అసమానకోదండుఁ డైన రా జెవ్వఁడు?
రాజుపేరిటఁ గల రాగ మేది?
రాగంబు సరివచ్చు రాజిత ఋతువేది?ఋతువు పేరిటఁ గల రుద్రుఁ డెవఁడు?
రుద్రుని పేరిట రూఢియౌ పక్షేది?పక్షి పేరిటఁ గల వృక్ష మేది?
వృక్షంబు సరివచ్చు వెలయు భూషణ మేది?భూషకు సరివచ్చు భూమి యేది?
తే. గీ.అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!ఎవరైనా సమాధానం చెప్పగలరా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ వద్ద వున్న సమాధానానికి ఇది ప్రత్యామ్నాయం
రిప్లయితొలగించండిలంకారి - రత్నాంగి - గ్రీష్మము - ముక్కంటి - టిట్టిభం - భూజము - మురుగు - గహ్వరి
పై సమాధానంలో టిట్టిభం చివరి అక్షరం మకారం తీసుకుంటే అప్పుడు నా సమాధానం లంకారి - రత్నాంగి - గ్రీష్మము - ముక్కంటి - టిట్టిభం - మహీజం - మురుగు - గహ్వరి
రిప్లయితొలగించండికోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని మీ సమాధానాలలో ఒక్కటికూడా సరిపోలేదు.
శ్రీరామ - మాళవ - వసంతం - ౦ -తీతువు - వటము - ముక్కెర - ౦
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానాలలో 4 సరిపోయాయి. అభినందనలు.