గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు. కాని సమస్య అన్వయమే ఇబ్బంది పెడుతున్నది. * మందాకిని గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. రెండవపూరణలో ‘వధువుఁ గోపపు/గురియై’ అన్నచోట ‘వధువుఁ నలుకకు/గురియై’ అంటే బాగుంటుంది కదా! * శ్రీపతి శాస్త్రి గారూ, ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * ఊకదంపుడు గారూ, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. శకుని కౌరవవినాశనాన్ని కోరాడనే కథ ప్రచారంలో ఉంది. అదెంతవరకు సత్యమో? * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు. కాని సమస్య అన్వయిస్తున్నదా అని చిన్న సందేహం! * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు. * డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ, చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు. ‘ధర్మజు’ అన్నచో ప్రత్యయలోపం. అర్థం చెడకుండా సవరణ చేయడం కుదరడం లేదు.
సరి ధర్మ రాజు చిత్తుగ
రిప్లయితొలగించండిదురితద్యూతమున నోడె; దుర్యోధనుఁడే
మరిమరి మామయె తోడుగ
పరిపరి విధముల బిగించి పందెము లొడ్దన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిశాస్త్రీజీ ! బావుంది !
01)
___________________________________
మురహరి దన్నుగ నుండగ
స్థిరముగ రాజ్యమును బొంద - జేసిరి వధనే
చరమము గాంచిన యంతట
దురితద్యూతమున నోడె - దుర్యోధనుఁడే!
___________________________________
దురితపు చతురతఁ నేరక
రిప్లయితొలగించండిపరమాత్మునిఁ నమ్మువాఁడు ఫలమున్ పొందెన్.
సరియగు దుర్గతి పాలై
దురితద్యూతమున నోడె దుర్యోధనుఁడే!
ధర్మరాజు ఓడి గెలిస్తే, దుర్యోధనుడు గెలిచి ఓడాడు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిమురిసెను తను గెలిచితినని
దురిత ద్యూతమున, నోడె దుర్యోధనుడే
అరివీరుండా భీముడు
సరి వారల గూల్చ దాను సమరము నందున్
పాండవులు :
రిప్లయితొలగించండి02)
___________________________________
శరణంటిరి శ్రీకృష్ణుని !
కరుణామయు దయ గలిగెను ! - కదనము నందున్
మరణించగ కౌరవులును
దురితద్యూతమున నోడె - దుర్యోధనుఁడే!
___________________________________
పరివారమునందొకడిగఁ
రిప్లయితొలగించండిగురువరునాంతరికునిగనుకోరినడచుచున్
వరుసకుమామయగుశకుని
దురితద్యూతమున నోడె - దుర్యోధనుఁడే!
అరివీరభయంకరులను,
రిప్లయితొలగించండిపరిమార్చ కుతంత్రములను పన్నిన వాడై,
మరి రణము జచ్చె హతవిధి,
దురితద్యూతమున నోడె దుర్యోధనుడే.
కురుసభ సాక్షిగ ద్రౌపది
రిప్లయితొలగించండికురులీడ్చివలువలొలుచుట ఘోరము గాదే,
ధరనేలగ తాబన్నిన
దురిత ద్యూతమున, నోడెదుర్యోధనుడే !!!
వరపుత్త్రుఁడు సతి,ననుజులఁ
రిప్లయితొలగించండిదురితద్యూతమున నోడె; దుర్యోధనుఁడే
కురు వంశ వధువుఁ గోపపు
గురియై చచ్చెను రణమునఁ ఘోరపు భంగిన్.
కురు రాజ్యపు బరిలో భా-
రిప్లయితొలగించండిస్కర సూనుడు, శకుని యనెడు ఘన పాచికలన్
చరచర జరిపెన్, చివరకు
దురితద్యూతమున నోడె దుర్యోధనుఁడే!
డా. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....
రిప్లయితొలగించండితరుణము గాకను ధర్మజు
దురిత ద్యుతమున్ నోడె; దుర్యోధనుడే
మరణము దవ్వులఁ గాంచెనొ
పరిభావము జేసె ద్రుపద పాలకు సుతనున్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
కాని సమస్య అన్వయమే ఇబ్బంది పెడుతున్నది.
*
మందాకిని గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రెండవపూరణలో ‘వధువుఁ గోపపు/గురియై’ అన్నచోట ‘వధువుఁ నలుకకు/గురియై’ అంటే బాగుంటుంది కదా!
*
శ్రీపతి శాస్త్రి గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
శకుని కౌరవవినాశనాన్ని కోరాడనే కథ ప్రచారంలో ఉంది. అదెంతవరకు సత్యమో?
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
కాని సమస్య అన్వయిస్తున్నదా అని చిన్న సందేహం!
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
*
డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
‘ధర్మజు’ అన్నచో ప్రత్యయలోపం. అర్థం చెడకుండా సవరణ చేయడం కుదరడం లేదు.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిజీవితమనే పాచిక లాటలో చివరకు
పాండవుల చేత హతుడైన దుర్యోధనుడే ఓడి పోయాడని నా భావం !
పరిపరి కాదని చివరకు
రిప్లయితొలగించండిపరిపాలన గోరి విరిచి భంగమ్మాయె
న్నరయగ నాకథ యెటులన
దురితద్యూతమున నోడె దుర్యోధనుఁడే!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Priyanka calls Modi "Duryodhan":
రిప్లయితొలగించండికరచుచు మమ్మిని డాడిని
వరపుత్రుండౌ బ్రదరును భండనమందున్
కురియగ నా దూషణములు
దురితద్యూతమున నోడె దుర్యోధనుఁడే!