21, జులై 2011, గురువారం

సమస్యా పూరణం -401 (పతి జూచిన పడతి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.
(శ్రీ గరికపాటి వారి అవధానం నుండి ధన్యవాదాలతో)

22 కామెంట్‌లు:

 1. డా. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  మతి హీనుడు కవితలలో
  హితమింతయుఁ జూప లేక నింతుల ధ్యాసన్
  సతతమ్మును తపియించెడు
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్ !

  రిప్లయితొలగించండి
 2. మూర్తి మిత్రమా అభినందనలు. చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 3. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ....

  మిస్సన్న గారూ,
  ధన్యవాదములు. నా అదృష్టము కొలదీ నా శ్రీమతి నా పద్యాలు చదువరు. కానీ చంద్రశేఖర మిత్ర వర్యులు వచ్చి నా పై అభాండాలు వేస్తారు. అందు చేత వళ్ళు జాగ్రత్త పెట్టుకోవడము మంచిదేమో ! ( నాకు వంట చేత గాదు. ముదురు వయస్సులో ముద్ద పప్పు అన్నం దొరకాలిగా ! )

  రిప్లయితొలగించండి
 4. పతిదేవుని కై పడతియు
  పితగేహమునే మఱచును; పేరున కయినన్
  సతినెడ మరులనుఁ జూపని
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్ !

  రిప్లయితొలగించండి
 5. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, జులై 21, 2011 11:20:00 AM

  సతతము పన్నుల మోపు, దు
  రితముల జేబూను, సద్వరేణ్యుల దిట్టున్,
  హితమింతయు చేయని భూ
  పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

  భూపతి = రాజు,

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  సైరంధ్రి వెంట బడిన కీచకుణ్ణి చంపడానికి భీముడొక వృక్షాన్ని పెకలించబోతే
  వలదని వారించిన ధర్మజుని గాంచిన పడతి ద్రౌపది :

  01)
  ___________________________________

  సతి వెంట కీచకుని గని
  సతమతమౌ భీమసేను - చర్యల నెంతో
  సుతిమెత్తగ వారించిన
  పతిఁ జూచిన పడతి గుండె - భగ్గున మండెన్
  ___________________________________

  రిప్లయితొలగించండి
 7. కురుసభకు యీడ్చుకొని రాబడిన ద్రౌపది :

  02)
  ___________________________________

  మితిమీఱి జూద మాడెను
  సతినే పణముగ బెట్టెను - సర్వము నోడెన్ !
  అతి వ్యసనపరుండౌ తన
  పతిఁ జూచిన పడతి గుండె - భగ్గున మండెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 8. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  స్తుతమతి నారద మౌనియు
  నతులిత సూనమ్ము నిడగ నా కుసుమంబున్
  హిత మొసగె భోజ సుత కా
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్ !

  రిప్లయితొలగించండి
 9. అతి జలుబు చేయ బిళ్ళలు
  ప్రతి దినమును మ్రింగె, లేదు ఫలితము, హోమ్యో-
  పతి పని జేసెను, అల్లో-
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

  రిప్లయితొలగించండి
 10. డా.మూర్తి మిత్రమా! మొదటి పద్యం బహు పసందుగా వుంది. ముద్ద పప్పు అయితే నేనే వున్నాను. మీరు అంతటితో ఆగరుకదా. అ కార, ఉ కారాలలో ముద్ద మీద ఉ కారం చేరితే మాత్రం నావల్ల కాదు ప్రభో! ఎంతయినా విష్ణ్వాంశ సంభూతులు గదా, రెండో పద్యం లో నారదుల వారిని దించేశారు.
  మొదటి పద్యం కొంచెం adjust చేసుకొని ఇలా చదువుకొన్నాను. అప్పుడు మీరే ప్రత్యక్షం అయ్యారు :-).
  మతి మంతుడు కవితలలో
  హితమెంతయొ జూ పి గెలిచె నింతుల ధ్యాసన్
  సతతమ్మును తపియించెడు
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్ !

  రిప్లయితొలగించండి
 11. అతి సుందరుడని జేరిన
  నత డనుజుని జూపె, ముక్కు నాతడు కోసెన్
  హతవిధి యనుచును సీతా-
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

  రిప్లయితొలగించండి
 12. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 21, 2011 9:49:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  మితిమీరిన గర్వంబున
  మతి తప్పగ సురను గ్రోలి మానిని తోడన్
  అతిగా వాగుచు తిట్టెడు
  పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్

  రిప్లయితొలగించండి
 13. అతిగానూహించుకొనగ
  పతిదెచ్చెడుకాన్కగూర్చిపరిణయదినమున్
  మతిమరపుననిలుజేరిన
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్.

  రిప్లయితొలగించండి
 14. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  *
  మందాకిని గారూ,
  మీ పూరణలోని ఆర్ద్రత బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
  ‘పితృగేహము’ అనాలనుకుంటా.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  అద్భుతంగా ఉన్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ చమత్కారం అదిరింది. ధన్యవాదాలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  త్రాగుబోతు మొగుణ్ణి చూస్తే ఏ భార్యకైనా కోపమే. మంచి పూరణ. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  ఆ మొగుడెవరో నాలాంటి వాడే. పాపం!
  ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మతిమాలి, మందు మానక,
  అతి త్రాగుడు వలన బయట నప్పుల పాలై;
  సతి తాళి నమ్మ బోయిన
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్!

  రిప్లయితొలగించండి
 16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. యతి వోలెడు నరసింహుని
  గతి వర్ణించుచు దెలిపిన కథకుడు ఘనుడా
  చతురుండు వినయ సీతా
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్


  Book:

  "Half - Lion: How P.V. Narasimha Rao Transformed India"
  by Vinay Sitapati

  రిప్లయితొలగించండి
 18. రక్షాబంధన్ (ఉత్తరాదిన)

  అతి గడుసుది చెల్లాయికి
  మితిమీరిన ప్రేమతోడ మిక్కిలి కాన్కల్
  మతిపోవుచు నిచ్చిన తన
  పతిఁ జూచిన పడతి గుండె భగ్గున మండెన్

  రిప్లయితొలగించండి