3, జులై 2011, ఆదివారం

సమస్యాపూరణం - 382 (ఆనందింతురు క్రొత్త దంపతులు)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
ఆనందింతురు క్రొత్త దంపతులహో
యాషాఢ మేతెంచినన్ !
ఈ సమస్యను సూచించిన లక్కాకుల వెంకట రాజారవు గారికి ధన్యవాదాలు.

15 కామెంట్‌లు:

  1. చిన్న సవరణతో ..
    ఆనవ్వుల్ మది లోన నింపి మరియున్నా మాట పాటల్, భలే
    ధ్యానంబున్ మునిగన్న పానములలో తా ప్రక్క నూహించుచున్,
    మేనుల్ దూరము లైనగాని, విరహమ్మే క్రొత్త గా నుందని
    న్నానందింతురు క్రొత్త దంపతులహో! యాషాఢ మేతెంచినన్ !

    రిప్లయితొలగించండి
  2. ఆనందాశ్రువులూరఁ జేరి దయతో నాశీస్సులందించినన్
    సానందంబుగఁ బెండ్లియాడిరిది మా సౌభాగ్యమేనంచు, నే
    డానందింతురు క్రొత్త దంపతులహో! యాషాఢమాసంబునన్
    ఫో! నందాత్మజుపుత్రుడెవ్విధమునన్ పూబాణముల్ వైచునో!

    నేడు ఆనందిస్తున్నారు, రాబోయే ఆషాఢమాసంలో ఎలాగో నని వరసైన వారు ఆటలు పట్టించుట.

    రిప్లయితొలగించండి
  3. గానంబందునునాట్యమందు, సిరిదౌ కయ్యాల నాటాడుచున్
    ఆనందింతురుక్రొ త్తదంపతులహో, యాషాఢమేతెంచినన్
    హీనమ్మందురుజీవనమ్ము సుఖరాహిత్యంబు వేధించగా
    మౌనంబందున మున్గుచుంద్రు, కలలో మాయాసుఖంబొందుచున్

    సిరిదౌ = చిన్నదౌ- సరియేనా గురువుగారూ!
    మొదటి పూరణలో సమస్య పాదాన్ని తప్పుగా టైప్ చేసినట్టున్నాను.

    రిప్లయితొలగించండి
  4. ఓ పెద్దావిడ తన పెళ్ళైన క్రొత్తలో ఆషాఢ మాసంలో పడిన బాధను తలచుకొంటూ..............

    తానున్ నేనును నొక్క యింటి గడపన్ దాటంగ కీడంచు న-
    న్నానా డంపిన దత్త పుట్టిలు కహా యాషాఢ మేతెంచగన్
    కానీ వేరిటి క్రొత్త కాపురమునన్ కల్యాణ రాగాల నే-
    డానందింతురు క్రొత్త దంపతులహో యాషాఢ మేతెంచినన్ !

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మీరు మన్నిస్తే చిన్న సవరణలు.
    ఆనవ్వుల్ మది లోన నింపి మరియున్నా మాట పాటల్, భలే
    ధ్యానం(బందున నన్న)పానములలో తా ప్రక్క నూహించుచున్,
    మేనుల్ దూరము లైనగాని, విరహమ్మే క్రొత్త గా నుంద(టం
    చా)నందింతురు క్రొత్త దంపతులహో! యాషాఢ మేతెంచినన్ !

    రిప్లయితొలగించండి
  6. మందాకిని గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
    ‘నాట్యమం దలతిగా’ అంటే సరి!
    *
    మిస్సన్న గారూ,
    కల్యాణరాగం పలికించిన మీ పూరణ అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీరు సవరించిన పద్యము సర్వాంగ శోభితమై యొప్పుచున్నది.
    కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  8. శా: నానా సంవిధ మేఘ మాలికలకున్ నర్తించు కేకీ గముల్
    వానల్ , కోనల కొండలన్ ప్రకృతి దీవ్యన్ హేలలున్ , జిత్త జా
    తానేకోధ్ధృత సూన సాయకములున్ దట్టించు నిప్పట్టు - యె
    ట్లానందింతురు ? క్రొత్త దంపతు లహో ! యాషాడ మేతెంచినన్ .

    ---వెంకట రాజారావు . లక్కాకుల

    ---బ్లాగు : సుజన సృజన

    రిప్లయితొలగించండి
  9. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    ‘దీవ్యన్ హేలలు’ అన్నది ‘దీవ్యచ్ఛోభలు (దీవ్యత్ +శోభలు)’ అయితే ?

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    ____________________________________________

    నానా సూన వితాన వాసనల నా - నందించ తంటా గదా !
    పానీయంబులు భోజనంబు లకటా ! - ప్రాణాంతకమ్మౌనుగా !
    పోనీలే యని నూరకుండ, డడుగో - పూవిల్తు డేకొట్ట ! నె
    ట్లా నందింతురు ? క్రొత్త దంపతులహో - యాషాఢ మేతెంచినన్ !
    ____________________________________________

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మేనుల్ మండగ వేడి వేడి సెగతో మిన్నంటు ధూమ్రమ్మునన్
    వానాకాలపు మబ్బులన్ తలచుచున్ బంధించు కౌగిళ్ళనున్
    రానున్నట్టిది శ్రావణమ్మనెడిభల్ రమ్యంపు భావమ్ముతో
    నానందింతురు క్రొత్త దంపతులహో యాషాఢ మేతెంచినన్ !



    రిప్లయితొలగించండి