3, జులై 2011, ఆదివారం

సమస్యా పూరణం -381 (చెడు వారిన్ గొలువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. దడువకు ! నిర్మల చిత్తము
    మడిగట్టుక, లోకమునకు మాతా పితలై
    అడిగిన చాలును రక్షిం
    చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్ !!

    రిప్లయితొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారూ, చాలా అందమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పూర్వము దసరా మామూళ్ళు యివ్వక విద్యుచ్ఛక్తికి అంతరాయము సంభవించి బాధలకు గురి యయిన శ్రీ వసంత కిశోర్ గారికి నేనిచ్చిన సలహా..

    అడపా తడపా నిజమే
    గడుసరిగా పదవులున్న గజదొంగలకున్
    మడి దప్పి జేబు తడపుచు
    చెడువారిన్ గొలువఁ దీరు చిర కామ్యంబుల్ !

    ( జేబు తడపడము అంటే లంచమివ్వడము.)

    రిప్లయితొలగించండి
  4. హనుమచ్చాస్త్రి గారూ చక్కని పూరణ.

    రిప్లయితొలగించండి
  5. మూర్తి గారూ! ధన్యవాదములు.
    నేను మడి కట్టు కొమ్మంటే మీరు మడి దప్ప మన్నారు.. నిజమే ,కొన్ని పనులకు మడికట్టుక్కూర్చుంటే జరుగదు.. బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. అడిగిన వారికి నెప్పుడు
    విడువక నిత్తురు వరముల, వెఱువకు బాలా!
    గుడికేగుము కరుణ లభిం
    చెడు! వారిని గొలువఁదీరు చిరకామ్యంబుల్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీపతి శాస్త్రిఆదివారం, జులై 03, 2011 7:28:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    విడువక తారక మంత్రము
    కడు రమ్యముగా మనమున గానము జేస్తూ
    ఎడదన రాముని ధ్యానిం
    చెడు వారిన్ గొలువఁదీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  8. గడబిడ పడకుము పోలీ-
    సిడుమల బడు మంత్రి గారి హితవును బెట్టన్
    పెడచెవి, నేడే మన్నన్
    చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్.

    (ఒకే పోలీసు మరొక పోలీసు మిత్రునితో)

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జులై 03, 2011 8:32:00 PM

    మడిగట్టుకు మదినీశ్వరు,
    విడువక ధ్యానింతురెల్ల వేళలయందున్,
    కడు పుణ్యాత్ముల, పూజిం
    చెడు వారిని గొలువ దీరు చిరకామ్యంబుల్.

    రిప్లయితొలగించండి
  10. కం: తడయక తమ యుద్యోగుల
    యిడుమలు గుర్తించి జీతమిడి తమ కిడు న
    ట్లెడనెడ కడు గౌరవ మి
    చ్చెడు వారిం గొలువ దీరు చిర కామ్యంబుల్ .

    -- వెంకట రాజా రావు . లక్కాకుల

    -- బ్లాగు : సుజన సృజన

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చాలా అందమైన పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    మీ జ్ఞాపకశక్తికి జొహార్లు. చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమం. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.
    ‘చేస్తూ’ అని వ్యవహారరూపాన్ని వ్రాసారు. ‘గానముతో తా / నెడదను’ అందాం.

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్కరాజు వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ మీకు ‘గౌరవ మిచ్చెడునటుల’ చేసింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. మూర్తీజీ ! మీ రింకా మా లైన్‌మేన్ ను మర్చి పోలేదే !!!!
    శంకరార్యులు చెప్పినట్టు మీ ఙ్ఞాపక శక్తి గొప్పదే !
    మడి కట్టవద్దని మీరు చెప్పిన సలహా పాటించడం వల్ల యిబ్బందులు
    కలగట్లేదు !ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    "పరిత్రాణాయ సాధూనాం- వినాశాయచ దుష్కృతాం"- స్ఫూర్తితో :
    01)
    _________________________________

    కడు నిడుములు కలిగించుచు
    దుడుకు పనులు చేయుచున్న - దుష్టుల నిలలో
    కడతేర్చ; కరుణ,జన్మిం
    చెడు వారిన్ గొలువఁ దీరు - చిర కామ్యంబుల్
    _________________________________

    రిప్లయితొలగించండి
  15. "నీవే తల్లివి దండ్రివి " - స్ఫూర్తితో :


    02)
    _________________________________

    వాడే మోహన రూపుడు !
    వాడే తోడగు జనులకు ! - విభుడగు వానిన్
    నీడే నీ వన రక్షిం
    చెడు వారిన్ ,గొలువఁ దీరు - చిర కామ్యంబుల్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  16. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
    రెండవపూరణ రెండవ పాదంలో యతి తప్పింది. ‘విభుడగు వానిని’ పదాలను తిరగేసి ‘వాడే విభుడౌ/ వాడే వభుడున్’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  17. వసంత కిశోర్ గారూ,
    హన్నన్నా! ప్రాసకూడా తప్పిందండోయ్! ముందు నేను గమనించలేదు.
    నా సవరణ ...
    కడు మోహనరూపుం డా
    తడు జనులకు తోడునీడ దాతయు ప్రార్థిం
    చెడు వారి నెపుడు రక్షిం
    చెడు వా(ని)రిని గొలువఁ దీరు చిరకామ్యంబుల్.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారూ, కిశోర్ జీ ధన్యవాదములు. కిశోర్ గారి మొదటి పూరణ అదిరింది.

    రిప్లయితొలగించండి
  19. మూర్తి మిత్రమా గురువు గారు చెప్పే వరకూ
    మీ పూరణను అంతగా గమనించ లేదు.
    నిజంగా చాలా మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్న గారూ ,
    ధన్యవాదములు. సరదాగా జేబు తడపాలని వ్రాసాను గాని సహజముగా నూటికి తొంబై మందికి నిజాయితీగా బ్రతకాలని యుంటొంది. మరి సమాజము,సంస్కృతి అనుకూలిస్తే ఎంతో బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  22. అడిగిన డిగ్రీ నీయక
    పడిగాపులు గాయమనెడు పండిత సుతులన్
    తడబడ లాడక నామతి
    చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  23. కడపను నెన్నికలందున
    తడబడకిక వోట్ల కొరకు తప్పం త్రాగన్
    కుడియెడమల నోట్లను పం
    చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి


  24. అడుగులకు మడుగులొత్తకు
    సుడిగుండమున పడెదవు వసుధని జిలేబీ
    వడి రాముని నామము గొలి
    చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి