గురువు గారూ, సమస్యను సమర్థించడానికి భృత్యుణ్ణి చెడ్డవాడుగా చిత్రీకరించినాను. యదార్థ సంఘటనను చెపితే "భేషనిరి జనుల్" అను దానిని సమర్థించలేము కదా. ఇది నా ఆలోచన మాత్రమే.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘కేలును + ఎత్తెన్’ ఇలా విసంధిగా వ్రాయరాదు కదా. ‘కేలెత్తెఁ గదా’ అందాం. * చంద్రశేఖర్ (మన తెలుగు) గారూ, చక్కని పూరణ. అభినందనలు. * శ్రీపతి శాస్త్రి గారూ, సవరించిన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, ఆలోచన ఎలా ఉన్నా మీ పూరణ బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు. * మందాకిని గారూ, భేషనిపించుకొనే పూరణ మీది. ప్రశ్నోత్తరరూపంలో చక్కగా ఉంది. అభినందనలు.
కవిమిత్రులు మన్నించాలి. రాత్రి పూరణ పోస్ట్ చేసి పడుకోవాలనే తొందరలో తప్పుదొర్లింది. ‘విలసత్ + ఉద్యములు’ అన్నప్పుడు ‘విలసదుద్యములు’ అవుతుంది. మిత్రులు ‘గురువుగారు తప్పు చేయరు’ అన్న నమ్మకంతో దానిని గమనించలేదో లేక గమనించినా నా మీద గౌరవంతో వ్యాఖ్యానించలేదో! సవరించిన నా పూరణ ...
పైత్యము పెరిగెను చూడగ
రిప్లయితొలగించండికృత్యా కృత్యము మరచెను, కేలును ఎత్తెన్!
సత్యము జూడరు జనులయొ!
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్!
చంద్రశేఖర్ పూరణ:
రిప్లయితొలగించండినిత్యము చూచెడి దృశ్యము
సత్యము వెర్రికి శిరములు శతమెట్లన్నన్
అత్యావేశమున నెగసి
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్!
శ్రీదురుభ్యోనమ:
రిప్లయితొలగించండినిత్యము జరిగెడు కృత్యమె
భృత్యులపై చిన్నచూపు బోములు జగతిన్
సత్యము దైవంబెరుగును
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్
బోము = బలాత్కారము
సత్యాసత్యములెరిగి,య
రిప్లయితొలగించండిసత్యము వచియించె నేత సానిధ్యమునన్,
అత్యాశకు లొంగిన యా
భృత్యుని మోదగ హరీశు, భేషనిరి జనుల్.
గురువు గారూ, సమస్యను సమర్థించడానికి భృత్యుణ్ణి చెడ్డవాడుగా చిత్రీకరించినాను. యదార్థ సంఘటనను చెపితే "భేషనిరి జనుల్" అను దానిని సమర్థించలేము కదా. ఇది నా ఆలోచన మాత్రమే.
శ్రీపతి శాస్త్రి గారు,
రిప్లయితొలగించండిమీ పద్యములోని రెండవ పాదములో యతి భంగమైనదనుకుంటాను.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
___________________________________
ప్రత్యవరుడు గావుననే
భత్యముకై వృత్తి జేయు - బంటును గొట్టెన్ !
సత్యము నెరుగని వారలె
భృత్యుని మోదగ హరీశు - భేషనిరి జనుల్!
___________________________________
ప్రత్యవరుడు = అధముడు
ముత్యము లెట్లు చెదిరినవి?
రిప్లయితొలగించండినిత్యము సంధి -హరి,కీశునికి నెటులగునన్-
సత్యము నా పద్యము విని
భృత్యుని మోదగ ; హరీశు ; భేషనిరి జనుల్.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిసంపత్ గారు ధన్యవాదములు. పద్యమే మార్పు చేస్తున్నాను.
దైత్యులవలె దాష్ఠీకము
నిత్యము చేయించు వారె నేతలుకాగా
సత్యము దెలిసియు భయమున
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రి గారూ చక్కని పూరణ చేసారు.
నిత్యపు జర రుజ బాధలు
మృత్యువుఁ దాఁ దప్పకుండె మేలుగఁ బుట్టన్ !
సత్యము నెఱుగరె ! ప్రభువై
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్ !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘కేలును + ఎత్తెన్’ ఇలా విసంధిగా వ్రాయరాదు కదా. ‘కేలెత్తెఁ గదా’ అందాం.
*
చంద్రశేఖర్ (మన తెలుగు) గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
సవరించిన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ఆలోచన ఎలా ఉన్నా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
భేషనిపించుకొనే పూరణ మీది. ప్రశ్నోత్తరరూపంలో చక్కగా ఉంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
నా పూరణ ....
రిప్లయితొలగించండిఅత్యుగ్రరణములో విల
సత్యుద్యములైన కపులు శౌర్యముఁ జూపన్
ప్రత్యుద్గతుఁడై రావణ
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్.
(హరి + ఈశుఁడు = వానరరాజు, సుగ్రీవుఁడు)
శంకరార్యా ! సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిహరీశునకు ఊహించని అర్థముతో చక్కని పూరణ మాకందించి నండులకు ధన్యవాదములు.
గురువుగారు ధన్యవాదములు. రామాయణపరముగా మీరు చేసిన పూరణ చాలాబాగున్నది.
రిప్లయితొలగించండిగురువుగారూ,
రిప్లయితొలగించండిఅత్యద్భుతమైన పూరణ. నమస్సులు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిచక్కని పూరణకు అభినందనలు !
గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ...
రిప్లయితొలగించండిగురువు గారూ , మీ పూరణ అత్యుత్తమముగా ఉంది.
కవిమిత్రులు మన్నించాలి.
రిప్లయితొలగించండిరాత్రి పూరణ పోస్ట్ చేసి పడుకోవాలనే తొందరలో తప్పుదొర్లింది. ‘విలసత్ + ఉద్యములు’ అన్నప్పుడు ‘విలసదుద్యములు’ అవుతుంది. మిత్రులు ‘గురువుగారు తప్పు చేయరు’ అన్న నమ్మకంతో దానిని గమనించలేదో లేక గమనించినా నా మీద గౌరవంతో వ్యాఖ్యానించలేదో!
సవరించిన నా పూరణ ...
అత్యుగ్రరణములో మా
రుత్యాది కపిగణములు నిరూఢిన్ బోరన్
ప్రత్యుద్గతుఁడై రావణ
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్.
(హరి + ఈశుఁడు = వానరరాజు, సుగ్రీవుఁడు)
రిప్లయితొలగించండిసత్యమ్మవునా కాదా?
ముత్యపు నగరమ్ము మాది ముండా కొడకా!
గత్యంతరమ్ము లేదని
భృత్యుని మోదగ హరీశు భేషనిరి జనుల్!