26, జులై 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 113 (ప్రహేళిక)

చం.
మమతను దన్ను నొక్క చెలి "మానిని! నీ విభు నామ మే"మనన్
గమలజగంధి పల్కెఁ "గరి కంధి ప్రజాపతి చంద్రి కాతప
త్రములఁ ద్రివర్ణయుక్తముగ వ్రాసియు నందలి మధ్యవర్ణముల్
క్రమముగఁ గూర్చి పల్కినను క్రమ్మర నా విభు నామ మయ్యెడిన్"
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా,
ఆ మానిని మగని పేరేమిటి?
(ముప్రత్యయం స్థానంలో అనుస్వారం ఉంచండి. ఉదా. ‘కంధి’ శబ్దానికి సముద్రము అని నాలుగక్షరాలు కాక సముద్రం అని మూడక్షరాలు స్వీకరించండి.)
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

6 కామెంట్‌లు:

 1. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  మీ సమాధానం 100% సరియైనది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 2. మందాకిని గారూ,
  మీ సమాధానం సరియైనది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం ...

  సా‘రం’గం
  సా‘గ’రం
  వి‘ధా’త
  కౌ‘ము’ది
  గొ‘డు’గు

  ‘రంగధాముడు’

  రిప్లయితొలగించండి
 4. మందాకిని గారి సమాధానం ...

  కరి = సారంగం
  కంధి = సాగరం
  ప్రజాపతి = విధాత
  చంద్రిక = కౌముది
  ఆతపత్రము = గొడుగు
  మధ్య అక్షరాలతో రంగధాముడు అనే పేరు వస్తుంది.

  రిప్లయితొలగించండి
 5. సరియైన సమాధానాలు పంపిన
  కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి
  మందాకిని గారికి
  అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి అభినందనలు.
  మందాకిని గారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి