కవిమిత్రుల పూరణలు బాగు బాగు. అందరికీ తెలిసినదే - "అడవిగాచిన వెన్నెల" అనగా అడవి గాచిన వెన్నెల వలె నిష్ప్రయోజనమని భావము - దీనినే "అరణ్య చంద్రికా న్యాయము" అని పెద్దలు అంటారని చదివిన గుర్తు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, నవలాపఠనంగా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. ‘రచయిత + ఒకడు = రచయిత యొకడు’ అవుతుంది. ‘వ్రాసినట్టివాఁ డభిమన రచయిత కద’ అంటే ఎలా ఉంటుంది? * మందాకిని గారూ, జనారణ్యంలో చంద్రుణ్ణి ఎక్కడ చూస్తాం? బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘చందురుండను గానగ’ అన్నచోట ‘చంద్రసౌందర్యము గనగ’ అంటే ఎలా ఉంటుందంటారు?
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘వ్యాహ్యాళి’ అనే పదం లేదు. అది ‘వాహ్యాళి’. అలా అంటేనే అక్కడ గణదోషం రాదు. * డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ప్రశ్నోత్తరరూపంగా మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. ‘ఏంజేయ’వ్యావహారిక రూపం. ‘వెన్న నేమిచేసిన వచ్చు వేడి నెయ్యి’ అందామా? ప్రభుత్వపథకాలపై సెటైర్‍గా మీ మూడవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
మందాకిని గారూ, అడవిని, వెన్నెలను, నెమలినాట్యాన్ని మరచి మానవుడు రాయి అయినట్లు చెపిన మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. ఇక మీ మూడవ పూరణలో ప్రకృతి సౌందర్యానికి ప్రాముఖ్యత నిచ్చారు. బాగుంది. అభినందనలు. అవి ‘ఝరులు’ ఝురులు కాదు. ‘ఝరుల నుఱగలఁ దేలుచు ఝంకృతులను’ ఆందాం.
డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ రెండవపూరణ ముగ్ధమనోహరంగా ఉంది. కాని చంద్రశేఖర్ గారు చెప్పిన ‘అరణ్య చంద్రికా న్యాయం’ సరిపోలేదు. * లక్కాకుల వెంకట రాజారావు గారూ, హరజటాజూటాన్ని అడవిని చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గురువుగారూ, మీ సవరణలు బాగున్నాయి. ధన్యవాదములు. మిత్రులందరి పూరణలూ చాలా బాగున్నాయి. లక్కాకుల వారి హరుని వర్ణన చాలా బాగుంది. అన్నిటికన్నా గురువుగారి పద్యం అలరించింది. ఎందుకంటే అందులో మనందరమూ ఉన్నాము. అదీ అందమైన పదబంధములో.మరీ మరీ ధన్యవాదములు గురువుగారూ!
వసంత కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు. రెండవ పూరణలో ‘నిరుపయోగం’ అని వ్యవహార రూపాన్ని వేసారు. ‘నిరుపయోగ / మగును; రాముని జేరుట ....’ అంటే ఎలా ఉంటుంది?
పంచ వర్షంబుల వరకు - పదవు లుండు ప్రభుత ప్రకటించు ప్రజలకు - పథకములవె అడవి గాచిన వెన్నెల !- హాయి నొసగె మంత్రి గణములకును వారి - మాతలులకు ! ___________________________________
మందాకిని గారూ ఝరులు,ఝంకృతులు,భృంగములు,వెన్నెల మనోహరముగా వర్ణించారు. గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది. రాజా రావుగారి కవిత్వము మనోజ్ఞము. మిస్సన్న గారూ వసంత కిశోర్ గారు చాలా చక్కని పూరణలు చేసారు. అరణ్య చంద్రికా న్యాయము గురించి చంద్రశేఖరుల వారిపై వ్యాఖ్య వ్యంగముగా చేసినదే. ఆయన తిరిగి ఎప్పుడో నాకు వడ్డించేస్తారు. మా యిద్దఱికీ అలవాటే యిది.
డా.మూర్తి మిత్రమా, మీరు నారసింహులు. జూలు విదిలిస్తే తప్పుతుందా మరి. విషమైనా దిగమింగుకుంటాడీ గరళకంఠుడు-చంద్రశేఖరుడు. మాష్టారు చెప్పినట్లు అరణ్య చంద్రికా న్యాయం సంగతి మాట అటుంచి, మీ పద్యంలో తార-చంద్రులను పట్టుకొచ్చారుగా. మూర్తి గారి ముద్ర అదేమరి (నవ్వుతూ).
కవిమిత్రుల వైవిధ్యమైన పూరణలు చాలా ఆనందం కలిగించాయి. తెలుగులో మనకి కొన్ని జాతీయాలు వున్నాయి, జాతీయం అనేది ఒక ప్రత్యేక అర్థంలో, ప్రత్యేక సందర్భంలో ప్రయోగింప బడుతుంది. ఇవి చాలా మటుకు మనం నిత్య సంభాషణలో వాడతాము. మీకందరికీ తెలిసిందే. ఇక, "అడవిగాచిన వెన్నెల" లాగానే, "దున్నపోతు మీద వర్షం", "చెవిటివాడి చెవిలో శంఖం వూదటం" అలాంటివే. కొందరు యువకులకు ఈ రోజుల్లో ఈ జాతీయాలు తెలియటం లేదు. భాషలోని సొగసులు పోయి, కట్టే-కొట్టే-తెచ్చే- అనే వాడకం ఎక్కువవుతోంది. ఇంగ్లీషులో కూడా అదే పరిస్థితి అని బ్రిటిషు ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు అమెరికన్ ఇంగ్లీషు గురించి వాపోతూ వుంటారు. మార్పు సహజమే అయినా ఉధృతం ఎక్కువయింది. ఏం చేస్తాం, కుర్రాళ్ళల్లో కుర్రాళ్ళుగా వుండవలసినదే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోరి చదివితి నీనాడు క్రొత్త నవల
రిప్లయితొలగించండి'అడవిఁ గాచిన వెన్నెల' హాయి నొసఁగె!
వ్రాసె నాయొక్క అభిమాన రచయితొకడు
పూర్తి యగు దాక విడలేదు పొత్త మహహ !!
మేడ మీదను కట్టిరి మేడ లెన్నొ,
రిప్లయితొలగించండిచందురుండను గానగఁ సాధ్యమౌన?
దూర దేశము నేగుచుఁ త్రోవ యందు,
నడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణలో చివరి చరణంలో "మహఃహ" కన్నా ఇంకొక పదం ఉంటె బాగుంటుందేమో. "మహిమ" ఎల్లా వుంటుంది? సరిపోతున్దంటారా?
రిప్లయితొలగించండినిరుడు విజ్ఞాన వ్యాహ్యాళి నెపము తోడ,
రిప్లయితొలగించండిపేద విద్యార్థులను జేర్చి భేషజముగ,
అరిగితిమిమేము కొండల చరియ, నాడు
యడవిగాచిన వెన్నెల హాయినొసగె.
కవిమిత్రుల పూరణలు బాగు బాగు. అందరికీ తెలిసినదే - "అడవిగాచిన వెన్నెల" అనగా అడవి గాచిన వెన్నెల వలె నిష్ప్రయోజనమని భావము - దీనినే "అరణ్య చంద్రికా న్యాయము" అని పెద్దలు అంటారని చదివిన గుర్తు.
రిప్లయితొలగించండిపల్లె ప్రాంతము నందుండ వల్లె యనుచు
రిప్లయితొలగించండిఅరుగుదెంచితి, గృహ మొప్పె నడవి మధ్య
పచ్చదనములు కన్నుల కిచ్చ గూర్చ
అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె !
లక్కరాజు గారూ ! మహత్తరంగా ఉంటుంది. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅరయగా నరణ్యమునకు నర్థమేమి?
రిప్లయితొలగించండివెన్న నేంజేయ వచ్చును వేడి నేయి?
నిండు పున్నమి యేమిచ్చె నేడు నీకు?
అడవిఁ ,గాచిన ,వెన్నెల హాయి నొసఁగె!
పరుల సేవలన్ జీవిత భాగమయ్యె
రిప్లయితొలగించండినడవిఁ గాచిన వెన్నెల;; హాయి నొసఁగె
భాగవత పఠనాదిక భక్తి మార్గ
ములవి ఇహ పర సాధన మోక్షదములు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరమ్యమైనవి గాంచక రంగురంగు
రిప్లయితొలగించండిఱాతి మేడలఁ నరుఁడయె ఱాతి వోలె
అడవిఁ, గాచిన వెన్నెల, హాయి నొసగె
డిశిఖి నృత్యము మఱచెను డెందమిపుడు.
గురువుగారూ,
మొదటి పూరణలో మూడో పాదములో నేగుచు కాకుండ దూర దేశము నేగితి అంటే "కాలము" సరిపోతుంది. సవరణ గమనించగలరు.
ప్రభుత పథకమ్ము లన్నియు పట్టి జూడ
రిప్లయితొలగించండినడవిఁ గాచిన వెన్నెల ; హాయి నొసఁగె
పద్మనాభుని యనంత పడగ నీడ
పడగ లెత్తిన నిధి కన పడగ నేడు.
మందాకిని గారూ, ఝరులను మఱచిపోయారా ?
రిప్లయితొలగించండిఆకశమ్మున తారలు నాడుచుండ
పర్వతముల మందాకిని పాఱు చుండ
శుక్లపక్షపు చంద్రుడు శోభ గూర్చ
అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె !
మిత్రవర్యా ! చంద్రశేఖరా " అరణ్య చంద్రికా న్యాయము " యిప్పుడు సరిపోయిందా ?
రంగురంగుల చిత్రమ్ము రమణి గీయ
రిప్లయితొలగించండిచూచి నాడను, మెచ్చితి ; చూడ నాకు
అడవిఁ గాచిన వెన్నెల, హాయి నొసగె
ను సెలయేటి పై మెరయుచు నున్న తళుకు.
ఝురుల నుఱగలఁ దేలుచు , ఝుమ్మనుచును
రిప్లయితొలగించండివిరులఁ దేనెలఁ దూలుచు వీనులలరఁ
విందుఁ జేసెడి భ్రమరము ,పెద్ద యడవి
యందుఁ గాచిన వెన్నెల- హాయి నొసగె.
మూర్తిగారూ, బాగా గుర్తు చేశారు. పూరణకు కాకున్నా ఊరికే రాశాను. :-) చంద్రశేఖర్ గారూ,
అడవిలో గాచినా, నిష్ప్రయోజనమని మనలాంటి భావుకులు వ్రాయలేమండి. అది ప్రాక్టికల్ థింకర్స్ ఉంటారే , వాళ్ళపని .
ఆహా! శంకరాభరణం బ్లాగు అనే అడవిలో పద్యాల శరచ్చంద్రికలు వెల్లివిరుస్తూ హాయి గొలుపుతున్నాయి. కవిమిత్రు లందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమిత్ర కవివరేణ్యరచిత చిత్రపద్య
పంక్తి దీపించ ‘శంకరాభరణ’ మనెడి
యడవిఁ గాచిన వెన్నెల హాయిగొలిపె
ధన్యవాదమ్ము లివె మీకు మాన్యులార!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండినవలాపఠనంగా మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
‘రచయిత + ఒకడు = రచయిత యొకడు’ అవుతుంది.
‘వ్రాసినట్టివాఁ డభిమన రచయిత కద’ అంటే ఎలా ఉంటుంది?
*
మందాకిని గారూ,
జనారణ్యంలో చంద్రుణ్ణి ఎక్కడ చూస్తాం? బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘చందురుండను గానగ’ అన్నచోట ‘చంద్రసౌందర్యము గనగ’ అంటే ఎలా ఉంటుందంటారు?
పైన శశిరేఖ నడుమ నింపైన గంగ
రిప్లయితొలగించండిహరు జటాజూట మరుదైన యడవి గాగ
మేని సగ పాలు పట్టపు రాణి కమరి
యడవి గాచిన వెన్నెల హాయి నొసగె
--- రాజారావు
--- బ్లాగు :సుజన సృజన
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘వ్యాహ్యాళి’ అనే పదం లేదు. అది ‘వాహ్యాళి’. అలా అంటేనే అక్కడ గణదోషం రాదు.
*
డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ప్రశ్నోత్తరరూపంగా మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉంది.
‘ఏంజేయ’వ్యావహారిక రూపం. ‘వెన్న నేమిచేసిన వచ్చు వేడి నెయ్యి’ అందామా?
ప్రభుత్వపథకాలపై సెటైర్‍గా మీ మూడవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
మందాకిని గారూ,
అడవిని, వెన్నెలను, నెమలినాట్యాన్ని మరచి మానవుడు రాయి అయినట్లు చెపిన మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది.
ఇక మీ మూడవ పూరణలో ప్రకృతి సౌందర్యానికి ప్రాముఖ్యత నిచ్చారు. బాగుంది. అభినందనలు.
అవి ‘ఝరులు’ ఝురులు కాదు. ‘ఝరుల నుఱగలఁ దేలుచు ఝంకృతులను’ ఆందాం.
డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవపూరణ ముగ్ధమనోహరంగా ఉంది.
కాని చంద్రశేఖర్ గారు చెప్పిన ‘అరణ్య చంద్రికా న్యాయం’ సరిపోలేదు.
*
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
హరజటాజూటాన్ని అడవిని చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండితే: క్రొత్త దంపతులాషాడ గోరికలకు
నల్లమల విహారముబోవ, వల్లకాని
త్రోవ యందున జిక్కగా , తొలిత వార్కి
యడవిఁ గాచిన వెన్నెల, హాయి నొసగె!
గురువుగారూ, మీ సవరణలు బాగున్నాయి. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిత్రులందరి పూరణలూ చాలా బాగున్నాయి. లక్కాకుల వారి హరుని వర్ణన చాలా బాగుంది.
అన్నిటికన్నా గురువుగారి పద్యం అలరించింది. ఎందుకంటే అందులో మనందరమూ ఉన్నాము. అదీ అందమైన పదబంధములో.మరీ మరీ ధన్యవాదములు గురువుగారూ!
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅడవి గాచిన వెన్నెల హాయి నొసగె
వేళ, ఆక్రమించిరి కద విపినములను
అక్రమార్జన జేసెడి యాశపరుల
ఆక్రమణలకు జగతిలో నడ్డు లేదు
"చేను వద్ద కాపల యుండు" మనిన నేను
రిప్లయితొలగించండిమంచె నెక్కితి నొడిసెల నుంచి చేత ;
నిష్ప్రయోజన మందురు నిజము గాదు !
"అడవి గాచిన వెన్నెల" హాయి నొసగె !
అసలు కొందరి జీవితా లగును వట్టి
అడవి గాచిన వెన్నెల ! హాయి నొసగె
బ్రతుకు మరికొందరికి( నేల సంతరించు !?
కర్మఫలమె గాక నితర కతన మెద్ది !?
శంకరార్యా ! మా చిత్రపద్య ప్రమిద పంక్తులను ఓపికగా ప్రోత్సాహమనే నూనె పోసి వెలుగొంద జేయు చున్నందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి.
నిండు పున్నమి! వెన్నెల పండె రేయి!
రిప్లయితొలగించండియమున తటి నొంటినై యుంటి యదు కులేశ!
రాధ విరహము తీర్చగా రాద? నీకు
అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె?
సుందరాంగి! నీకు నరుడు శోభ నీడు
రిప్లయితొలగించండిరావణుని వరియించిన రాణి వౌదు
వేల నీ యందమును చేయ నిట్లు చూడ
అడవిఁ గాచిన వెన్నెల? హాయి నొసఁగె?
సింహ బలుడన్న శృంగార సింహ బలుడె!
రిప్లయితొలగించండిరమ్ము పాంచాలి! చేయగ రాదు వన్నె
లడవిఁ గాచిన వెన్నెల! హాయి నొసగె
నీదు యందము నారాణి నీవె సుమ్ము.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
‘ఆషాఢ కోరికలను’ వైరిసమాసం అవుతున్నది కదా. ఆషాఢమే ఎందుకు? ‘క్రొత్త దంపతు లలరుచు కోరి కోరి’ అందాం.
శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
‘హాయి నొసగె వేళ ..’ మీ ఉద్దేశంలో అది ఒసగెడి వేళ.
‘హాయి నొసగె / నెపుడొ’ అందాం.
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీ మూడు పూరణలూ ముచ్చటగా శోభాయమానంగా ఉన్నాయి. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కీచకుడు సైరంధ్రితో :
01)
___________________________________
అంబు జాక్షిరొ ! నీవంటి - యతివ లేదు !
ఏల దయమాలి జేసెద - వీవు , సొగసు
అడవి గాచిన వెన్నెల ?- హాయి నొసగె
నీదు రూపము , గనినంత - నాదు మదికి !
___________________________________
రావణుడు సీతతో :
రిప్లయితొలగించండి02)
___________________________________
నీవు జేసెడి ప్రార్థన - నిరుప యోగం
నిన్ను రాముడు జేరుట - యన్నుమిన్న
ఇల నసాధ్యము ! తీరదు - కలలొ నైన !
నన్ను జేరుము ! సుఖపడు - నళిన నేత్రి !
చేయకుము నీదు వయసును - చెలువములను
అడవి గాచిన వెన్నెల ! - హాయి నొసగె
నిర్మలంబైన నీరూపు - నీల వేణి !
___________________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
రెండవ పూరణలో ‘నిరుపయోగం’ అని వ్యవహార రూపాన్ని వేసారు. ‘నిరుపయోగ / మగును; రాముని జేరుట ....’ అంటే ఎలా ఉంటుంది?
03)
రిప్లయితొలగించండి___________________________________
పంచ వర్షంబుల వరకు - పదవు లుండు
ప్రభుత ప్రకటించు ప్రజలకు - పథకములవె
అడవి గాచిన వెన్నెల !- హాయి నొసగె
మంత్రి గణములకును వారి - మాతలులకు !
___________________________________
మాతలులు = సారధులు =యంత్రాంగము
శంకరార్యా ! చక్కని సవరణ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమందాకిని గారూ ఝరులు,ఝంకృతులు,భృంగములు,వెన్నెల మనోహరముగా వర్ణించారు. గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది. రాజా రావుగారి కవిత్వము మనోజ్ఞము. మిస్సన్న గారూ వసంత కిశోర్ గారు చాలా చక్కని పూరణలు చేసారు.
రిప్లయితొలగించండిఅరణ్య చంద్రికా న్యాయము గురించి చంద్రశేఖరుల వారిపై వ్యాఖ్య వ్యంగముగా చేసినదే. ఆయన తిరిగి ఎప్పుడో నాకు వడ్డించేస్తారు. మా యిద్దఱికీ అలవాటే యిది.
మూర్తీజీ ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిగురువుగారు, మిత్రులు మన్నించాలి.
రిప్లయితొలగించండిశంకలను దీర్చి, మిత్రుల చక్క దిద్ది,
కైతలను వ్రాయు నేర్పును కట్ట బెట్ట
భావ్యమే యన శంకరా భరణ మడవి
కాస్త యోచించ వేడెద కరుణ నార్య!
డా.మూర్తి మిత్రమా, మీరు నారసింహులు. జూలు విదిలిస్తే తప్పుతుందా మరి. విషమైనా దిగమింగుకుంటాడీ గరళకంఠుడు-చంద్రశేఖరుడు. మాష్టారు చెప్పినట్లు అరణ్య చంద్రికా న్యాయం సంగతి మాట అటుంచి, మీ పద్యంలో తార-చంద్రులను పట్టుకొచ్చారుగా. మూర్తి గారి ముద్ర అదేమరి (నవ్వుతూ).
రిప్లయితొలగించండికవిమిత్రుల వైవిధ్యమైన పూరణలు చాలా ఆనందం కలిగించాయి. తెలుగులో మనకి కొన్ని జాతీయాలు వున్నాయి, జాతీయం అనేది ఒక ప్రత్యేక అర్థంలో, ప్రత్యేక సందర్భంలో ప్రయోగింప బడుతుంది. ఇవి చాలా మటుకు మనం నిత్య సంభాషణలో వాడతాము. మీకందరికీ తెలిసిందే. ఇక, "అడవిగాచిన వెన్నెల" లాగానే, "దున్నపోతు మీద వర్షం", "చెవిటివాడి చెవిలో శంఖం వూదటం" అలాంటివే. కొందరు యువకులకు ఈ రోజుల్లో ఈ జాతీయాలు తెలియటం లేదు. భాషలోని సొగసులు పోయి, కట్టే-కొట్టే-తెచ్చే- అనే వాడకం ఎక్కువవుతోంది.
రిప్లయితొలగించండిఇంగ్లీషులో కూడా అదే పరిస్థితి అని బ్రిటిషు ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు అమెరికన్ ఇంగ్లీషు గురించి వాపోతూ వుంటారు. మార్పు సహజమే అయినా ఉధృతం ఎక్కువయింది. ఏం చేస్తాం, కుర్రాళ్ళల్లో కుర్రాళ్ళుగా వుండవలసినదే.
ఆకులో ఆకునై - అని పాడుకునే ముందు కధానాయిక
రిప్లయితొలగించండితనకు నేకాంతము, పరకాంతయును దప్ప
పనికి రాను నేను, యగుట భావకవియె
విన్నపములు జేసినిటకు వెంటరావ
అడవి గాచిన వెన్నెల - హాయి నొసగె