నగతనయన్ ధరన్ సిరిని నాలుగు వర్ణములన్ లిఖించి, పొం
దుగఁ దుది నొక్క యక్కరము దూకొని వ్రాయఁగ నింపుమీఱఁగా
నగును గజాననుండు, మఱి యాదిగ నొక్కొక యక్కరంబు దిం
చఁగఁ జతురాననుండు, శరజన్ముఁడు, పంచశరుండు, వహ్నియున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
వివరణ -పార్వతి (రెండక్షరాలు), భూమి (ఒక అక్షరం), లక్ష్మి (ఒక అక్షరం) మొత్తం నాలుగు అక్షరాలు వ్రాసి చివర మరొక అక్షరాన్ని చేర్చితే గణేశుడు (కార్తికేయుడూ కావచ్చు) అనే అర్థం వస్తుంది. మొదటినుండి ఒక్కొక్క అక్షరాన్ని తొలగిస్తూ పోతే వరుసగా బ్రహ్మ (మన్మథుడూ కావచ్చు), సుబ్రహ్మణ్యుడు, మన్మథుడు, అగ్ని అనే అర్థాలు వస్తాయి.
కవిమిత్రులారా,
సమాధానం చెప్పగలరా?
సమాధానం మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం 99% సరిపోయింది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానం 100% సరైనది. అభినందనలు.
గురువు గారూ,
రిప్లయితొలగించండిమీరు రంగనాయకులు సమాధానం గా ఉన్న ప్రహేళికను ఇదివరలో ఇచ్చినదని వెతుకుతున్నట్టుగా వ్యాఖ్యల్లో తెలిసింది.
నేను వెతికి పట్టుకున్నాను.
http://kandishankaraiah.blogspot.com/2011/01/35.html
తల్లీ మందాకినీ,
రిప్లయితొలగించండిఎంత ఓపికమ్మా నీకు ...
వృద్ధాప్యం వల్ల మతిమరుపు క్రమక్రమంగా ఎక్కువవుతున్నది. ఈ ప్రహేళికను ఇంతకుముందు ఇవ్వడం, దాని మీద పెద్ద చర్చ జరగడం అన్నీ మరిచిపోయాను. ఉదయం నుండి నా బ్లాగులో వెదికే ప్రయత్నమూ చేసాను. కాని దొరకలేదు. ధన్యవాదాలమ్మా!
గురువుగారూ, గూగుల్ సెర్చ్ ఆ యా పదాలతో రెండు మూడు పేజీలు వెతికితే దొరుకుతుందండీ. అంతే.
రిప్లయితొలగించండిమా తప్పులు దిద్దే మీ ఓపిక ముందు నా ఓపిక ఎంత లెండి?
గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం ...
రిప్లయితొలగించండినగతనయ = ఉమ
ధర = కు
సిరి = మా
తుది అక్కరము = రు
ఉమా కు మా రు ( డు )
మాకుమారు = చతురాననుడు
కుమారు = శర జన్ముడు ( కుమార స్వామి )
మారు (డు ) = మన్మధుడు
రు = ? వహ్ని ( బుఱ్ఱకి, నిఘంటువుకి దొరక లేదు )
గోలి హనుమచ్ఛాస్త్రి గారి సమాధానం ...
రిప్లయితొలగించండిఉమాకుమార = గణేశుడు (కార్తికేయుడూ కావచ్చు)
మాకుమార = బ్రహ్మ
కుమార = సుబ్రహ్మణ్యుడు
మార = మన్మథుడు
ర = అగ్ని
గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ...
రిప్లయితొలగించండిసమాధానము ఉమాకుమార అవాలి. సంస్కృతము, తెలుగు కలిపి మన కున్నంత పదజాలము మరింకే భాషకు ఉండదు. ఈ వయస్సులో ( జూలై ౧౬ కి నాకు కూడా ౬౦ నిండాయి. మీ కంటే నేను ఒక రోజు పెద్ద, ఒక సంవత్సరము చిన్న.) నా బుర్రకి భలే పదును పెట్టిస్తున్నారు.
సరియైన సమాధానాలు పంపిన
రిప్లయితొలగించండిగన్నవరపు నరసింహ మూర్తి గారికి
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
అభినందనలు.
మందాకిని గారికి
ధన్యవాదాలు.
మూర్తీజీ ! అభినందనలు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! అభినందనలు !