గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ రెండు పూరణలూ వైవిధ్యంగా, బాగున్నాయి. అభినందనలు. మొదటి పూరణలో ‘సౌరశక్తి’ అనడం సరైనది. * వసంత కిశోర్ గారూ, నిజమే! త్రాగుబోతుకు వేళాపాళా ఎక్కడివి? మంచి పూరణ. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, సంతోషం! మీ లోటు కొట్టొచ్చినట్టు కన్పించింది. సవరించిన తర్వాత మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * మందాకిని గారూ, మంచి విషయాన్నే ఎన్నుకున్నారు పూరణకు. బాగుంది. ‘అచట,అకట కు యతి’ అసలు సందేహం ఎందుకు వచ్చింది? మీరు ఆటవెలదిని పంచపాదిగా వ్రాసారు. అలా వ్రాయకూడదు కదా! ఆ అవకాశం తేటగీతి, వృత్తాలలో మాత్రమే.
లక్కాకుల వెంకట రాజారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘చేసి + అర్ధరాత్రి’ .. ఇక్కడ యడాగమం రావాలి కదా! * శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. ‘దీపావళీ నాటి’ అన్నచో ‘దీపావళిన్ నాటి’ అంటే బాగుంటుంది.
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....
రిప్లయితొలగించండిసౌర్య శక్తి దినము సంగ్రహించి నిశను
దేజరిల్లు గృహము మోజుఁ జేరి
పగటి వేష గాఁడు పగలెల్ల కుదరక
అర్ధరాత్రి రవికి అర్ఘ్యము లిడె !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిమూర్తీజీ ! బావుంది !
తాగుబోతు :
01)
___________________________________
అమ్మ నాన్న లన్న - అనురాగ మది సున్న
ఆలిమీద సుంత - యనుగు లేదు
ఆసవమును మిగుల - నారగించెడి వాడు
అర్ధరాత్రి రవికి - నర్ఘ్యము లిడె !
___________________________________
అనుగు = ప్రేమ
ఆసవము = మద్యము
మాస్టారు గారికి, కవి మిత్రులకు నమస్కారములు.గ్రామాంతరము వెళ్ళుట వలన మూడు దినములుగా బ్లాగునకు దూరమైనాను. ఈ రోజే వచ్చినాను.
రిప్లయితొలగించండిఅర్థ రాతిరి నే ఫోను నన్నగార్కి
చేయ జెప్పెను; అర్చన జేయుచుంటి
ఇతర దేశము నుండగ నెన్న మనకు
అర్ధరాత్రి, రవికి నర్ఘ్యము లిడె !
సంప్రదాయపరుఁడు, జపతపాదులయందు
రిప్లయితొలగించండినెపుడు కొఱఁత లేక నెఱపు చుండు
విద్య కొఱకుఁ జనిన వేరుదేశమునేగె
నచట నుదయ కాల మకట, నిచట
నర్ధరాత్రి !రవికి నర్ఘ్యములిడెనట!
౪ వ పాదములో అచట,అకట కు యతి కుదురుతుందనుకుంటున్నాను.
విద్య కొఱకుఁ దాను వేరుదేశమునేగె
రిప్లయితొలగించండిఅని సవరణ.
శాస్త్ర శోధన కయి చని రోదశీ యాన
రిప్లయితొలగించండిమొనర జేయు చున్న ఘనుడు తాను
పరమ చాంధసు డగు బాప డగుట జేసి
నర్ద రాత్రి రవికి నర్ఘ్యము లిడె
--- వెంకట రాజారావు . లక్కాకుల
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిజ్యోత్స్న కాంతి లోని చోద్యమేమోగాని
పగటి వోలె రాత్రి ప్రభలు వెలిగె
అరుణ కాంతి సోకె నాహ్లాదముగ, తొల్గె
నర్ధరాత్రి, రవికి నర్ఘ్య మిచ్చె
సవరణ - చివరి(సమస్య) పాదంలో "అర్ఘ్యమిచ్చె" అని వ్రాసినాను. 'అర్ఘ్యములిడె" అని ఉన్నది.
రిప్లయితొలగించండిహనుమచ్ఛాస్త్రిగారూ మన్నించండి. ఆటవెలదిని తేటగీతి చేశారు.
రిప్లయితొలగించండివెలుగు జ్ఞానానికి, అర్ఘ్యములివ్వడము కర్మకు ప్రతీకలని భావిస్తూ.............
రిప్లయితొలగించండితేజరిల్లె వెలుగు దీపావళీ నాటి
నర్ధరాత్రి, రవికి అర్ఘ్యములిడె
భక్తి తోడ మెలగు బ్రాహ్మణ విద్యార్థి,
జ్ఞాన కర్మయోగ చయము లిదియె.
వెలుగు జ్ఞానానికి, అర్ఘ్యములివ్వడము కర్మకు ప్రతీకలని భావిస్తూ.............
రిప్లయితొలగించండితేజరిల్లె వెలుగు దీపావళీ నాటి
యర్ధరాత్రి, రవికి అర్ఘ్యములిడె
భక్తి తోడ మెలగు బ్రాహ్మణ విద్యార్థి,
జ్ఞాన కర్మయోగ చయము లిదియె.
శ్రీపతి శాస్త్రి గారూ! ధన్యవాదములు . మళ్లీ తొందరపడ్డాను. సరిచేయుచున్నాను. ...
రిప్లయితొలగించండిఅర్థ రాత్రి ఫోను నన్నగారికి నేను
చేయ జెప్పె; "పూజ జేయుచుంటి"
ఆయనున్న దేశ మందుదయము, నిట
అర్ధరాత్రి, రవికి నర్ఘ్యము లిడె !
గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....
రిప్లయితొలగించండికిశోర్ జీ ధన్యవాదములు మీ పద్యాలు బాగుండటమే కాదు ,క్రొత్త మాటలు మా కందఱికీ నేర్పు తున్నారు.
ఆరు నెలలు రాత్రి యారు నెలలు వెల్గు
నలరు దేశముఁ జని యందు నొకఁడు
సంధ్య వేళ లేమి సావధానమ్ముగా
నర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె !
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ వైవిధ్యంగా, బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో ‘సౌరశక్తి’ అనడం సరైనది.
*
వసంత కిశోర్ గారూ,
నిజమే! త్రాగుబోతుకు వేళాపాళా ఎక్కడివి? మంచి పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సంతోషం! మీ లోటు కొట్టొచ్చినట్టు కన్పించింది.
సవరించిన తర్వాత మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మందాకిని గారూ,
మంచి విషయాన్నే ఎన్నుకున్నారు పూరణకు. బాగుంది.
‘అచట,అకట కు యతి’ అసలు సందేహం ఎందుకు వచ్చింది?
మీరు ఆటవెలదిని పంచపాదిగా వ్రాసారు. అలా వ్రాయకూడదు కదా! ఆ అవకాశం తేటగీతి, వృత్తాలలో మాత్రమే.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చేసి + అర్ధరాత్రి’ .. ఇక్కడ యడాగమం రావాలి కదా!
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘దీపావళీ నాటి’ అన్నచో ‘దీపావళిన్ నాటి’ అంటే బాగుంటుంది.
గురువుగారు, సవరించిన పద్యం.
రిప్లయితొలగించండిసంప్రదాయమెపుడు సాగించుటయె పాటి
దేశమేది యైన, దెలియుమన్న!
నాదు సుతునిఁ శ్రద్ధ నచ్చెను, మనకిది
యర్ధరాత్రి, రవికి నర్ఘ్యములిడె.
ఒక తమ్ముడు తన అన్నతో చెపుతున్నాడు. మనకు అర్ధరాత్రి అయిన ఈ సమయంలో నా కొడుకు అర్ఘ్యం వదిలాడు అని.
కలవరింతలోనె గడచినదనిఁ గని
యర్ధరాత్రి, రవికి నర్ఘ్యములిడె.
వధువునుఁ దలచేటి వరరత్నమీతడు
బేగ పరుగు దీసె బెండ్లి కొఱకు.
ఏవగింపు కలుగ దేవతల విభుండు
రిప్లయితొలగించండిపన్నె నొక్క కుటిల పన్నుగడను!
కోడి కూసె, మౌని గోదావరికి జని
అర్ధరాత్రి రవికి నర్ఘ్యము లిడె.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! లేటుగా వచ్చినా లేటెస్టు గా వచ్చారు.మేము మరచిన అర్థరాత్రి విషయాన్ని మీరు పట్టుకొచ్చారు. బాగుంది.
మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
రిప్లయితొలగించండిమూర్తీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు !
మిస్సన్న మహాశయా ! భేష్ !
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిసవరించినందుకు సంతోషం. బాగుంది. అభినందనలు.
రెండవపద్యం బాగుంది.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఅహల్యా వృత్తాంతంతో మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రి గారూ, వసంత మహోదయా ధన్యవాదాలు.