20, జులై 2011, బుధవారం

ప్రహేళిక - 45

ఈ పదాలు ఏవి?
తే. గీ.
వృష్టి, నిమ్నగ, దిక్కు, రవిజుఁడు, రాత్రి,
కలిమి, తారక, సత్కావ్యకర్త యనెడి
పదము లవి ద్వ్యక్షరమ్ములు; మొదలు విడువ
తుదలు మొదలగు నవి యెవ్వి? తోయజాక్ష!

మిత్రులారా,
సమాధానాలను వ్యాఖ్యగా పెట్టకుండా క్రింది మెయిల్ చిరునామాకు పంపండి.
shankarkandi@gmail. com

12 కామెంట్‌లు:

  1. శంకరార్యా !
    నా జవాబులు మీ mail కు పంపించాను !!

    రిప్లయితొలగించండి
  2. వసంత కిశోర్ గారూ,
    వెంటనే స్పందించి సరియైన సమాధానాలు పంపించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. సంపత్ గారూ,
    మీ సమాధానాలు అన్నీ సరియైనవే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ఈవేళ అప్పుడే ప్రహేళిక నివ్వటం , సమాధానాలు రావటం కూడా అయిపోయిందా? సరే నేనిప్పుడే పంపిస్తాను.

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, జులై 20, 2011 2:09:00 PM

    ధన్యవాదములు గురువుగారు.

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారి వ్యాఖ్య ....

    ఇవిగో - ప్రహేళిక - 45 - జవాబులు
    వాన - నది -దిశ - శని - నిసి - సిరి - రిక్క - కవి

    రిప్లయితొలగించండి
  7. సంపత్ గారి వ్యాఖ్య ...

    వాన, నది, దిశ, శని, నిసి, సిరి, రిక్క, కవి.

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారి వ్యాఖ్య ....

    వాన, నది, దిశ, శని, నిశి, సిరి, రిక్క, కవి.
    గురువు గారూ, మీరు ఈ ప్రహేళిక పెట్టిన సమయం ౭.౨౧ గా కనిపిస్తోంది. నేను తరువాతే ఈవేళ్టి పూరణ రాశాను. కానీ నాకు అప్పుడు ప్రహేళిక మీ బ్లాగులో కనిపించలేదే?
    నిశి, సిరి ఇది సరియేనా ? శిరి అంటే కూడా సంపదేనా?

    రిప్లయితొలగించండి
  9. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి ఛందోబద్ధ వ్యాఖ్య ....

    వాన నదియు దిశయు వానివెంటను శని
    నిసియు సిరియు రిక్క నెనరు కవియు
    వచ్చిరొరులవెంట వరుస తుదల బట్టి
    నేర్పుమీర నిటుల నీరజాక్ష!

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారి వ్యాఖ్య ...

    ఈ తరహా ప్రహేళికలో ప్రథమ ప్రయత్నం గురువుగారూ!
    వాన, నది, దిశ, శని, నిసి, సిరి, రిక్క, కవి.
    ప్రహేళిక చాల సులువుగా ఉందేమో.

    రిప్లయితొలగించండి
  11. మందాకిని గారూ,
    ఒక్క ‘నిసి’ దగ్గర పప్పులో కాలేసారు. మిగిలిన వన్నీ సరైనవే. అభినందనలు.
    ప్రహేళిక మీకు వెంటనే కనిపించక పోవడం ఏదైనా సాంకేతికలోపం వల్ల కావచ్చు.
    *
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    అందమైన పద్యంలో సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    అభినందనలు.
    నిజమే, కావాలనే సులభంగా ఇచ్చాను.

    రిప్లయితొలగించండి
  12. గుండా సత్యనారాయణ గారూ,
    సంతోషం! ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ సమాధానాలు అన్నీ సరైనవే కాకుంటే కాస్త ఆలస్యంగా పంపారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి