21, జులై 2011, గురువారం

ప్రత్యేక సమస్యా పూరణం -400 (భ్లాగు సమస్య లివె)

కవి మిత్రులారా,
మీ అందరి సహకారంతో ‘శంకరాభరణం’ నిరాటంకంగా కొనసాగుతున్నది. చూస్తూ చూస్తుండగానే సమస్యాపూరణాల సంఖ్య 400 చేరింది. ఇకముందు కూడా ఇలాగే కొనసాగడానికి మీ అందరి ఆశీస్సులను, సలహాలను, సహకారాన్ని కోరుకుంటున్నాను. లబ్ధప్రతిష్ఠులు, ఔత్సాహికులు సమస్యలను పూరిస్తూ నాకు నూతనోత్తేజాన్ని కలిగిస్తున్నారు.
అందరికీ వందనాలు, ధన్యవాదాలు.

ఈ సందర్భంగా క్రింది ప్రత్యేక సమస్యను పూరించవలసిందిగా మనవి.
భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!

23 కామెంట్‌లు:

  1. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....
    మిత్ర వర్యులు చక్కని పూరణలు చేసున్నారు. కాని కొంత మంది ప్రథమా విభక్తి డు,ము,వు,లు ప్రత్యయాలనే మింగేస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని ;

    వేగము పూరణ జేయరు
    వేగింతురు యతులు గణము విరుపులు లేకన్
    పాగా వేసిరి, పద్యపు
    బ్లాగు సమస్య లివె నాల్గు వంద లయెఁ గదా !

    రిప్లయితొలగించండి
  2. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, జులై 21, 2011 11:38:00 AM

    ఏగుణముల కీర్తింతు, స
    భాగణమున శంకరార్య భాసురులను, ఛం
    ధోగుణ(గణ)యాగ క్రతువున
    బ్లాగుసమస్యలివె నాల్గు వందలయె గదా.

    రిప్లయితొలగించండి
  3. guruvu gaariki namaskramulatO

    baaga nacchina vaatini
    blaaguna bettaga samasya bahuvidhamulugaa
    vEgamugaa pUriMpaga
    blaagu samasyalive naalguvaMdalaye gadaa!

    రిప్లయితొలగించండి
  4. బాగగు కైతలు! మనసును
    లాగెడు పూరణలు! పద్య లాఘవ రీతుల్!
    బాగన విజ్ఞులు! శంకరు
    భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!

    రిప్లయితొలగించండి
  5. బ్లాగులలో మణి పూసై
    బ్లాగుల తల మానికంపు బాగై వెలిగే
    మా గురు శంకర వర్యుల
    భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 21, 2011 9:39:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    యోగము కలిగెను వ్రాయగ
    బాగుగ పద్యంబులెన్నొ పండితు లిచటన్
    సాగుచు నున్నది శంకర
    బ్లాగు సమస్యలివె నాల్గు వందలయె గదా

    రిప్లయితొలగించండి
  7. సాగెను కవితాసేద్యము,
    బాగోగులు గురువు జూడ,పలు పద్యమ్ముల్
    రాగాలోలుకుచు పండెను
    భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ వర ప్రసాద్ గారి పూరణకు తెలుగు లిపి .
    వరప్రసాద్ చెప్పారు...
    గురువు గారికి నమస్కారములతొ
    బాగా నచ్చిన వాటిని
    బ్లాగున బెట్టగ సమస్య బహువిధములుగా
    వేగముగా పూరింపగ
    బ్లాగు సమస్యలివె నాల్గువందలయె గదా!

    రిప్లయితొలగించండి
  9. [
    కొన్ని బ్లాగులు అందు వ్యాఖ్యలు చూస్తే - సమస్యలు సృష్టించటానికే వచ్చారా అనిపిస్తుంది... అలాంటి వాటి సంగతి పక్కానపెడితే ]

    బాగోగులెరుగనివారు
    సాగించెడువాటియొక్క సంగతి విడువన్
    బాగుగ పరిష్కృతమయిన
    బ్లాగు సమస్యలివె నాల్గువందలయె గదా!

    రిప్లయితొలగించండి
  10. నేను సైతం సమస్యకొక పూరణనిచ్చాను,
    నేను సైతం పూరణకొక సమస్యనిచ్చాను.

    శంకరార్యా, శంకరాచార్యా, ధన్యోస్మి.


    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ___________________________________

    సాగాలీ బ్లాగెన్నడు
    నాగక , నభివృద్ధి జెంది, - యాహా యనగా
    మోగవలె బ్లాగులన్నిట !
    భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  12. 02)
    ___________________________________

    బ్లాగులలో బంగారము
    సాగించెను జైత్రయాత్ర - శంకరు దయతో !
    జేగీయమానముగ యీ
    భ్లాగు సమస్య లివె నాల్గు - వంద లయెఁ గదా!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  13. 03)
    ___________________________________

    ఆగదు వర్షం బొచ్చిన
    సాగును దినకరుని రీతి - శంకర భరణం !
    భాగీరథి వలె సాగిన
    భ్లాగు సమస్య లివె నాల్గు - వంద లయెఁ గదా!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రు లందరికీ నమస్కృతులు.
    సమస్యాపూరణలు 400 సంఖ్యను దాటిన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక సమస్యను మనోహరంగా పూరస్తూ నన్నూ, బ్లాగును ప్రశంసించిన
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    వరప్రసాద్ గారికి,
    మిస్సన్న గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    ఊకదంపుడు గారికి,
    వసంత కిశోర్ గారికి
    ధన్యవాదాలు.
    ప్రశంసతో కూడిన పద్యాలు కనుక గుణదోషాల విచారణ చేయడం లేదు.

    రిప్లయితొలగించండి
  15. 04)
    ___________________________________

    ఏ గోలయు నిట నుండదు
    మాగిన కదళీ ఫలములె - మాధుర్య మహో !
    వేగము తిన రండయ్యా !
    భ్లాగు సమస్య లివె నాల్గు - వంద లయెఁ గదా!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  16. సమయాభావం వల్ల లేటయింది.
    చంద్రశేఖర్:
    గూగులు,ఫాంటులు, నెట్టిక (నెట్+యిక)
    భ్లాగు, సమస్య లివె నాల్గు;;వంద లయెఁ గదా
    బాగగు సమస్య పూరణ
    భోగములహహా మదీయ పుణ్యఫలంబే!

    రిప్లయితొలగించండి
  17. చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పద్యం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. బాగు, సమస్యల పూరణ
    వేగము జేయగ సమస్య ? వేడుక యగుగా !
    మూగు సమస్యలు లేకనె
    భ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!!

    రిప్లయితొలగించండి
  19. బాగుగ జదివితి నిప్పుడె
    "బ్లాగు సమస్య లివె నాల్గువంద లయెఁ గదా!"
    సాగుచు వేలకు వేలుగ
    జాగృతి జేసెను తెలుగును శంకర బ్లాగే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు!

      తొలగించండి