మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 38
దత్తపది - ఇఱుకరాదు, కొఱుకరాదు, నఱుకరాదు, పెఱుకరాదు.
గీ.ఇఱుకరాదు చేత నిసుమంత నిప్పైనఁ
గొఱుకరాదు ఱాయి కొంచెమైన
నఱుకరాదు నీరు నడిమికి రెండుగాఁ
బెఱుకరాదు బావి పెల్లగిలఁగ.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఉదయం సరిగ్గా పోస్టు పెట్టే సమయంలో కరెంటు పోయి ఇప్పుడు వచ్చింది. ఆలస్యానికి మన్నించండి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండి01)
______________________________
ఇఱుకరాదు పీక - నితరుల దేనాడు !
కొఱుకరాదు కూర్మి - కొరివి నెపుడు !
నఱుకరాదు తలను - నరుల దెవ్వరిదైన
బెరుకరాదు పిలక - పిన్న దైన !
______________________________
నిజముఁ బిడికిట నెందును నిఱుక-రాదు.
రిప్లయితొలగించండికొయ్య ఫలముల నెపుడునుఁ గొఱుక-రాదు.
నఱుక బోయిన గగనముఁ నఱుక - రాదు.
పిచ్చి మొక్కలఁ నైననుఁ బెఱుకరాదు.
గురువుగారూ!
ఆటవెలది లో పూరించమని మీరు చెప్పనందున తేటగీతి లో పూరణచేశాను.
ఆ.వె: ఇఱుకరాదు చిత్త మింతుల వల లోన
రిప్లయితొలగించండిగొఱుక రాదు చెలిమి గూర్మి చెడిన
నఱుక రాదు నగవు నడవని దినమైన
బెఱుకరాదు తురుము బెండ్లమైన
--- వెంకట రాజారావు . లక్కాకుల
--- బ్లాగు : సుజన సృజన
ఎట్టి చిక్కులలో నైన నిఱుకరాదు !
రిప్లయితొలగించండికొఱుకరా దెపుడును పచ్చి మిరపకాయ !
నఱుకరాదు లతల, పూలతరుల నెపుడు !
పెఱుకరాదు నెరసినట్టి కురుల నైన !
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిచక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మందాకిని గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
నేను ఫలానా ఛందస్సులో వ్రాయాలని నియమ మేమీ పెట్టలేదుకదా! ఏదైనా వ్రాయవచ్చు.
లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
యేరి కోరి సమస్యల నిఱుకరాదు!
రిప్లయితొలగించండికోరి పండ్లనెవరిపైన కొఱుకరాదు!
పెరుగ తెల్లని జుట్టును బెఱుకరాదు!
నరుడ ! కూర్చున్న కొమ్మను నఱుక రాదు!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిఇఱుక రాదు నరుడ యిద్దరు పెళ్ళాలఁ
రిప్లయితొలగించండిగొఱుక రాదు చెలిని గూర్మి నైన
నఱుక రాదు స్నేహ నవ పుష్పవల్లికల్
పెఱుక రాదు పేర్మి ప్రియుని గతము !
మూర్తిజీ ! దత్తపదిలో సమన్వయం అడగక పోయినా
రిప్లయితొలగించండిసమకూర్చారు ! " పెరుక రాదు ప్రియుని గతము " ! అద్భుతం !
మేమంతా పిచ్చి మొక్కలు పీకాలా , పెద్ద మొక్కలు పీకాలా
అని జుట్టు పీక్కుంటున్నాం ! భళా !
వసంత కిశోర్ జీ మీరు ఎన్ని గంటలకు పడుక్కొంటారు ? ఎంతకు నిద్ర లేస్తారు ? చదువుకొనే రోజులలో నేను కూడా ఒంటి గంట, రెండు గంటలకు నిద్ర లేచే వాడిని. అందఱూ గురకలు తీస్తుంటే మధ్య,మధ్యలో దోమలను వేటాడుతు పుస్తకాలు మగ్గీ కొట్టే వాడిని. మిమ్మలను చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తాయి.
రిప్లయితొలగించండిపూరణ నచ్చినందులకు ధన్యవాదములు. మీరంతా సహజ కవులు. మీ బృందములో తల దూర్చ గలిగి నందులకు యెప్పుడూ సంతోషిస్తుంటాను.
మూర్తీజీ ! జనం నవ్వుతారు చెబితే ! నేను నిద్ర లేచి దాదాపు 40 గంటలయ్యింది !
రిప్లయితొలగించండిమీకు వివరంగా mail పెడతాను తరువాత !
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
వసంత కిశోర్ గారూ,
మూర్తి గారికి వచ్చిన సందేహం నాకూ వచ్చింది. ఒకసారి ఇలాగే అర్ధరాత్రి నిద్రపట్టక లేచి బ్లాగులో వ్యాఖ్యలు పెడితే రాజేశ్వరక్కతో పాటు మిత్రులంతా ‘చీవాట్లు’ పెట్టారు "ఆరోగ్యం జాగ్రత్త!"అంటూ.
బ్లాగులోని మిత్రుల మధ్య పరస్పరం పెరుగుతున్న ఆత్మీయభావం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. 40 గంటలుగా నిద్ర లేదా? మూర్తి గారికి మెయిల్ పెడుతున్నారు కదా! డాక్టర్ గా వారిచ్చే సలహాలను స్వీకరించండి.
శుభమస్తు!
మూర్తి గారూ ! గొఱుక రాదు చెలిని గూర్మి నైన ... ఏం చెప్పారండీ ! భలే ఉందండీ. అభినందనలు.
రిప్లయితొలగించండిహనుమచ్చాస్త్రి గారూ , కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిమూర్తిగారూ మీ పూరణం చాలా బావుంది . ముఖ్యంగా " నఱుక రాదు స్నేహ నవ పుష్పవల్లికల్ " అన్న వాక్య నిర్మాణం చాలా ఆకట్టుకుంది .
రిప్లయితొలగించండిడా.విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు. వయస్సుతో నేర్చు కొన్న సత్య మది.మిగిలిన పాదాలు పద్యము నడవడానికి కల్పితాలయినా మంచి సలహాలు. మొదటి పాదము బాగుందని యింత వఱకు ఎవరూ మెచ్చుకో లేదు. మన మిత్రులంతా ఏక పత్నీ వ్రతులు, చాలా మంచి వారు.