14, జులై 2011, గురువారం

చమత్కార పద్యాలు - 104 (ప్రహేళిక)

సీ.
నక్షత్రవీథికి నాయకుఁ డెవ్వఁడు?
రంగగు గుడిలోన లింగ మేది?
వాహనంబుల మీఁది వన్నెకు మొద లేది?
దేవతాఋషులకు తిండి యేది?
నరకాసురునిఁ గన్న నాతి నామం బేది?
పొలఁతి చక్కఁదనాలఁ బోల్ప నేది?
తల్లికిఁ గడగొట్టు తనయునిపై నేది?
కమలాప్త బింబంబుఁ గప్పు నేది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

2 కామెంట్‌లు:

  1. సమాధానాలు -
    శశి - శిల - లక్క - కంద - ధర - రంభ - భ్రమ - మబ్బు.

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారు శశి - ధర - మబ్బు మూడు సమాధానాలు చెప్పగలిగారు.
    గోలి హనుమచ్ఛాస్త్రి గారు పంపిన సమాధానాలలో శశి, ధర, రంభ, భ్ర(మ)మే సరైనవి.‘భ్రమే’ సరైనదనుకుంటే ‘మేఘం’ కరెక్ట్!
    ఇద్దరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి