4, జులై 2011, సోమవారం

సమస్యా పూరణం -382 (కరుణానిధి కూఁతురునకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

 1. ఇరుతీరములనుఁ జేరుచుఁ
  వరుసగ తానములు సేసి , వదలిరి నానా
  తెఱగు పదార్థము లచ్చట
  కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్

  కరుణానిధి -కరుణ నిధిగా, అపారముగా కలిగిన శ్రీమన్నారాయణుడు.
  కూతురు - నారాయణుని పాదముల నుండి పుట్టినదని చెప్పబడే గంగానది.

  రిప్లయితొలగించండి
 2. ఖలనిధి, పేరుకు మాత్రము
  కరుణానిధి, పరమ రోగ కలుషనిధి కనన్!
  మరిచెప్పగ నాశ్చర్యమే
  కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్.

  రిప్లయితొలగించండి
 3. దురితములను దయతోడను
  త్వరితంబుగ తొలగఁజేయు దైవంబయ్యున్
  సురనది గతినే గనుమా,
  కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్

  కరుణానిధి -కరుణ నిధిగా, అపారముగా కలిగిన శ్రీమన్నారాయణుడు.
  కూతురు - నారాయణుని పాదముల నుండి పుట్టినదని చెప్పబడే గంగానది.

  త్వ - లఘువు అని త్వరితంబుగ అని రాశాను. ఒక వేళ త్వ- గురువు అయితే త్వరితముగ అని వ్రాయవచ్చుఅనుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  కరి మింగిన వెలగ కరణి
  కరణీయము గాదు యామె - కరక ప్పనులే !
  కరుణించకు డే మాత్రము !
  కరుణానిధి కూఁతురునకుఁ - గల్మష మంటెన్ !
  _________________________________
  కరక = Black, dark, ugly

  రిప్లయితొలగించండి
 5. "త్వ" లఘువే. కానీ దాని ముందు "తోడను" లో "ను" గురువు అవుతుందిగదా!

  రిప్లయితొలగించండి
 6. అజ్ఞాత గారూ,
  స్పందనకు ధన్యవాదములు. తోడను మీద ఊనిక ఉండదనుకుంటున్నాను. తప్పంటారా?

  రిప్లయితొలగించండి
 7. కం: అరెరే ! మన రాజకీయ
  వరాహములు బురద వీడి వత్తురె కడుగ ?
  న్నరవలు సుడి తిరగేయగ
  కరుణానిధి కూతురునకు గల్మ మంటెన్ .

  --- వెంకట రాజారావు . లక్కాకుల

  --- బ్లాగు : సుజన సృజన

  రిప్లయితొలగించండి
 8. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జులై 04, 2011 12:19:00 PM

  ఇరుజేతుల నార్జించుచు,
  పరిత్రుప్తుడు గాక,కూతు, భార్యా సుతులన్,
  ఇరికించెను జూటాడగ,
  కరుణానిధి కూతురునకు గల్మషమంటెన్.

  జూటాడగ = మోసగించు

  రిప్లయితొలగించండి
 9. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జులై 04, 2011 12:41:00 PM

  వరుసస్కాముల బాధలు,
  పరిమార్చుటకొఱకు మునిగె వాహినిలో, నిం
  పిరి దరి జేరగ జూచిన,
  కరుణానిధి కూతురునకు గల్మషమంటెన్.

  నింపిరి = మలినము

  రిప్లయితొలగించండి
 10. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జులై 04, 2011 12:45:00 PM

  L.V.RAJA RAO గారు,

  కందములొ, మూడవ గణము ( బేసిగణము ) "జ" గణము రాకూడదని విన్నాను. తప్పైతే క్షమించండి.

  రిప్లయితొలగించండి
 11. మందాకిని గారూ,
  మీ పేరును సార్థకం చేస్తున్నవి మీ రెండు పూరణలు. చాలా బాగున్నాయి. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మంచి విషయంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  మొదటి పాదంలో ప్రాస తప్పింది. ‘దురితాత్ముడె, పేరును గన’ అందాం.

  రిప్లయితొలగించండి
 12. వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కాదు + ఆమె’ అన్నప్పుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘కరణీయము గా దనకను - కరకపు పనులే ’ అందాం.

  మందాకిని గారూ,
  ‘త్వ’ గురువని ఎలా అనుకున్నారు? హ్రస్వాచ్చుతో ఉంది కనుక అది లఘువే. లాభం లేదు .. మీకు ఛందోపాఠాలు మొదలు పెట్టాల్సిందే :-)

  రిప్లయితొలగించండి
 13. అజ్ఞాత గారూ,
  బ్లాగును చూసి స్పందించినందుకు ధన్యవాదాలు.
  అక్కడ ‘త్వ’ పూర్వాక్షరం గురువు కాదు.

  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  ప్రశస్తమైన పూరణ. బాగుంది. అభినందనలు.
  సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్లు మొదటి పాదంలో గణదోషం దొర్లింది. ‘అరరె మన రాజకీయపు’ అంటే సరి!

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
  ‘త్రుప్తి ..?’ తృప్తికి టైపాటే కదా!

  రిప్లయితొలగించండి
 14. అరవక కరవక గప్ చుప్,
  అరవములో ముఖ్యుడైన, ఆ రాజాతో
  మరికలువ టూజి స్కామున
  కరుణానిధి కూతురునకు గల్మషమంటెన్!

  రిప్లయితొలగించండి
 15. శ్రీపతిశాస్త్రిసోమవారం, జులై 04, 2011 7:59:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  పరువున్ దీసిరి మంత్రులు
  గురుతరమగు బాధ్యతలకు, గోప్యము తోడన్
  పరికించి చూచి నంతనె
  కరుణానిధి కూతురునకు గల్మష మంటెన్

  రిప్లయితొలగించండి
 16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నేనైతే (యతులో, గణాలో తప్పినప్పుడు తప్ప) కరవను కాని, అరిచే చెప్తాను ‘మీ పూరణ చాలా బాగుంది’ అని! అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణను ‘పరికించి’ చూసాను. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 19. మందాకిని గారూ సార్థక నామ దేయులై మీరు గురువుగారన్నట్లు
  మందాకినిపై పూరణ జేసి సమస్యను పునీతం చేశారు.
  నేను చెప్ప దల్చుకున్న భావాన్ని ప్రకటించేసి నన్ను ఖాళీ చేసేశారు.
  అభినందనలు.
  కవి మిత్రు లందరి పూరణలూ ప్రశస్తంగా భాసిస్తున్నాయి.

  రిప్లయితొలగించండి
 20. మిత్రుల పూరణలు బ్రహ్మాండముగా యున్నాయి. సంపత్ కుమార్ శాస్త్రి గారూ మీ పద్యాలు అదురుతున్నాయి.

  వరకామిని పైశాచము
  తరంగములఁ దనివి దీఱ తైతక లాడెన్
  మరుడయ్యెన రాజన్నయు ?
  కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్ !

  2 జి స్పెక్ట్రం తరంగాలలో అంతా చిక్కుకొన్నారు. నిజమేదో అబద్ధ మేదో తెలుసుకోవడము కష్టమే, కాని రాజకీయాలలో యుండి ప్రజాసేవకులమని చెబుతూ యితరులకు సాధ్యపడని అపార సంపదలు కూడబెడితే ఆ సంపదలే వారి అవినీతికి సాక్ష్యముగా నిలుస్తాయి.

  రిప్లయితొలగించండి
 21. కం: తొందర పాటున దొర్లెను
  చందోభంగమ్ము- గనిన- శాస్త్రికి , మీకున్
  వందనములు - సరిజేసిరి
  కంద్య న్వయ శంకరయ్య ! కమనీయముగా .

  --- వెంకట రాజారావు . లక్కాకుల

  రిప్లయితొలగించండి
 22. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  పైశాచపు తరంగాలా? మంచి ప్రయోగం. పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  లక్కాకుల రాజారా
  వొక్కొకచో నెవరికైన నొప్పుగ దొరలున్
  తప్పులు; సహజమె; మిత్రుల
  చక్కని సూచనల వినుటె సహృదయత యగున్.

  రిప్లయితొలగించండి
 23. ఇది నా మొదటి సమస్యా పూరణ ప్రయత్నం. తప్పులున్న మన్నించ ప్రార్ధన:

  వరములాశ జూపి వచ్చె పదవిలోకి
  సిరులు చూసినంతనే సిగ్గెగ్గులొదిలెన్
  పరుల సొమ్ము పాముయని మరచెనేని
  కరుణానిధి కూతురునకు గల్మషమంటెన్

  రిప్లయితొలగించండి
 24. గురువుగారూ ధన్యవాదములు.' వరకామిని పైశాచపు తరంగముల ' గా మార్చినందులకు కృతజ్ఞతలు ( పుంప్వాదేశ సంధి )

  లక్కాకుల వారి పై మీ పద్యము అమోఘము. మూడవ పాదములో తక్కులు కి తప్పులు అని టైపాటు వచ్చింది.

  వసంత కిశోర్ గారితో మాట్లాడుతాను. మన మంతా ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి.

  రిప్లయితొలగించండి
 25. వరదలు యెన్నో వూళ్ళను
  కరవులతో ముంచివేయ కనిమొళి వెడలెన్ !
  ఒరిగి బురదలో కాలిడ
  కరుణానిధి కూతురునకు కల్మషమంటెన్ !

  రిప్లయితొలగించండి
 26. గురువుగారూ,మిస్సన్నగారూ ధన్యవాదములు.
  ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి గురువుగారూ, ఎప్పుడో పదవతరగతిలో ఒకటీ,రెండు క్లాసుల్లో ఏం విన్నానో ఏమో ,అంతే . మీ పాఠాలు వినడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇంకా కొన్నైనా ఛందో రీతులు తెలుసుకోవాలని కోరిక.

  రిప్లయితొలగించండి
 27. గురుబలము జాలలేదో
  మరుగునబడిపోవుననుచు మదిననుకొనెనో
  చెరిగెను నగవులు మొగమున
  కరుణానిధి కూతురునకుగల్మషమంటెన్ !!! .

  రిప్లయితొలగించండి
 28. అరయగ తప్పులు తడికెలు
  తరుణుల కెప్పుడును లేవు తమతమ జనముల్
  పురుషుల దోషముల వలన
  కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్

  రిప్లయితొలగించండి
 29. అరవపు తరుణుల నిట్టుల
  పరిపరి రీతులను తిట్ట పాపము కాదా?
  సరికాదిది సరికాదిది:
  "కరుణానిధి కూఁతురునకుఁ గల్మష మంటెన్"

  రిప్లయితొలగించండి


 30. అరరే దస్కము దక్కెను
  కరుణానిధి కూఁతురునకుఁ, గల్మష మంటెన్,
  సరిగా నుపయోగము చే
  సి రవంతయు దేశమున పసిడినింపకనే !


  జిలేబి

  రిప్లయితొలగించండి