12, జులై 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 102 (ప్రహేళిక)

సీ.
ఏనుఁగు సింహంబు నెలనాగయును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
బక్షియు వస్త్రంబు పాషాణమును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడుఁ గూడి
యొక మాటలోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
యొక మాటలోపల నుండవలయు
తే. గీ.
దీని యర్థంబుఁ జెప్పఁగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను;
చెప్పు నాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

6 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారి సమాధానం ....

    ప్రహేళిక సమాధానములు చిత్తగించండి
    ( చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష లో చదివానండీ )

    ఏనుఁగు సింహంబు నెలనాగయును గూడి
    =నాగకేసరములు
    బక్షియు వస్త్రంబు పాషాణమును గూడి
    =కాకి బొంత రాయి
    ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడుఁ గూడి
    = నాగ గరుడేశ్వరము
    రారాజు రతిరాజు రాజరాజును గూడి
    = రాజ మదన కుబేరము

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ జ్ఞాపకశక్తికి జోహార్లు. అంత సరిగ్గా సమాధానాలను ఎలా గుర్తు పెట్టుకున్నారు? అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. శాస్త్రి గారూ, అభినందనలు.
    గురువుగారూ, ఈ సమాధానాలన్నీ ఇలా ఒకే పదం గా ఉండటం, ఈ పదం వాడుకలో ఉండటం ఉందా? కొంచెం విశదీకరించి చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  4. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    కిషోర్ జీ ! మందాకిని గారూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. హనుమచ్ఛాస్త్రిగారూ అభినందనలు

    రిప్లయితొలగించండి