16, జులై 2011, శనివారం

చమత్కార పద్యాలు - 105 A (ప్రహేళిక సమాధానం)

సీ.
అసమానకోదండుఁ డైన రా జెవ్వఁడు? (శ్రీరామ)
రాజుపేరిటఁ గల రాగ మేది? (మారువ)
రాగంబు సరివచ్చు రాజిత ఋతువేది? (వసంత)
ఋతువు పేరిటఁ గల రుద్రుఁ డెవఁడు? (తపసి)
రుద్రుని పేరిట రూఢియౌ పక్షేది? (సీతవ?)
పక్షి పేరిటఁ గల వృక్ష మేది? (వటము)
వృక్షంబు సరివచ్చు వెలయు భూషణ మేది? (ముక్కెర)
భూషకు సరివచ్చు భూమి యేది? (రంగము)
తే. గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
సమాధానాలు -
శ్రీరామ - మారువ - వసంత - తపసి - సీతవ - వటము - ముక్కెర - రంగము.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు.
వారికి అభినందనలు.

11 కామెంట్‌లు:

 1. గురువు గారూ నా సమాధానాలు ఏవిధంగా సరిపోలేదో వివరించగలరు.

  లంకారి = శ్రీరాముడు
  రత్నాంగి = ఒక రాగము పేరు
  గ్రీష్మము = ఒక ఋతువు
  ముక్కంటి = రుద్రుడు
  టిట్టిభం = ఒక పక్షి
  భూజము/మహీజం = వృక్షము
  మురుగు = ఒక ఆభరణము
  గహ్వరి = భూమి

  రిప్లయితొలగించండి
 2. శంకరార్యా ! సమాధానాలు తెలిసాక కూడా యీ ప్రహేళిక
  యింకా ప్రహేళిక లానే యున్నది !

  1వ ప్రశ్న దాని జవాబు తప్ప మిగిలిన ప్రశ్నలకూ జవాబులకూ
  అన్వయం అంతుబట్టడం లేదు !
  వీలయిన కొంచెం వివరంగా వివరించ గలరు !

  రిప్లయితొలగించండి
 3. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  సహృదయంతో పరిశీలిస్తే మీ సమాధానాలే కచ్చితంగా సరిపోతున్నాయి.
  నేను ఊరికి వెళ్ళే తొందరలో ‘చాటుపద్య రత్నాకరం’లో ఇచ్చిన సమాధానలతో పోల్చి మీ సమాధానాలు తప్పు అన్నాను.
  ప్రయాణంలో ఉన్నా నా ఆలోచనలు ఈ ప్రహేళిక చుట్టే తిరిగాయి. ఇంటికి రావడంతోనే వివిధ నిఘంటువులను పరిశీలించాను.
  దీపాల వారు ఇచ్చిన సమాధానాల పట్ల నాకూ అనుమానాలే. అందుకే ‘సీతవ?’ అన్నచోటి ప్రశ్నార్థక చిహ్నాన్ని ఉంచాను.
  నిశితంగా పరిశీలించినప్పుడు మీ సమాధానాలే చాలావరకు సరియైనవి అని తెలుస్తున్నది.
  నా తొందరపాటుకు, తప్పుకు క్షంతవ్యుణ్ణి.
  అన్నట్టు ... ‘రత్నాంగి’ అనే రాగం ఉందా? ‘మారువ’ ఉంది.

  రిప్లయితొలగించండి
 4. కోడీహళ్ళి మురళీ మోహన్ గారి వ్యాఖ్య ....
  గురువుగారూ! తొందరపాటు, తప్పు, క్షంతవ్యుణ్ణి వంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులెండి. ఒక పదానికి మరొక పదానికి ఏమైనా సంబంధం ఉందేమో తెలుసుకోవాలని మిమ్మల్ని అడిగాను అంతే. అంటే ఉదాహరణకు రాజుపేరిటఁ గల రాగము మారువ ఎలా అవుతుందో దానికి శ్రీరామ పదంతో వున్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంతో అడిగాను. మీ సహృదయతకు అనేకానేక ధన్యవాదములు. రత్నాంగి అనే పేరుతో ఒక రాగం ఉన్నట్టు వికీపీడియా నుండి తెలుసుకున్నాను.
  http://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%AE%E0%B1%81

  రిప్లయితొలగించండి
 5. మురళీ మోహన్ గారూ,
  మిగతా వారి వ్యాఖ్యలు ఇటు బ్లాగుకు, నా మెయిల్ సరిగానే వస్తున్నాయి. మీ విషయంలో ఎందుకిలా జరిగిందో? మీ వ్యాఖ్య వెంటవెంటనే నా మెయిల్ కు మూడుసార్లు వచ్చించి మరి!
  పై ప్రహేళికలో ముందు పదానికి, తర్వాతి పదానికి సంబంధం అంత్యాద్యక్షరాలతోనే. ముందు పదం చివరి అక్షరంతో తరువాతి పదం ప్రారంబమౌతుంది.

  రిప్లయితొలగించండి
 6. గురువుగారూ! మురళీ మోహన్గారూ! ఆకాశవాణి భక్తిరంజని లోనూ, శ్రీ వేంక- టేశ్వర టీవీ భక్తి చానల్ లోనూ వినిపించే శ్రీ వేంకటేశ్వర గద్యం లో "రత్నాంగి "
  రాగ ప్రస్తావన విన వస్తుంది.

  రిప్లయితొలగించండి
 7. అయ్యా గురువుగారూ జన్మదిన శుభా కాంక్షలు.

  రిప్లయితొలగించండి
 8. రాగంంబు సరివచ్చు రాజిత ఋతువు..వసంంతమే!!
  ఎంందుకంంటే..అది రాగంం పేరైైయుంండాలి,రాజితమైైయుంండాలి!!

  రిప్లయితొలగించండి
 9. రాగంంబు సరివచ్చు రాజిత ఋతువు..వసంంతమే!!
  ఎంందుకంంటే..అది రాగంం పేరైైయుంండాలి,రాజితమైైయుంండాలి!!

  రిప్లయితొలగించండి