25, జులై 2011, సోమవారం

సమస్యా పూరణం -405 (చదువులలో సార మెఱిఁగి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.

23 కామెంట్‌లు:

  1. చదువన పఠనమె కాదది
    పదపడి జగతిని చదువక పతనమె జరుగున్
    పదములు బయటనె పెట్టక
    చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    లోకపు పోకడ తెలియనివాడు ఎంత పుస్తక పరిజ్ఞానమున్నా చవటయే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని గురించి చణ్డామార్కులతో ..

    పెదవులు కదిపిన 'హరి' యను
    చదువది చెప్పిన విధమిద చండా మార్కా?
    వెదకిన దొరకని' శ్రీహరి
    చదువులలో' సార మెఱిఁగి చవటగ మాఱెన్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘చదువులలో సార మెల్లఁ జదివితి తండ్రీ’ ఎందుకో ఉదయాన్నే పోతనగారి పద్యం నా మనస్సులో మెదిలింది. దానిని దృష్టిలో పెట్టుకొనే ఈనాటి సమస్యను సిద్ధం చేసాను.
    ఆ మర్మం మీరు కనిపెట్టినట్టున్నారు. నా మనస్సును చదివిన వారిలాగా ఉచితమైన పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. చదువరి బుధవరుడయ్యెను
    చదువులలో సారమెఱిఁగి ; చవటగ మాఱెన్
    చదువరి మిత్రుడు, శ్రద్ధగ
    హృదయము నుంచక గురువులఁ హేళనఁ జేసెన్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతిశాస్త్రిసోమవారం, జులై 25, 2011 2:33:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    పదవుల కొరకై చదివిన
    చదువులలో సారమెరిగి చవటగమాఱెన్
    పదిమాసంబులు గడువగ
    పదవీ పోయింది, తుదకు పరువే బోయెన్

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శరణాగతి బొందిన విభీషణుడు రావణుని గూర్చి రామునితో :

    01)
    ___________________________________

    విదురుడు శాస్త్రము లన్నిట
    మదనాంతకు మది గెలిచిన- మద మది పెరిగెన్ !
    బధిరుడు ఉదితము వినడయె !
    చదువులలో సార మెఱిఁగి - చవటగ మాఱెన్ !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  8. చదువుల సారము లుప్తమె
    విదితమ్మెల్లరకుఁ నాదు వేదన. యిదియే
    మదిఁ దోచును ననువరతము
    చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.

    నేటి చదువుల గురించి మదిలో తోచే భావనలు.

    రిప్లయితొలగించండి
  9. పది తల లిరువది చేతులు
    పదిలంబుగ శౌర్య గరిమ భాగ్యములున్నన్
    వెధవలలో వెధవ యగుట
    చదువులలో సార మెరిగి చవటగ మారెన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  10. మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా మొదటి పూరణ విరుపు చక్కగా ఉంది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘పదవీ పోయింది’ అన్న వ్యావహారిక రూపం స్థానంలో ‘పదవియె పోయెను చివరకు’ అంటే ఎలా ఉంటుంది?
    *
    వసంత కిశోర్ గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    ‘బధిరుడు ఉదితము వినడయె’ పాదం మధ్య అచ్చు వేసారు. ‘బధిరుం డుదితము వినడయె’ అందామా?
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. చదువనగవల్లెవేయుటె?
    అది విజ్ఞతనొసగునుతన హృదివైశాల్యము పెంచును
    చదువుల సారంబెరుగక చవటగ మారెన్
    రమణారావు.ముద్దు

    రిప్లయితొలగించండి
  12. నేను కూడా హనుమచ్చాస్త్రి గారి బాటలోనే......
    హిరణ్యకశిపుని స్వగతం:

    చదువుట బాలుని కొప్పును
    చదివెను ప్రహ్లాద సుతుడు చదువులఁ గానీ
    యిది యేమి దనుజ కులమున
    చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.

    రిప్లయితొలగించండి
  13. ఓ తండ్రి వేదన:

    సదమలవేదాధ్యయన
    మది ముదముంజేయకఁజనిమార్గాంతరముల్-
    తుదకున్ గన నప్రాచ్యపు
    చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా ! చక్కని సవరణకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  15. ముద్దు రమణారావు గారూ,
    "శంకరాభరణమా" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.
    మీ రిచ్చిన భావానికి ఈ సాయంత్రం వరకు పద్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. చదువనగవల్లెవేయుటె?
    హృదివైశాల్యము పెరుగగఁ హేతువుఁ దానై
    నది, విజ్ఞతనొసగెడిదగు
    చదువుల- సారంబెరుగక చవటగ మారెన్

    రమణారావు గారి పదములకు పద్యరూపం ఇవ్వాలని ప్రయత్నం.

    రిప్లయితొలగించండి
  17. మందాకిని గారూ,
    ధన్యవాదాలు.
    నాకు శ్రమ తప్పించారు. రమణారావు గారి భావానికి చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు.

    రిప్లయితొలగించండి
  18. "సంప్రాప్తే సన్నిహితే కాలే
    నహి నహి రక్షతి డుకృన్కకరణే"

    పదుగురి ప్రశంస గోరుచు
    ముదుసలి సంస్కృతము చదివె మూర్ఖత్వమునన్
    ముదమున శంకరుడు నుడివె
    "చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్"

    రిప్లయితొలగించండి
  19. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "డుకృఙ్ కరణే"

    రిప్లయితొలగించండి
  20. "విద్య యొసగును వినయంబు"


    చదువుచు నార్ట్సును సైన్సును
    గదమాయించెడి గణితము కంప్యూటరునున్
    వదలుచు వినయమ్ము భడవ
    చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్

    రిప్లయితొలగించండి