29, జులై 2011, శుక్రవారం

ప్రహేళిక - 47

ఈ పదాలు ఏవి?
ఆ. వె.
దాన మొసఁగువాఁడు, తననుఁ గన్న వనిత,
వ్రాత, వెఱ్ఱి, యగ్ని పదము లవ్వి
ద్వ్యక్షరమ్ములు తుది యక్షరా లాదులౌ
నట్టివానిఁ జెప్పునతఁడె ఘనుఁడు.

కవిమిత్రులారా,
ఆ పదాలేమిటో చెప్పగలరా?
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.కం

7 కామెంట్‌లు:

  1. మందాకిని గారూ,
    వసంత కిశోర్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    మీ అందరి సమాధానాలు సరియైనవే.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    కావాలనే తేలికగా ఉండేవిధంగా తయారు చేసాను. ముందు ముందు (అంచెలంచెలుగా) స్థాయి పెంచాలని ఆలోచన.
    మీరే పప్పులోనూ కాలు వేయలేదు. మీ సమాధానాలు 100% కరెక్ట్! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా ! ధన్యవాదములు !
    మొదటి పాదంలో గణాల నొకపరి పరికించండి !

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    నిజమే! అక్కడ గణం తప్పింది. ధన్యవాదాలు. ‘కాంత’ను ‘వనిత’గా మార్చాను.

    రిప్లయితొలగించండి
  5. భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
    పప్పులో కాలేసారు.
    అన్నీ రెండక్షరాల పదాలు. మొదటిపదం చివరి అక్షరంతో రెండవపదం మొదలవుతుంది. రెండవపదం చివరి అక్షరంతో మూడవపదం మొదలవుతుంది. ఉదా. తల-లచ్చి-చితి-తిక్క-కవి-విరి .. ఇలా ..

    రిప్లయితొలగించండి
  6. మధిలీరామ్ గారూ,
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మీ యిద్దరి సమాధానాలూ సరైనవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మందాకిని గారి సమాధానాలు ...
    దాత, తల్లి, లిపి, పిచ్చి, చిచ్చు
    *
    వసంత కిశోర్ గారి సమాధానాలు ...
    దాత - తల్లి - లిపి - పిచ్చి - చిచ్చు
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారి సమాధానాలు ...
    దాత - తల్లి - లిపి - పిచ్చి - చిచ్చు
    *
    చంద్రశేఖర్ గారి సమాధానాలు ...
    దాత, తల్లి, లిపి, పిచ్చి, చితి (?)
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానాలు ...
    దాత,తల్లి,లిపి,పిచ్చి,చిచ్చు
    *
    భమిడిపాటి సూర్యలక్ష్మి గారి సమాధానాలు ...
    దానమొసగువాడు...... దాత
    తననుకన్నతల్లి ....... మాత, అమ్మ
    వ్రాత.................. లిపి
    వెఱ్ఱి.................. పిచ్చి
    అగ్ని.............. నిప్పు
    *
    మైథిలీ రామ్. జి. గారి సమాధానాలు ...
    దాత , తల్లి, లిపి, పిచ్చి, చిచ్చు.
    *
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానాలు ...
    దాత
    తల్లి
    లిపి
    పిచ్చి
    చితి

    రిప్లయితొలగించండి