22, జులై 2011, శుక్రవారం

సమస్యా పూరణం -402 (కలలు కల్లలైన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కలలు కల్లలైనఁ గలుగు సుఖము.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

 1. దురిత చరితులైన దుష్టులు కనునట్టి
  కలలు కల్లలైన గలుగు సుఖము.
  పతిత పావనుండు, పరమాత్ముని దయను
  సర్వలోక హితము సతతమొనరు.

  రిప్లయితొలగించండి
 2. లేత ప్రాయమందు లేమతాళగఁలేదు
  కలలు కల్లలైన; గలుగు సుఖము
  కోర్కెలన్నిఁ దీరఁ కోమలాంగులకును.
  నిజము నీకుఁ నెఱుక నిర్మలాత్మ!

  రిప్లయితొలగించండి
 3. మందాకిని గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జులై 22, 2011 8:21:00 PM

  తెలుగు జాతి యొక్క సమైక్యతే ధ్యేయముగ భావించే మనిషిగా వ్రాస్తున్న పద్యాలు. ఎవరిని కించ పరచడానికి కాదని మరీ మరీ మనవి చేస్తూ........

  వేరు రాష్ట్రమంచు వేర్పాటు వాదమ్ము
  పెంచి, శాంతి బాపి, భీతి గొలిపి,
  ప్రజల హింస పెట్టు ప్రాంతీయ నేతల
  కలలు కల్లలైన గలుగు సుఖము.  ఏకరాష్ట్రమంచు ఇష్టానుసారమ్ము
  చెలగి, వృద్ధి నాపి, గోల చేసి,
  ప్రజల హింస పెట్టు ప్రాంతీయ నేతల
  కలలు కల్లలైన గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 5. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  కాలోచితమైన మీ పూరణలు చాలా బాగున్నాయి. మీరు ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం లేదు. మీరు చెపినవి అక్షరసత్యాలు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. కవిమిత్రులారా,
  మందాకిని, సంపత్ కుమార్ శాస్త్రి గారలు తప్ప ఈరోజు ఇంకెవరూ పూరణలు పంపలేదు. అందరూ ఒక్కసారే అలిగారా? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? చెప్తే సరిదిద్దుకుంటాను.

  రిప్లయితొలగించండి
 7. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జులై 22, 2011 9:24:00 PM

  ధన్యవాదములు గురువుగారు.

  రిప్లయితొలగించండి
 8. సంపత కుమార్ శాస్త్రి గారూ! రెండు అద్భుతమైన పూరణ లిచ్చారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 22, 2011 9:45:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  కనులు కలిగినపుడు కలలవి సహజము
  కలలలోన పీడకలలు నుండు
  మంచి కలలు గనిన మనసు రంజిల్లును
  కలలు కల్లలైన,కలదు సుఖము

  (డా.సినారె గారికి కృతజ్ఞతతో) కలలు కల్లలే అని తెలిసినా మంచికలలు ఆనందాన్నిస్తుంది.

  గురువుగారు నెట్ ప్రాబ్లం.

  రిప్లయితొలగించండి
 10. సంద్ర మందు నలలు చయ్యన లేచెను
  గాలి వాన కతన, కావు మనుచు
  పల్లె లోని స్త్రీలు ప్రార్థింప నుప్పొంగ-
  కలలు కల్లలైనఁ గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 11. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 22, 2011 10:03:00 PM

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ చక్కని పూరణలు అందించారు.అభినందనలు

  రిప్లయితొలగించండి
 12. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 22, 2011 11:27:00 PM

  గోలి హనుమచ్ఛాస్త్రిగారూ,గణాధిపతిలా ముందు ఉండాల్సిన మీరు హనుమంతునిలా చివర వచ్చినా బాగుగానె వుంటుంది. మీరు రాకపోతె ఈబ్లాగుకు అందము, మాకు ఆనందము కలుగదు.

  రిప్లయితొలగించండి
 13. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  మిత్రు లందఱి పూరణలు మనోజ్ఞముగా ఉన్నాయి.

  విశ్వ శాంతిఁ గోరు విమలపు ధర్మమ్ము
  సకల భూత రాశి స్వస్తి ప్రదము
  అట్టి ధర్మ మవని నణగఁ జూచెడి వారి
  కలలు కల్ల లైనఁ గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి
 14. గన్నవరపు నరసింహ మూర్తి గారి వ్యాఖ్య ...

  సకల భూత రాశి స్వస్తి గూర్చు ( గా రెండవ పాదము సవరిస్తున్నాను గణ భంగము తొలగ డానికి )

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, జులై 23, 2011 9:35:00 AM

  మిస్సన్న గారికి, మరియు శ్రీపతి శాస్త్రి గారికి నా దన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.

  రిప్లయితొలగించండి
 16. శ్రీపతి శాస్త్రి గారూ,
  కలలకు కళారూపాన్నిచ్చిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  కల్లోలపరచే అలలను కల్లజేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  లంకలో సీత :

  01)
  ___________________________________

  కామ మోహితుండు - కపట వేషంబున
  కల్ల లాడి నన్ను - కాఱు జేసె !
  కరుణ హృదయు, రాము - కఱకు వలన వీని
  కలలు కల్ల లైనఁ - గలుగు సుఖము !
  ___________________________________
  కాఱు = మాయ
  కఱకు - పరాక్రమము

  రిప్లయితొలగించండి
 18. శ్రీపతి శాస్త్రి గారూ! మీ అభిమానమునకు ధన్యవాదములు.

  తెలుగుతల్లి స్వగతం

  మాతృ భాష వదలి మరి యాంగ్ల మందున
  మాటలాడి యొరుల మన్ననలను
  పొంద నెంచు యువత 'పుట్టెడు, తట్టెడు '
  కలలు కల్లలైనఁ గలుగు సుఖము.

  రిప్లయితొలగించండి