16, జులై 2011, శనివారం

సమస్యా పూరణం -395 (రావణుండు దిక్కు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రావణుండు దిక్కు రాఘవునకు
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

  1. యుద్ధమునకు రాగ సిద్ధమై శివ భక్త
    రావణుండు; దిక్కు రాఘవునకు
    నదియె ప్రీతి నిచ్చె నాదిత్య హృదయమ్ము
    కవచ రక్ష, రుషి యగస్త్యు డపుడు.

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో ...

    యుద్ధమునకు రాగ సిద్ధమై శివ భక్త
    రావణుండు; దిక్కు రాఘవునకు
    నదియె ననుచు నిచ్చె నాదిత్య హృదయమ్ము
    కవచ రక్ష, రుషి యగస్త్యు డపుడు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! బావుంది !

    రావణుడు సీతతో :
    01)
    ____________________________________

    రమ్ము భోగ మంద - రమ్ము, సీతా , నీకు
    రావణుండు దిక్కు !- రాఘవునకు
    తరము గాదు జలధి , - దాటి లంకను జేర !
    తనువు గూలు , నెటులొ - దాటె నేని !
    ____________________________________

    రిప్లయితొలగించండి
  4. రావణు డొరగగ యుద్ధాన; రాము గెల్చె,
    రామయన్న, యెరిగి రాజ నీతి
    లక్ష్మణు నంపెను, నేర్వగ లంక నీతి;
    రావణుండు దిక్కు రాఘవునకు
    ఇలా పూరించడం తప్పు కాదని భావిస్తూ చమత్కారమే ప్రధానంగా భావిస్తూ..

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 16, 2011 2:32:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    రామ వైరులైన రాక్షసాథములకు
    రావణుండె దిక్కు, రాఘవునకు
    దానవులను గెలచు ధర్మరక్షకునకు
    జయము కలుగు నెపుడు జగతిలోన

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, జులై 16, 2011 3:33:00 PM

    సీతనపహరించె దూతను హింసించె
    పదిశిరములవాడునదియెవండు?
    ధరణిజకొరకు జన దక్షిణ పయనమే
    రావణుండు, దిక్కు రాఘవునకు.

    రిప్లయితొలగించండి
  7. రాక్షసుండు,వాఁడు -రమణిని వేధించు
    రావణుండు; దిక్కు రాఘవునకుఁ
    జూపి, యండజమ్ము శుభమునుఁ బల్కెను.
    వైరిఁ జంపఁ గదిలె వజ్ర సముఁడు!

    రిప్లయితొలగించండి
  8. దీనజనుల దిక్కు దేవుండుముక్కంటి,
    రక్కసులకు దిక్కు రావణుండు
    దిక్కు రాఘవునకు ధీరత్వమేగదా
    నీతి దిక్కు జయము నిలుచుగాదె !!!

    రిప్లయితొలగించండి
  9. ఆ వనంబున సాధు రూపిగఁ యాచకుండగు నీచుఁడే
    రావణుండయె! దిక్కు రాఘవరౌద్రముంగనిఁ భీతినిన్
    గావ రమ్మని యా దిగంతముఁ గాంచు! వీరుడు, శూరుడా
    రావణుండను బూదిజేయును రామభద్రుడు ,తథ్యమే!

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన తర్వాత మీ పూరణ సర్వాంగసుందరంగా, ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    అలా పూరించడం ఏమాత్రం తప్పుకాదు. మీదుమిక్కిలి మంచి ఆలోచన. కాని పద్యాన్ని అలా గందరగోళం చేసారు? 1,3 పాదాలను తేటగీతిలో వ్రాసారు. 1వ పాదంలో యతికూడా తప్పింది. మీ భావానికి నా పద్యరూపం ...
    రావణుం డొరగగ రణమందు గెల్చిన
    రాముఁ డనుజు నంపె రాక్షసేంద్రు
    వలన నేర్చుకొనఁగ వరరాజనీతికి
    రావణుండు దిక్కు రాఘవునకు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రశ్నోత్తరరూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని ఇలా చెప్తే ఇంకా బాగుంటుందని నా సవరణ ...
    సీతనపహరించి దూతను హింసించె
    పదిశిరమ్ములు గలవాఁ డెవండు?
    ధరణిజకయి వెడల దక్షిణ మేమయ్యె?
    రావణుండు, దిక్కు రాఘవునకు.
    *
    మందాకిని గారూ,
    జటాయువును ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    *
    మంద పీతాంబర్ గారూ,
    సమస్యను ముక్కలు చేసి దత్తపదిగా మార్చారే! ఇలా కూడా చేయవచ్చా? బాగుంది... బాగుంది ... :-)
    *
    మందాకిని గారూ,
    ‘మందా’ వారి కంటె ‘మందాకిని’గా రెండాకులు ఎక్కువ చదివారు. ‘అ’కార ఆలాపన ఎక్కువయింది ‘మత్తకోకిల’కు. సెహబాస్!

    రిప్లయితొలగించండి
  11. అసుర వనిత లనిరి ఆయమ సీతతో
    "లంక నేలు కొనుము రాజ్ఞి వగుచు ,
    సుర, లసురుల కెన్నఁ, జూడుము!, నరులకు,
    రావణుండు దిక్కు రాఘవునకు."

    రిప్లయితొలగించండి
  12. సకల జగతి యతని చల్లని నీడలో
    సేద దీరు చుండ - చెలగి యతని
    నామ జపము లోనె నడయాడు చుండగా
    రావణుండె ? దిక్కు ! రాఘవునకు


    రామ! సుగుణ ధామ!రమణీయ శుభ నామ!
    భద్ర శైల ధామ! భాగ్య రామ!
    రాక్షస జిత భీమ! రమణిసీతా రామ!
    ముని జనముల పాలి మోక్ష రామ! --- రాజారావు

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిశనివారం, జులై 16, 2011 11:25:00 PM

    గురువుగారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  14. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, జులై 16, 2011 11:35:00 PM

    గురువుగారు ధన్యవాదములు. చక్కనిసవరణ చేసినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  15. మందాకిని గారి వ్యాఖ్య ....

    ఇది ఒక రాక్షసుని కథ అన్నమాట. ఒక రాక్షసుఁడు తపస్సు చేసి రణములందు జయమునిమ్మని పెక్కు విధముల స్తోత్రం చేశాడు. సాక్షాత్తూ ఆ పరమేశుని దర్శించగలిగీ సత్యమైనదీ, శాశ్వతమైనదీ కోరకుండా తాత్కాలిక విషయాలైన జయాపజయాలపై దృష్టి పెట్టిన వాఁడు మూర్ఖుఁడని వ్రాయాలని నేననుకున్నా, అందుకు అనువైన పదాల్ని పొదగలేకపోయాననుకుంటాను. మన్నించండి.

    నిన్నటి రోజు పూరణల్ని మళ్ళీ వచ్చి శ్రద్ధగా పరిశీలించి వ్యాఖ్యానించిన మీ ఓపికకు జోహార్లు.

    సునీత గారూ, నిస్సందేహంగా మీరు వ్యాఖ్యానించండి.
    నేను అలా జంకుతూ ఈ బ్లాగులోకి వచ్చి పద్యాల వల్ల ఎంతో మనోల్లాసాన్ని పొందేదాన్ని.
    కవిమిత్రులు ఇచ్చిన అమూల్యమైన ప్రోత్సాహం వల్ల ,
    పితృవాత్సల్యంతో నడకలు నేర్పే గురువుగారి కరుణాదృష్టి వల్ల ఇప్పుడిప్పుడే రాయటం నేర్చుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  16. మందాకిని గారూ,
    ‘రావణుండు + ఎ’ అని సమస్యలో ఉంటే మీరు ‘రావణుండు + అయె’ అని ఒక ‘అ’కారం ఎక్కువ వేసి మత్తకోకిల పద్యం వ్రాసారని చమత్కరించాను. అంతే!

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    రాక్షసవనితల మాటగా సమస్య పాదాన్ని సమర్థించారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    లక్కాకుల రాజారావు గారూ,
    ‘రావణుండు + ఏ దిక్కు’ అనే భావాన్ని తీసుకుంటే ‘ఏ’ హ్రస్వం కారాదుకదా! ‘నామ జపము లోనె నడయాడ యనుటెట్లు /
    రావణుండె దిక్కు రాఘవునకు ’ అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  18. గురువుగారు నమస్కారము .సమస్యను ముక్కలు చేసి దత్తపదిగా మార్చలేదు .సమస్యను రెండవ
    మరియు మూడవ పాదాలలో యధాతతంగానే వుంచి పూరించాను .యిది పూరణ గానే భావించాను .సరియైన
    పూరణ అవునో కాదో మీరే చెప్పాలి
    "- - --- - - రావణుండు
    దిక్కు రాఘవునకు - - - - -- ,"
    మిస్సన్న గారికి ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి
  19. పీతాంబర్ గారూ,
    నిజమే స్మీ! నేను గమనించనే లేదు. నేను పొరబడ్డాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  20. వసంత మహోదయా! పూరణ అద్భుతం. సుందరకాండ లోని ౨౦ వ సర్గ (రావణుడు సీతాదేవిని లోభ పెట్టుట)లోని రెండుమూడుశ్లోకాలకు అనువాదమా అన్నట్లున్నది.
    రమ్ము భోగ మంద - రమ్ము, సీతా , నీకు
    రావణుండు దిక్కు !- రాఘవునకు
    తరము గాదు జలధి , - దాటి లంకను జేర !
    తనువు గూలు , నెటులొ - దాటె నేని !

    రిప్లయితొలగించండి