27, జులై 2011, బుధవారం

సమస్యా పూరణం -407 (రాళ్ళు గలిగినవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. రూక లేనట్టి వానిని రోసి జగము
    పైకమున్నట్టి వాని తలపైన బెట్టు
    కొనును,మంచి నెంచక ముంచి నేడు నాల్గు
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం.‘పైకమున్నవానిని తలపైన బెట్టు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  3. కలుగు వారల, యధికార గర్వ మతుల,
    లంచ గొండుల యవినీతి రచ్చ జేసి
    నలుగు బెట్టంగ నొంటికి, నమ్ము, పలుగు
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

    రిప్లయితొలగించండి
  4. భక్తులను గాంచి రక్షింప ప్రతిభ చూపు
    ముగ్గురమ్మలఁ గొలిచెడి పుణ్యుల కిల
    అమ్మలామువ్వురే రక్ష. యట్టి ముద్ద
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

    రిప్లయితొలగించండి
  5. చంద్రు డన నాడు మామయ్య, చక్కనయ్య
    సిరికి తమ్ముడు, చూడగా చెలియ వినుము
    బూది కుప్పలు గుంటలు బోల్డు బండ
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

    రిప్లయితొలగించండి
  6. చాప ఉన్నంత కాళ్ళనుఁ జాచి కొనుము.
    ధనము వ్యర్థముఁ జేయక దాచు కొనుము.
    అప్పు లకుఁబోకు.తగురీతిఁ దనకు నాల్గు
    రాళ్ళు గలిగిన వాడె పో రాజు నేడు.

    రిప్లయితొలగించండి
  7. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, జులై 27, 2011 11:05:00 AM

    నేలమాళిగలందు మున్నీటి చెంత,
    దివ్యమగుధనరాసులు, సవ్యమైన
    రత్న ఖచితపు హారముల్,మెరయు నల్ల
    రాళ్ళు గలిగిన వాడెపో రాజు నేడు.

    యే కాలనికైన శ్రీమహావిష్ణువే కదా రాజు.

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, జులై 27, 2011 11:14:00 AM

    గురువుగారూ.
    మూడవ పాదములో యతి సరిపోలేదు. సవరించ వలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...

    చదువు సంధ్యల సారమ్ము సౌఖ్యమనగ
    మేడ మిద్దెలు గట్టిన దోడ గచ్చు
    దర్పణంబును బోలగ నందు జలువ
    రాళ్ళు గలిగిన వాడెపో రాజు నేడు !

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    అంతరిక్షాన మెరసెడి - అద్భుతములు !
    అరయ నానంద మిచ్చెడి - అతివ లౌర !
    చుక్కలనియెడు చక్కని - చుక్కల ,జవ
    రాళ్ళు గలిగిన వాడెపో రాజు నేడు !
    __________________________________
    రాజు = చంద్రుడు

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, జులై 27, 2011 1:04:00 PM

    చిన్న సవరణతో ( యతి సవరణ )

    నేలమాళిగలందు మున్నీటి చెంత,
    దివ్యమగుధనరాసులు, సవ్యమైన
    రత్న కేయూర మణిమయ రాజితమగు
    రాళ్ళు గలిగిన వాడెపో రాజు నేడు. (శ్రీ అనంతపద్మనాభ స్వామి )

    ఏ కాలనికైన శ్రీమహావిష్ణువే కదా రాజు.

    రిప్లయితొలగించండి
  12. 02)
    __________________________________

    చిన్ని కృష్ణుని బోలెడి - చిట్టి పొట్టి
    చిన్న పిల్లలు యింటికి - చెలువ మలర
    తాత తాతా యటంచును - తనివి దీర
    నోటి పలుకుల పిలుచు, మ - నుమలు, మనుమ
    రాళ్ళు గలిగిన వాడెపో - రాజు నేడు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణా రావు గారూ,
    మీ ‘ముద్దరాళ్ల’ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండవ పూరణలో ‘రాజు’ శబ్దాన్ని శ్లేషించిన తీరు బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    ‘బోల్డు’ ... బోలెడు bold అయిందే?

    రిప్లయితొలగించండి
  14. మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    రత్నసన్నిభమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఇంట చలువరాళ్ళు కలిగి ఉండడం ‘రాజు’లకే సాధ్యమంటూ సుందరమైన పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    అభినందనలు.
    మీరూ మొదటిపూరణలో ‘రాజు’ శబ్దాన్ని శ్లేషించి మంచి పూరణ వ్రాసారు.
    ఇక రెండవ పూరణ అద్భుతంగా ఉంది. నాకు ఇప్పటికి ఒక్కడే మనుమడు. ఇంకా మనుమ‘రాళ్ళు’ రాలేదు.
    అయితే కిడ్నీలో ‘రాళ్ళు’ గలిగిన రాజును నేను.

    రిప్లయితొలగించండి
  16. మాస్టరు గారూ ! క్రొత్త బంగారు (సువర్ణ) లోకంలో అడుగు పెట్టినట్లుగా వున్నది.టెంప్లేట్ డిజైన్ చాలా బాగుంది.

    నా మొదటి పూరణ లో యతి దోషాన్ని సరిచేస్తూ ..

    రూక లేనట్టి వానిని రోసి జగము
    పైకమున్న వానిని తలపైన బెట్టు
    కొనును,కని యెవరేమను కొన్న నాల్గు
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

    రిప్లయితొలగించండి
  17. నా రెండవ పూరణ లో చిన్న సవరణ ...

    చంద్రు డన నాడు మామయ్య, చక్కనయ్య
    సిరికి తమ్ముడు, చూడగా చెలియ వినుము
    బూది కుప్పలు గుంటలు బోలెడన్ని
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ పూరణలో మూడవ పాదంలో "కని" బదులు "కలి" అంటే ఇంకా బాగుంటుందేమో. కలి కాలం అనే అర్ధమోస్తుంది కదా.

    రూక లేనట్టి వానిని రోసి జగము
    పైకమున్న వానిని తలపైన బెట్టు
    కొనును,కని యెవరేమను కొన్న నాల్గు
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు."

    రిప్లయితొలగించండి
  19. శ్రీపతిశాస్త్రిబుధవారం, జులై 27, 2011 8:01:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    గనుల సంపద దోచెడు ఘనులు గలరు
    నదుల యిసుకయు తరలెను నగరములకు
    శిలల వ్యాపారమే నేడు సిరుల గూర్చ
    రాళ్ళు గలిగిన వాడె పో రాజు నేడు

    రిప్లయితొలగించండి
  20. కిశోర మహోదయు లన్నట్లుగా అందరి పూరణలూ అలరిస్తూన్నాయి.

    సరదాగా మరో రెండు పూరణలు:

    ఇండ్లు కట్టించుకొనుచుండి రెల్లవారు
    మోజు తీరెడు రీతి నీ రోజు చూడ!
    జనుల కమ్మగ గ్రానైటు, చలువ, కడప
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు!

    ********************************************

    అంద మొలికెడు గ్రానైటు హాలు లోన,
    పడక టింటిని చల్లని పాల రాళ్ళు,
    వంట గదిలోన నల్లని వన్నె కడప
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు!

    రిప్లయితొలగించండి
  21. కిశోర్ జీ మీ మనుమలు మనుమరాళ్ళు ఈ దినము బ్లాగుకి శోభ తెచ్చారు

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ మీ గృహము శోభాయ మానముగా ఉంది.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !
    నాకు కూడా ఒక్కడే మనుమడు !
    కనీసం మీకున్న రాళ్ళు కూడా నాకు లేవు !

    మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !

    మూర్తీజీ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  24. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    *
    లక్కరాజు శివరామకృష్ణారావు గారూ,
    ధన్యవాదాలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    నాకు తాండూరు రాళ్ళే తెలుసు. ఈ ‘కడపరాళ్ళు’ నాకు క్రొత్తే!

    రిప్లయితొలగించండి
  25. సంపత్ కుమార్ శాస్త్రి గారు,శ్రీపతి శాస్త్రిగారలు కమనీయమైన పద్యాలు వ్రాస్తున్నారు. వారిరువురికి ప్రత్యేకాభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 28, 2011 6:50:00 AM

    నరసింహ మూర్తిగారు ధన్యవాదములు. మిత్రుల అందరి పూరణలు కమనీయంగా ఉంటున్నాయి.ఈ బ్లాగు ద్వారా మనలో ఎంతోమంది సాహిత్యాభిమానులకు ఒక వేదిక లభించినందులకు శ్రీ శంకరయ్యగారికి సర్వదా కృతజ్ఞ్తలు తెలియజేస్తున్నాను. నమస్సులు.

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా ! ధన్యవాదములు.
    లక్కరాజు గారూ ! ధన్యవాదములు. మీ సూచన బాగుంది. సవరిస్తునాను.

    రూక లేనట్టి వానిని రోసి జగము
    పైకమున్న వానిని తలపైన బెట్టు
    కొనును,కలిలోన నేమనుకొన్న "నాల్గు
    రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు."

    రిప్లయితొలగించండి
  28. గురువుగారూ ధన్యవాదాలు.
    వంటింటిలో వంట గట్టుకు వాడే నల్లని రాయిని మావైపు కడప రాయి అంటారు.
    ఇప్పుడు చాలామంది గ్రానైటు వాడుతున్నారు.

    రిప్లయితొలగించండి
  29. మూర్తి మిత్రమా ధన్యవాదాలు.
    మీరన్నట్లు కవి త్రయంలా మన బ్లాగులో శాస్త్రి త్రయం తమ పద్యాలతో
    మిత్రులన్దర్నీ అలరిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  30. కదండీ మిస్సన్న గారూ ! అందులోకి హనుమచ్ఛాస్త్రి గారైతే విద్యుచ్ఛక్తి లాగ గురువు గారు సమస్య నిచ్చి స్విచ్చు వేయ గానే ఠక్కున పద్యముతో లైటు వెలిగిస్తారు !

    రిప్లయితొలగించండి
  31. మిస్సన్న గారూ ! మూర్తి గారూ ! మీ అభిమానానికి ధన్యవాదములు.
    మీ పొగడ్తలకు కొంచెం లావయ్యనండీ.ఇంక చాలండీ . లేకపోతె చొక్కా బిగుతై పోతుంది.(నవ్వుతూ)

    రిప్లయితొలగించండి
  32. మిత్రులు
    నరసింహ మూర్తి, మిస్సన్న మహాశయుల అభిప్రాయాలు
    నూటికి నూరుపాళ్ళూ సత్యం !

    శాస్త్రీజీ ! పొగడ్తల వెల్లువను తట్టుకోవాలంటే
    మీరు కొత్త చొక్కాలు కుట్టించుకోవడం ఉత్తమం !

    రిప్లయితొలగించండి
  33. వసంత మహోదయా మాతో ఏకీ భవించి నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. వసంత కిషోర్ గారికి, కవి మిత్రు లందరకు వినమ్ర పూర్వక నమస్కారములు.

    రిప్లయితొలగించండి