1, జులై 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 91 (మతిలేని నరుండు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 35
సమస్య -
"మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్"
కం.
హిత మాచరించువారికి
హిత మొనరించుచును సుజనహితుఁ డగుచును దు
ష్కృత మెప్పుడుఁ జేయను స
మ్మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

42 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    01)
    ___________________________________

    అతిబలవంతుడు గానీ !
    అతులిత సంపదలు గల్గు - నాతడు గానీ !
    మతగురు వైనను గానీ !
    మతిలేని నరుండు మిగుల - మన్నన నొందున్ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  2. కిశోర్ జీ ! భలే చెప్పారండీ ! అభినందనలు.
    ఇంకొకర్ని కలిపితే బాగుంటుంది.. నే కలుపుతా...

    గతి చెడి, యెటులో జనస
    మ్మతమున తా సభ్యుడైన, మంత్రిగ నుండన్ !
    హత విధి ! మన చట్ట సభను
    మతిలేని నరుండు, మిగుల మన్నన నొందున్ !

    రిప్లయితొలగించండి
  3. చిన్న సవరణ తో ....

    గతి చెడి, యెటులో జనస
    మ్మతమున తా సభ్యుడగుచు మంత్రిగ నుండన్ !
    హత విధి ! మన చట్ట సభను
    మతిలేని నరుండు, మిగుల మన్నన నొందున్ !!

    రిప్లయితొలగించండి
  4. పతినిలఁ నమ్మిన జానకి
    సతి నడవులపాలుఁజేయు శంకాత్మునినే
    సతిఁదాఁ దిట్టెను -యకటా,
    మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్

    సీతమ్మని సందేహపడి మాటలాడిన వాని సతి వానిని చూచి యనుకున్నట్టుగా ఊహించాను.

    రిప్లయితొలగించండి
  5. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  6. గతిలేక తనకడ విగత
    మతియై జేరఁ, పతిహీన మనమందుననే
    కతమున బాధలు పడస
    మ్మతిలేని నరుండు మిగుల మన్నన పొందున్

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    మతి లేకున్నా ఎమేమి ఉన్నవారు మాన్యతను పొందుతారో వివరిస్తూ చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    ‘తిట్టెను + అకటా’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తిట్టెఁ గటకటా’ అందాం.

    రిప్లయితొలగించండి
  8. మెతక మొగుళ్లను సాధిం
    ప తయారయ్యెను కరుకుగ పలు చట్టమ్ముల్
    సతిఁ గలిగిన వెతలిక, శ్రీ
    మతి లేని నరుండు మిగుల మన్నన నొందున్!!

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 01, 2011 11:24:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    అతిగా బడులే పెరుగగ
    గతి తప్పెను చదువుబండి గతుకుల బాటన్
    యతులూ హితులూ కంటెను
    మతిలేని నరుండె మిగుల మన్నన నొందున్

    రిప్లయితొలగించండి
  10. అతిగా కెలుకుడు కెలకుచు
    మతి(దప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్‌
    కుతిదీరక నెనఱించిన
    గతినెఱుగని శునకతిమిరము(నొంటేలయ్యెన్‌

    రిప్లయితొలగించండి
  11. Hehe, that was creative .. and here is my response even thought it aint chandobadhdham

    అతిగా చిందులు వేసిన
    పందిని ఒంగోలు సీను చావంగొట్టెన్
    మలకుడు కెలికిన కెలుకుకు
    భీతిల్లిన వరాహంబు అజ్ఞాతయ్యెన్

    You give me one and I'll give you Ten :)

    రిప్లయితొలగించండి
  12. ఒంటేలుకి గంటగడవక
    పెంటల్లో వంటవండిన మలకుడు తినడా
    ఒంగోలుకి లంగోటా
    లంగా తగువుల్లో మునిగితేలు మహిలో సుమతీ

    Common 9 for the last one and 10 for the new one.. 19 more to go

    ...ఇవ్వకపోతే బూట్లు నాకాలి మరి

    రిప్లయితొలగించండి
  13. సీరియస్‌ తీసుకోబాకబ్బా ..మలకూ ..
    ఏదో సరదాకి .. ఉళ్ళూళ్ళూళ్ళుళ్ళ ఉత్తుత్తికి..

    రిప్లయితొలగించండి
  14. ఇవ్వకపోతే బూట్లు నాకాలి మరి
    _______________________

    ఆలశ్యమెందుకు? నాకెయ్యి మరి. ఎంతయినా నీ వృత్తి కదా :)




    జీవితంలో అన్నిట్లోనూ ఫెయిలయ్యి పాపం ఎందుకూ పనికి రాని ఫెయిల్యూర్స్ నీలా అజ్ఞాతల్లా తిరుగుతుంటారు పాపం


    ఒంగోలు కొట్టిన దెబ్బకి
    చేతగాని చవటాయొకడు విలవిల్లాడుచు
    వైఫల్యమే జీవితముగా
    నిరాశతో జీవిస్తూ అజ్ఞాతాయెన్


    I know how to handle incompetent people like you who are good for nothing. Try your best :)

    రిప్లయితొలగించండి
  15. నిన్న 'జోకు' లదినోత్సవం అంటగా..
    ఈరోజు బూటులు 'నాకు' దినోత్సవం చేద్దామని ..

    ఏదో కక్కుర్తి

    రిప్లయితొలగించండి
  16. నీ బొంద. నీలాంటి చవటాయి జోకర్ గాళ్ళని ఎవడు సీరియస్ గా తీసుకుంతాడులే. As I say always, your born failures are always amusing.

    రిప్లయితొలగించండి
  17. సరే, మరీ బూట్లు నాకటంలో కూడ కక్కూర్తంటే సరే. మరి తొందరగా వెళ్ళి నాకేసి రా.

    రిప్లయితొలగించండి
  18. అడిగి మరీ తన్నించుకున్నావుగా. Enjoy.

    రిప్లయితొలగించండి
  19. మలకూ.....అన్నట్టు మర్చిపోయా ... లోల్‌ ఏది??
    నీపేరుతో కామెంటుపడి దాన్లో లోల్‌ లేకపోతే నేతిబీరకాయలో నెయ్యి లేనట్టు ఉంటుందిగా


    looooooolllllll...

    రిప్లయితొలగించండి
  20. నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా చెయ్యని నీ బ్రతుక్కి LOL వేస్టని నేనే పెట్టలేదులే :)

    రిప్లయితొలగించండి
  21. ఏంటి, మలక్ తార కొట్టుకుంటునారూ?

    రిప్లయితొలగించండి
  22. ఇయ్యన్నీ కూడెడతాయా మలకూ?
    మంచిగా యెల్లి బ్లాగులోకంలో ఎన్ని సందులున్నాయో లెక్క పెట్టు పో

    అలాగే మా అన్యా మీద మైకేల్‌ వదినకామరాజు 3.0 వీడియో పెట్టు, నీ కీబోర్డ్‌ మీద సంగీతం కొట్టు.. నువ్వే పాడు ..
    మొత్తం అన్నీ కలిపి ఒంగోల్లో మిక్సింగ్‌ రీ రికార్డింగూ చేయిద్దాం..

    రిప్లయితొలగించండి
  23. కూడు పెట్టకపోవచ్చుగానీ మాంచి టైం పాస్. Yeah need to work on Vadinakamaraju 2.0. Thanks for reminding me ... A song is to be done soon.

    రిప్లయితొలగించండి
  24. ఎందుకు మలక్కూ ఇలా ఆవేదన పడతావు. మంచిగా మనిషిగా మారి కొత్తజీవితాన్ని ప్రారంబించు. ఈ కుట్రలకీ కుతంత్రాలకీ దుష్టులకీ దుర్మార్గులకీ దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నీ శేషజీవితాన్ని గడుపు మలకూ గడుపు ..

    ఖళ్‌ ఖళ్‌ ఖళ్‌ ... and one big lOLLLLLLLLLL

    రిప్లయితొలగించండి
  25. మలకూ అన్నట్టు నువ్వు మంచి కధారచయితవి అంటగా ...
    నీ కలానికి దుమ్ముదులిపి .. దాన్లో ఎర్ర సిరా పోసి ..మంచి కతలు రాయకూడదూ

    నాయాల్ది దెబ్బకి రాం గోపాల్‌ వర్మా, పూరీ జగ్గూ భాయ్‌ .. నీ కధకి మన ఒంగోలు అన్యా ని వీరోగా పెట్టి సినిమాతీయడానికి రోడ్డునపడి కొట్టుకోవాలి

    రిప్లయితొలగించండి
  26. ఏంటి మలక్కూ మాట్టాడవు. నువ్విలా సీరియస్సు తీసుకుంటే నీతో పచ్చి.. అంతే ,

    రిప్లయితొలగించండి
  27. డియర్ మలక్పేట్ గజ్జి కుక్క, వదిన కామరాజు 2.o వీడియో ఈ రోజే పెట్టురా http://maalikaasalurangu.info/node/42 నీ లాంటి గజ్జి కుక్కలు పెట్టే వీడియోలే బాగుంటాయిరా ఒళ్ళంతా గజ్జి పట్టిన కుక్కా.

    రిప్లయితొలగించండి
  28. http://maalikaasalurangu.info/node/18 కెలుకుడుగాళ్ళు నీహారిక అనే మహిళా బ్లాగర్ గురించి వ్రాసిన హేయమైన వ్రాతలు చూడండి: http://maalikaasalurangu.info/node/18

    రిప్లయితొలగించండి
  29. అతిగా కెలుకుడు కెలకుచు
    మతి(దప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్‌
    కుతిదీరక నెనఱించిన
    గతినెఱుగని శునకతిమిరము(నొంటేలయ్యెన్‌

    మదపుటెలుకలు కాకుండా మదపుపందుకొక్కులు అంటే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  30. మలక్పేట్ రౌడీ మీద కొత్త కథ వ్రాయబోతున్నాను http://patrika.teluguwebmedia.in చూస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి
  31. అజ్ఞాత గారూ,
    మలక్ పేట్ రౌడీ గారూ,
    ప్రవీణ్ శర్మ గారూ,
    అందరికీ నమస్సుమాంజలి. పరస్పర దూషణలకు, విమర్షలకు ‘శంకరాభరణం’ను వేదికగా చేయవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను. ఏదో మా మానాన మేము పద్యాలు వ్రాసుకుంటూ ఒక సంస్కారవంతమైన మార్గాన మొందుకు పోతుంటే మీ ‘కెలుకుడు’ ఏమిటండీ? ‘కెబ్లాస’ తదితరాల్లో నేను మెంబర్‍షిప్ తీసికోలేదు.
    నేను ఈ వ్యాఖ్యల నన్నింటినీ తొలగించాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేదు కదా!
    మలక్ పేట్ రౌడీ గారూ,
    మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను మొట్టమొదటి సమస్యాపూరణం చేసింది మీ బ్లాగులోనే. ‘శంకరాభరణం’ బ్లాగు పుట్టుకకు మీరూ స్ఫూర్తిదాతలే. మీ అమ్మగారంటే నాకు గౌరవం. వారి పద్యాలను కొన్ని మీ బ్లాగులో చూసాను. ఎలా ఉన్నారు?

    రిప్లయితొలగించండి
  32. జిగురు సత్యనారాయణ గారూ,
    ‘శ్రీమతి లేని నరుండు" అనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘యతులూ హితులూ’ అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  33. ఉదయాన్నే బ్లాగులోని "ఛాటింగ్ " చూసి అవాక్కయ్యాను.
    దయచేసి ఇటువంటి వాటికి 'శంకరాభరణాన్ని' వేదికగా చేయవద్దని మనవి.

    రిప్లయితొలగించండి
  34. నిరభ్యంతరంగా తీసేయండి మాస్టారూ. ఏదో సరదాకి, అప్పుడప్పుడూ ఇలా గిల్లికజ్జాలు.. Nothing for serious ..
    కానీ "2 జూలై 2011 12:10 ఉ" ఈ అఙ్ఞాత పూరణ/వ్యాఖ్యని మాత్రం తీయకండి. మతిలేని నరుడిని దృష్టిలో పెట్టుకుని నేను సీరియస్‌ గానే పూరణ చేశాను. ఇకముందు కూడా పూరిస్తూ ఉంటాను.

    మలక్‌ అంటే మాకూ గౌరవమే, పుట్టగొడుగుల మాదిరి ఇలా రోజుకో ఎదురుకెలుకుడు బ్లాగుపుట్టడానికి స్ఫూర్తి కూడా ఆయనే...:)
    Otherwise also, I personally like him ..

    మనిషిలో ఎంత సృజనాత్మకత ఉన్నా .. ఎన్ని టాలెంటులు ఉన్నా .. అవన్నీ ఇలా తన చుట్టూ ఉన్న మానసిక వికలాంగుల చేతిలో ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి.అదే నా బాధ

    రిప్లయితొలగించండి
  35. స్థితమగు ప్రజ్ఞను, చంచల
    మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్
    సతమత మగు టొప్పదిక ని-
    శిత శరముల సంగరమును జేయుము పార్థా!

    రిప్లయితొలగించండి
  36. మిస్సన్న గారూ,
    మీ గీతాబోధ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  37. శంకరయ్య గారు
    మీ బ్లాగ్ లో ఇటువంటి కామెంట్స్ ఉండటం నచ్చలేదు :(
    http://www.sankalini.org/p/blog-page_7690.html
    ఇక్కడ తెలుగు సాహిత్యానికి చెందినా బ్లాగులు లను ఒక్క చోట చేర్చాము
    వీలు కుదిరితే ఒకసారి చూడండి

    రిప్లయితొలగించండి
  38. మితిలేకయె సుతికొట్టుచు
    కితకితమని రాహులుండు కేరించంగన్
    కుతిమీరగ కాంగ్రేసున
    మతిలేని నరుండు మిగుల మన్నన నొందున్

    రిప్లయితొలగించండి


  39. అతుకుల బొంతగ మిగులును
    మతిలేని నరుండు; మిగుల మన్నన నొందున్
    స్థిత ప్రజ్ఞుడే జిలేబీ
    సుతిమెత్తగ మెలగుచున్ వసుధని వసతి గాన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి