2, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 92 (అస్ఖలితబ్రహ్మచారి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 36
సమస్య -
"అస్ఖలితబ్రహ్మచారి కార్గురు పుత్రుల్"
కం.
ఈ స్ఖాప్రాసము దుష్కర
మస్ఖలనత నీయఁ దగునె యది సుకవులకున్?
సస్ఖలితలయి గుహుం గని
రస్ఖలితబ్రహ్మచారి కార్గురు; పుత్రుల్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

7 కామెంట్‌లు:

  1. రిస్ఖేమియు లేదనుచును
    తా స్ఖలనము నిడక వీర్య దానము చేయన్ !
    చూస్ఖో గొడ్రాళ్ళు గనిరి;
    "అస్ఖలితబ్రహ్మచారి కార్గురు పుత్రుల్!!"

    రిప్లయితొలగించండి
  2. ఖస్ఖసముల నమ్ముకొనెడి
    అస్ఖలితబ్రహ్మచారి కార్గురు పుత్రుల్
    ఖస్ఖసములనమ్మ, ధనము
    నస్ఖలితముగనపుడొచ్చె నధికము కలలో!
    ఖస్ఖసము = గసగసాలు
    అస్ఖలితముగ = తొట్రుపాటు లేకుండ

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    1)
    _______________________________

    అస్ఖలితంబగునేమో ?
    ఈ స్ఖా ప్రాస నిరికించు - టిబ్బం దగునా !!!
    ఛీ,స్ఖలితులకే గానె
    ట్లస్ఖలిత బ్రహ్మచారి - కార్గురు పుత్రుల్ ?

    _______________________________

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రిస్ఖేమీ లేదని చూస్ఖోమంటూ మీరు చెప్పిన పద్యం బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    బాగుంది పద్యం. అభినందనలు.
    ఈ ‘ఖస్ఖసాలు’ ఎక్కడివండీ? నా కెక్కడా కనిపించలేదు.

    వసంత కిశోర్ గారూ,
    స్ఖాప్రాసను బాగానే ఇరికించారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ, ధన్యవాదములు.
    ఆంధ్రభారతి నిఘంటువు లో దొరుకుతున్నాయండి, ఖస్ఖసములు.

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! ధన్యవాదములు.
    విషయాన్ని గట్టిగా చెప్పుటకు అన్నట్లుగా (ప్రాస కోసం).. రిస్ఖు,చూస్ఖో ... అని వాడాను.
    నచ్చినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి