మాస్టారూ, కలుము అంటే ఎందుకో అర్థం కలవలేదనిపించి నిఘంటువు చూశాను. దాని అర్థం "కలుషగంధము" అని వుంది. కాబట్టి సమస్యని, "కలికి కంటినీరు కలిమి నొసఁగు" అని మార్చాలేమో పరిశీలించండి. ధన్యవాదాలు.
కిశోర్ జీ ఆ సినిమా నచ్చని దెవరు ? మీ పద్య ప్రవాహములొ పద్యాలన్నీ అందముగా ఉన్నాయి. నాకు మళ్ళీ కాకినాడ గుర్తు చేస్తున్నారు. హనుమచ్ఛాస్త్రి గారు, మందాకిని గారు మంచి పద్యాలు చెప్పారు.
నిన్న దేవులపల్లి వారి సాహిత్యం చదువుతుంటే మనం ఈ జెట్ స్పీడ్ లో యెంత కోల్పోయామో అనిపించింది. నాజూకుతనము, సుకుమారం, చిరునవ్వు, భావుకత, సిగ్గుపడే ఆడపడుచులు, ఆదరించే పెద్దవాళ్ళు, వగైరా వగైరా. ఇప్పటి టీవీ సీరియల్స్ చూస్తుంటే ఆడవారి మోహంలో, మాటలో క్రూరత్వమే తప్ప వేరే ఇంకేమీ కనిపించటం లేదు. ఆ నేపధ్యంలో: నేటి బాట నడచి నిగ్గుదేరె కలికి కాళి రూప మంది, కాన రాదు కలికి కంటినీరు;; కలిమి నొసఁగు కట్టుకొన్న వాని గావుకేక!
మందాకిని గారూ, మొదటి పద్యం బాగుంది. కాని పూరణలో అన్వయక్లేశం ఉన్నట్టుంది. రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. రెండవపూరణలో ‘వినుము + ఇంటిదాన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వినవె యింటిదాన’ అంటే సరి! * వసంత కిశోర్ గారూ, మీ ఆరు పూరణలు బహు బాగున్నవి. బాగు ... బాగు ... అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు. ముఖ్యంగా రెండవపూరణలో మీడియాకు కలిమి నొసగే కన్నీరు బాగుంది. ఇక సావిత్రి కన్నీరు ఎందరి నిర్మాతలకు సిరులు తెచ్చిందో లెక్కలేదు. మంచి పూరణ.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * జిగురు సత్యనారాయణ గారూ, `Once in a blue moon` అన్నట్టు ఎప్పుడో ఒకసారి తటిల్లతలా మెరుస్తారు. మాకు కవితాకాంతుల్ని వెదజల్లుతారు. అద్భుతమైన పూరణ. అభినందనలు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు. ఇక మీ పద్యరూప ప్రశ్నకు పద్యంలోనే సమాధానం ఇవ్వలనుకున్నాను. కాని ఉదయంనుండి జ్వరం, ఒంటినొప్పులు. అందువల్ల మనసు పెట్టలేకపోతున్నాను. రేపటికి ‘ప్రహేళిక’ను సిద్ధం చేయగలనో, లేదో? సమస్య పాదాన్ని పద్యం మధ్య చొప్పించడం, ప్రశ్నోత్తరాల రూపంలో ముక్కలు చేయడం ఎవరెప్పుడు ప్రారంబించారో కాని ఇటువంటి పూరణలను నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుండే అవధానాలలో వింటున్నాను. * చంద్రశేఖర్ గారూ, మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. * మిస్సన్న గారూ, ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
మందాకిని గారూ, అభినందనలు.చక్కని కనక ధారా స్తొత్రము కధ చెప్పి ఈ దినము అత్యుత్తమ పూరణ చేసి , మా కళ్ళల్లో కూడా నీరు చిలికించారు. గురువుగారూ మీకు స్వస్థత చేకూరాలని ప్రార్ధిస్తున్నాము. ఆరోగ్యము భద్రముగా చూసుకొండి.
మాస్టారూ, కలుము అంటే ఎందుకో అర్థం కలవలేదనిపించి నిఘంటువు చూశాను. దాని అర్థం "కలుషగంధము" అని వుంది. కాబట్టి సమస్యని, "కలికి కంటినీరు కలిమి నొసఁగు" అని మార్చాలేమో పరిశీలించండి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీరు చెప్పినట్లే మార్చాను.
మగని సుఖముఁ గోరి,మనువాడి చేరిన
రిప్లయితొలగించండికలికి కంటినీరు,కలిమి నొసఁగు
లేమ సిరినిఁ నిలుప లేదంచు నెఱుగగ -
నెలత హృదయమందు నిలుచు ఘనుడు.
(మగని సుఖముఁ గోరి,మదిలోనఁ గొలువైన కలికి కంటినీరు,
కలుము లొసఁగు లక్ష్మి నింట నిలుప లేదంచు
నెఱుగిన ఘనుడు నెలత హృదయమందు నిలిచిపోతాడు.)
కలిమి బలిమి విడుచు, నొలుకగా విడువక
రిప్లయితొలగించండికలికి కంటినీరు; కలిమి నొసఁగు
ఇంతి యింట నింత చింతలే లేకుండ
కలికి సంతసమును కలిగి యున్న.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
___________________________________
కట్టుకొన్నవాడు - కరుణతో దెచ్చిన
కావి రంగు చీర - కట్టి నపుడు
కాంతు డంత మెచ్చి - కౌగిలించిన నాడు
కలికి కంటి నీరు - కలిమి నొసఁగు!
___________________________________
వసంతమహోదయా! "కంటి నీరు" ని ఆనందబాష్పాలు గా చిత్రీకరించి మంచి భావానిచ్చారు. బాగుంది.
రిప్లయితొలగించండిచంద్రశేఖరా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండివినుము యింటి దాన ! వింత లేదిందులో
రిప్లయితొలగించండిబావి నీరు దెచ్చి ప్లాంటు లోన
శుద్ది జేసి యమ్మ శుభ్రమౌ రీతిగా
కలికి! కంటి! నీరు కలిమి నొసఁగు!
02)
రిప్లయితొలగించండి___________________________________
కడుపు తోడ యున్న - కన్న కూతు నకును
పనస పండు వంటి - బాబు పుట్ట
పాలుగారు చిన్ని - పాపణ్ణి ముద్దాడు
కలికి కంటి నీరు - కలిమి నొసఁగు!
___________________________________
03)
రిప్లయితొలగించండి___________________________________
కన్న కొడుకు కేమొ - కాకినా డందున
కలిమి-బలిమి గలుగు - కడక గలుగ
కమ్మ జూసి, యమ్మ - కళ్ళు చెమ్మ గిలిన
కలికి కంటి నీరు - కలిమి నొసఁగు!
___________________________________
కలిమి-బలిమి = ఎక్కువ జీతం
కడక = ప్రయత్నము = ఉద్యోగము
దేవదాసు నందు దివ్య నటన జేసి
రిప్లయితొలగించండిఆంధ్ర జనుల మన్న నందు కొనిన
సాటి యంచు లేని మేటియౌ సావిత్రి
కలికి కంటి నీరు కలిమి నొసగు !
మూర్తీజీ ! బావుంది !
రిప్లయితొలగించండిఅది నా కెంతో యిష్టమైన సినిమా !
04)
___________________________________
చిట్టి పొట్టి చిఱుత - చిన్ని పాపలుజేయు
చిత్ర చిత్ర గతుల - చేష్ట జూసి
చెప్పలేని మిగుల - శివము పొంగినయంత
కలికి కంటి నీరు - కలిమి నొసఁగు!
___________________________________
శివము = ఆనందము
కిశోర్ జీ ఆ సినిమా నచ్చని దెవరు ? మీ పద్య ప్రవాహములొ పద్యాలన్నీ అందముగా ఉన్నాయి. నాకు మళ్ళీ కాకినాడ గుర్తు చేస్తున్నారు. హనుమచ్ఛాస్త్రి గారు, మందాకిని గారు మంచి పద్యాలు చెప్పారు.
రిప్లయితొలగించండిమూర్తీజీ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిదేవ దేవునెదుట దీనంగ వేడెను
రిప్లయితొలగించండికళ్ళ నీళ్ళ తోడి కమల నయన
మంచి బుద్ధి నిచ్చి మమ్ముల కాపాడు
కలికి కంటినీరు కలిమి నొసఁగు
మూర్తిగారి స్ఫూర్తితో :
రిప్లయితొలగించండికొత్త తార ! విధిలేక ఒప్పుకుంది !
చెత్త డాన్సు చేయిస్తే - కళ్ళ నీరు పెట్టుకుంటూ చేసింది !
ఆపై సెక్సుబాంబనే నిందొకటి ! దాన్నీ మోసింది !
నిర్మాతకేమో కాసుల వర్షం !
05)
___________________________________
చిట్టి డ్రెస్సు వేసి - సిగ్గు విడచి తార
చేతు లెత్తి యాడ - చెత్త గాను !
నింద బరువు మోయు - నిర్మాతకు మిగుల
"కలికి కంటి నీరు " - "కలిమి నొసఁగు "!
___________________________________
నింద బరువు మోయు -కలికి కంటి నీరు
నిర్మాతకు మిగుల - కలిమి నొసఁగు!
కల్ల బొల్లి యేడ్పు కరుణా నిధికి కాగు
రిప్లయితొలగించండికన్న కూతు రన్న కరుణ గాదె
మిన్న యనగ ప్రజలు మీడియా కంతకు
కలికి కంటి నీరు కలిమి నొసగు !
కాగు = తపన
కొత్త కాపురం పెట్టిన మల్లి :
రిప్లయితొలగించండి06)
___________________________________
మల్లి ప్రేమ తోడ - పుల్లయ్య బెండ్లాడి
ఉల్ల మందు మిగుల - తల్ల డిల్లి
ఉల్లి పాయ కోయ - కళ్ళ కాల్వలు పారె !
కలికి కంటి నీరు - కలిమి నొసఁగు !
___________________________________
నింద బరువు మోయు -కలికి కంటి నీరు
సిరులు తరలి పోవు చిరుకారణమ్మగు
రిప్లయితొలగించండికలికి కంటి నీరు; కలిమి నొసగు
దేవి కరుణఁ జూప దీనుడి తలరాత
మారి పోవు; నేడ్పు మానుమమ్మ!
గడియ కొకటి వచ్చు కన్నీటి సీరియల్
రిప్లయితొలగించండిసాగదీయు శోక సాగరాన్ని
చాల డబ్బు వచ్చు చానలు వానికి
కలికి కంటినీరు కలిమి నొసఁగు!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితల్లి , చెల్లి , తనయ , దారయు నై తాను
రిప్లయితొలగించండిదిక్కయి మగవాని దీర్చుగాన
నువిద సుఖమె రక్ష నొసగు నొలుక రాదు
కలికి కంట నీరు - కలిమి నొసగు
--- వెంకట రాజారావు . లక్కాకుల
కోడలమ్మ "యింట కొలువైన దేవత"
రిప్లయితొలగించండిపూజ లెన్నొ జేసి పొలతి యత్త
కన్నకొడుకునిచ్చె గనుక - నొలక రాదు
కలికి కంట నీరు - కలిమి నొసగు
సుభాషిణీ రాజారావు
నిన్న దేవులపల్లి వారి సాహిత్యం చదువుతుంటే మనం ఈ జెట్ స్పీడ్ లో యెంత కోల్పోయామో అనిపించింది. నాజూకుతనము, సుకుమారం, చిరునవ్వు, భావుకత, సిగ్గుపడే ఆడపడుచులు, ఆదరించే పెద్దవాళ్ళు, వగైరా వగైరా. ఇప్పటి టీవీ సీరియల్స్ చూస్తుంటే ఆడవారి మోహంలో, మాటలో క్రూరత్వమే తప్ప వేరే ఇంకేమీ కనిపించటం లేదు. ఆ నేపధ్యంలో:
రిప్లయితొలగించండినేటి బాట నడచి నిగ్గుదేరె కలికి
కాళి రూప మంది, కాన రాదు
కలికి కంటినీరు;; కలిమి నొసఁగు
కట్టుకొన్న వాని గావుకేక!
శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిచివరి పాద మందు జేర్చి సమస్యను
పూరణమ్ము జేయు పూర్వవిధము
నేడు వివిధ గతుల క్రీడించు చుండుట
దెలియ నైతి దీని దెలుప గలరు
ఇనుము కాంచనమ్ము లెవరి కావాసమ్ము?
రిప్లయితొలగించండిఎదను బరువు దించు నెట్టి నీరు ?
కమల నాభు పత్ని కరుణించి యేమిచ్చు?
కలికి, కంటినీరు, కలిమి నొసఁగు.
(కలికి=కలిపురుషునకు)
మిస్సన్నగారు చక్కని పూరణ {భావన} నందించినారు. అభినందనలు
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యో నమ:
రిప్లయితొలగించండియుగయుగంబు నందు యుగదర్మమదిమారి
ధర్మపథము నడచు ధరణి పైన
మూడు యుగములందు చూడ ధర్మంబుండె
కలికి కంటినీరె కలిమినొసగు
(కలియుగానికి కన్నీరు,కష్టాలు, మొదలైనవే సంపదలు అనే అర్థంలో వ్రాశాను.)
శ్రీ పతి శాస్త్రి గారూ మీ "ధర్మార్థ భావన" మరింత బాగుంది.
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
రిప్లయితొలగించండిమొదటి పద్యం బాగుంది. కాని పూరణలో అన్వయక్లేశం ఉన్నట్టుంది.
రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రెండవపూరణలో ‘వినుము + ఇంటిదాన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వినవె యింటిదాన’ అంటే సరి!
*
వసంత కిశోర్ గారూ,
మీ ఆరు పూరణలు బహు బాగున్నవి. బాగు ... బాగు ... అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
ముఖ్యంగా రెండవపూరణలో మీడియాకు కలిమి నొసగే కన్నీరు బాగుంది. ఇక సావిత్రి కన్నీరు ఎందరి నిర్మాతలకు సిరులు తెచ్చిందో లెక్కలేదు. మంచి పూరణ.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
`Once in a blue moon` అన్నట్టు ఎప్పుడో ఒకసారి తటిల్లతలా మెరుస్తారు. మాకు కవితాకాంతుల్ని వెదజల్లుతారు.
అద్భుతమైన పూరణ. అభినందనలు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
ఇక మీ పద్యరూప ప్రశ్నకు పద్యంలోనే సమాధానం ఇవ్వలనుకున్నాను. కాని ఉదయంనుండి జ్వరం, ఒంటినొప్పులు. అందువల్ల మనసు పెట్టలేకపోతున్నాను. రేపటికి ‘ప్రహేళిక’ను సిద్ధం చేయగలనో, లేదో?
సమస్య పాదాన్ని పద్యం మధ్య చొప్పించడం, ప్రశ్నోత్తరాల రూపంలో ముక్కలు చేయడం ఎవరెప్పుడు ప్రారంబించారో కాని ఇటువంటి పూరణలను నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుండే అవధానాలలో వింటున్నాను.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఆది గురువు శంకరాచార్యు కరుణనుఁ
రిప్లయితొలగించండిబేదరాలు కరిగె బేల యగుచు
నశ్రు ధారఁ; కుఱిసె నచట కనక ధార!
కలికి కంటినీరు కలిమి నొసగె.
మందాకిని గారూ, అభినందనలు.చక్కని కనక ధారా స్తొత్రము కధ చెప్పి ఈ దినము అత్యుత్తమ పూరణ చేసి , మా కళ్ళల్లో కూడా నీరు చిలికించారు.
రిప్లయితొలగించండిగురువుగారూ మీకు స్వస్థత చేకూరాలని ప్రార్ధిస్తున్నాము. ఆరోగ్యము భద్రముగా చూసుకొండి.
శంకరార్యా ! ధన్యవాదములు !మీకు స్వస్థత చేకూరాలి. ఆరోగ్యము భద్రముగా చూసుకొండి.
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆరోగ్యం ఫరవాలేదు.
మందాకిని గారు శ్రావణ వరలక్ష్మికి చక్కగా స్వాగతం పలికేరు.
రిప్లయితొలగించండి