుగారికి,
    జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతి శాస్త్రిఆదివారం, జులై 17, 2011 3:27:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    గురువుగారికి,
    జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  23. ఆర్యుకు,సజ్జనాగ్రణికి,నాతతచాంధసశాస్త్రవాదని
    ర్ధార్యుకుఁ,శిష్యమాంద్యకలితాఘనచోరుకుఁ,తోషితాంబదృక్
    ధార్యుకు,నాంధ్రపద్యసుమదామసదార్చితమూర్తికివ్వె, ధీ
    వర్యుకుఁ, సత్కవీశునకుఁ,వందిత భూబుధ, శంకరార్యుకున్

    శుభకామనలన్నియొజే
    తభయంబులనిడగనాది దంపతులు, సదా
    విభవమ్ముగూర్ప సిరి, హరి
    యు,భవేచ్చల్దీర్పధాతయునుశారదయున్

    రిప్లయితొలగించండి
  24. పుట్టుక పుట్టుక నాకొక
    పుట్టినదిన మని విషాదమున విలపింతున్
    పుట్టియు, గిట్టితి. మరిమరి
    పుట్టితిఁ నెప్పటికి చక్రపుగతియు నాగున్?



    ప్రతి పుట్టుక ఒక పుట్టిన దినమైతే ఈ ఆయుష్షు ఎప్పటికి అంతమై, జనన మరణ చక్రము ఆగి ముక్తి దొరకునో !

    రిప్లయితొలగించండి
  25. 02)
    _____________________________________

    పుట్టిన దినమున వేడుక
    గట్టిగ జేసెద మనుకొన - గాఢముగా నన్
    గొట్టాలమ్మే పట్టెను !
    పుట్టిన దినమని విషాద - మున విలపింతున్ !
    _____________________________________
    గొట్టాలమ్మ = కలరాదేవత

    రిప్లయితొలగించండి
  26. తెనుగు పద్యము నేర్పమన్ననుఁ దీవ్రదీక్షనుఁ బూనిరా
    యనగ రాత్రిఁబగళ్ళుఁ దానొక యాగదీక్షగఁ జేతురే!
    రణముకాదిది, శంకరార్యుని రాగమాభరణమ్ముగా
    గనుము; నేర్చుకొనంగరాగదె, గంధమే నిది ఛందమే!

    గురువుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  27. 03)
    _____________________________________

    బిట్టున వచ్చెను వరదలు
    చెట్టుకొకరు పుట్ట కొకరు - చెల్లా చెదురై
    నిట్ట నిలువు చెట్టు కొసను
    పుట్టిన దినమని విషాద - మున విలపింతున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  28. కొత్త బట్టలు కొనలేని ఒక యువతి :

    04)
    _____________________________________

    కట్టుకొనగ చీర కరువు
    పెట్టుకొనగ నగలు లేవు - పేదల యింట్లో
    పుట్టుటయే పాపము గద !
    పుట్టిన దినమని విషాద - మున విలపింతున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  29. ఒక భార్య :

    05)
    _____________________________________

    జట్టుగ నుండక , కనకపు
    పట్టీలకు పట్టు బట్టి - పతితో గొడవల్
    పెట్టితి మతి మాలి, నకట
    పుట్టిన దినమని విషాద - మున విలపింతున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  30. అలిగిన భార్య :

    06)
    _____________________________________

    పెట్టే బేడా పట్టుక
    పుట్టింటికి వస్తి నేడు - పొరపా టయ్యెన్ !
    ఎట్టుల మరచితి భర్తకు
    పుట్టిన దినమని ? విషాద - మున విలపింతున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  31. మాస్టారు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    శంకరార్యా !
    పద్యములను పండించెడి
    సేద్యమునే నేర్పి నాల్గు చెరగుల 'నెట్లో '
    హృద్యము గా 'బ్లాగ్నడుపుచు'
    నాద్యుడవై బరగు మీకు నాజోతలివే !

    రిప్లయితొలగించండి
  32. ఒక ఆడ శిశువు ఆత్మ :

    07)
    _____________________________________

    పుట్టీ పుట్టక ముందే
    తొట్టెలొ నన్‌జంపినారు ! - తొందరపడి నే
    పుట్టితి నెందుకు వీరికి ?
    పుట్టిన దినమని విషాద - మున విలపింతున్ !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  33. శంకరార్యా ! జన్మ దిన శుభా కాంక్షలు !

    తేట తేట తెనుగు - తేట గీతుల నిచ్చు
    ఆట వెలది నిచ్చు - నంత లోనె
    కరుకు పదము నిచ్చు - కంద పద్యం బిచ్చు
    చదువు మాకు నేర్ప - శంకరయ్య !
    శంక లేక నూఱు - శతములు జీవింప
    కోరు కొందు నేను - కోటి మార్లు !

    రిప్లయితొలగించండి
  34. గురువు గారికి నమస్కారం .
    మీ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు, హృదయ పూర్వక అభినందనలు .

    రిప్లయితొలగించండి
  35. శ్రీపతిశాస్త్రిఆదివారం, జులై 17, 2011 10:58:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    పుట్టన పాలను బోసితి
    పుట్టినదినమని, విషాదమున విలపింతున్
    కొట్టితి నాసర్పంబును
    గట్టిగ బుసగొట్ట పాము, గడబిడ పడుచున్

    రిప్లయితొలగించండి
  36. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జులై 17, 2011 11:53:00 PM

    పెట్టగ నేమియు లేదే
    పుట్టిన దినమని, విషాదమున విలపింతున్
    నట్టేటన్ నను ముంచకు
    కిట్టా నిను నమ్మినాను క్లేశము తొలగన్

    పుట్టినన్ + తినమని = పుట్టిన దినమని
    పుట్టి = గంప

    రిప్లయితొలగించండి
  37. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కవిమిత్రులు ....
    నాగరాజు రవీందర్
    గోలి హనుమచ్ఛాస్త్రి
    భమిడిపాటి సూర్యలక్ష్మి
    లక్కరాజు శివరామకృష్ణారావు
    చింతా రామకృష్ణారావు
    డా. గన్నవరపు నరసింహ మూర్తి
    వసంత కిశోర్
    మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
    చంద్రశేఖర్
    సంపత్ కుమార్ శాస్త్రి
    శ్రీపతి శాస్త్రి
    ఊకదంపుడు
    మందాకిని
    మంద పీతాంబర్
    గారలు అందరికీ ధన్యవాదాలు.

    "జన్మదిన శుభాకాంక్షలు శంకరయ్య!"
    అనుచుఁ దెలిపిన కవిమిత్రు లందఱకును
    పేరుపేరునఁ దెలిపెద పేర్మి మీఱ
    మోదహృదయుండనై ధన్యవాదశతము.

    రిప్లయితొలగించండి
  38. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలూ దేనికదే వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు.
    అందమైన కందంలో ప్రశంసించి నా కానందం కలిగించారు. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. చింతా రామకృష్ణా రావు గారూ,
    కంద గీత గర్భిత చంపకమాలతో నన్ను ఆశీర్వదించి మహదానందాన్ని కలిగించారు. ధన్యోऽస్మి! మీకు నా నమస్సుమాంజలి.

    రిప్లయితొలగించండి
  40. మెట్టిన యింటికి నప్పులు
    పుట్టెడు, పట్టదు మగనికి ,పుస్తెలనే తా
    కట్టుగ బెట్టిరి కొట్టున
    పుట్టిన దినమున విషాదమున విలపింతున్!

    కంది వంశాన బుట్టిన చందురుండు ,
    పద్దెముల వ్రాయ నేర్పెడు పండితుండు,
    సుజన మిత్రుండు సద్గుణ శోభితుండు
    శంకరయ్యను దీవించు, శంకరుండు !!!

    వంద వత్సరాలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లి
    శంకరాభరణం బ్లాగును నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  41. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మాతృభూమిలో పుట్టినరోజు గడుపలేని విచారాన్ని వ్యక్తం చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మంచి విరుపుతో మనిద్దరికి అన్వయిస్తూ చక్కని పూరణ నిచ్చారు.
    మీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    ఈ సమస్యను సిద్ధం చేస్తున్నప్పుడే నా మనస్సులో శ్రీకృష్ణతులాభారం చిత్రంలోని "మెట్టిన దినమని సత్యయు/ పుట్టినదిన మంచు భోజపుత్రియు ....." పద్యం మెదిలింది. అదే సందర్భంతో మీ మొదటి పూరణ అలరించింది.
    మిగిలిన ఆరు పూరణ విషయవైవిధ్యంతో చాలా బాగున్నాయి. అభినందనలు.
    నాల్గవ పూరణలో ‘ఇంట్లో’ అనకుండా ‘ఇంటన్’ అంటే బాగుండేది.
    నాకు శుభాకాంక్షలు తెలిపిన పద్యం బాగుంది. ధన్యవాదాలు.
    ‘డేంజరపాయం’లా ‘నూఱు శతములు’ .... ? అయినా ఓకే ... అదే ‘పదివేలు’!

    రిప్లయితొలగించండి
  42. ఊకదంపుడు గారూ,
    సమస్యలో యతి ‘సుబ్బరంగా’ సరిపోయింది. పు-ఫు-బు-భు-ము లకు యతిచెల్లడం ‘పోలికవడి’.
    మీ పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం. ‘పట్టీ లిల్లాలడుగగ’ అంటే సరి!
    పద్యద్వయంతో శుభకామనలు తెలిపినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  43. మందాకిని గారూ,
    జననమరణ చక్రభ్రమణంపై మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    నన్ను సంబోధిస్తూ వ్రాసిన తరలం అలరించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  44. శ్రీపతి శాస్త్రి గారూ,
    సమస్య పాదాన్ని విరిచి మనోహరంగా పూరించారు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    కరుణప్రపూరితమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నన్ను సంబోధించిన పద్యం హృద్యంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  45. శంకరార్యా ! ధన్య వాదములు !

    " శంక లేక నూఱు - శకములు జీవింప "

    అని మొదట వ్రాసుకొన్నదే - చివర్లో
    100 అని నిర్ణయించడానికి నేనెవర్నని
    ఇంకో వంద పెంచాను - అంటే అనంతంగా
    మీరూ - మీ బ్లాగూ సాగిపోవాలనే కోరికతో :
    అందుకే అది

    "శంక లేక నూఱు - శతములు జీవింప
    కోరు కొందు నేను - కోటి మార్లు !"

    అయ్యింది !

    రిప్లయితొలగించండి
  46. గురువు గారూ, యతి గురించి తెలియచెప్పినందులకు, పద్య సవరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  47. గట్టిగ నెల కాలేదుగ
    గుట్టుగ పెండ్లాడి నేను గుడిలో గృహిణిన్
    చట్టున వచ్చెను మరదలు
    పుట్టినదిన మని విషాదమున విలపింతున్

    రిప్లయితొలగించండి
  48. చట్టున వచ్చుచు నుండగ
    చుట్టము లందరిని చేర్చి శుభలగ్నమునన్
    పెట్టుడు పోతల నత్తయ
    పుట్టినదిన మని విషాదమున విలపింతున్

    రిప్లయితొలగించండి