31, జులై 2011, ఆదివారం

సమస్యా పూరణం -411 (నలకూబరు మంచ మందు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్.

35 కామెంట్‌లు:

 1. నల్ల ధనాన్ని పరుపు క్రింద దాచిన నల్ల కూబరుని పరిస్థితి.

  అల నల్ల ధనము దాచగ
  కలవరమున నిద్ర రాదు కలిమియె యున్నన్!
  నల నల్ల నోట్లె నల్లులు
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్!!

  రిప్లయితొలగించండి
 2. గురువుగారూ ఆరోగ్యం జాగ్రత్త.

  సరదా పూరణ.

  నలకూబర గంధర్వుడు
  యిల కేలను వచ్చె? నిచట నేల పరుండెన్?
  చెలి రంభ మాట వినడో?
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్.

  రిప్లయితొలగించండి
 3. చంద్రశేఖర్:
  అలకాపురి భూకబ్జా
  వలలోబడి యాంధ్రదేశ వశమాయెను రా!
  నులి నులక మంచము మిగల
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్!
  ఛలోక్తి:: విధి బలీయం, మన భూకబ్జా దారుల చేతిలో బడితే అంతే!

  రిప్లయితొలగించండి
 4. మిస్సన్న గారూ ! మీ ప్రశ్నకు సంమాధానం ఇవ్వాలనిపించింది .చిత్తగించండి.

  అలకాపురి రాజు సుతుం
  డలకను బూనెను ; ఇలదిగి హైదర బాదు
  న్నల కూబర లాడ్జి లొదిగె
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్!

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  ___________________________________

  కలలో నేగాంచితి లే
  లలనామణి రంభ తోడ - రమణుండొచ్చెన్ !
  అలకాపురి హొటలున దిగె !
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 6. పై పద్యానికి కొనసాగింపు.నలకూబరుడు ఇలకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే .. కొందరు అప్సరసలు చేసిన కొంటె పనులకు కోపించి ఒక ముని నల్లులు గా పుట్టమని శాపమిచ్చాడు. అప్సరసలు పశ్చాత్తాపంతో వేడుకుంటే శాపవిమోచం ఈ విధం గా ఇచ్చాడు. వారి శాప విమోచనం కోసం నలకూబరుడు ఇలకు రా వలసి వచ్చింది. అది 'లింకు'. తరచూ పురాణా లలో కనిపించేదే ...

  నలకూబరు కుట్టినచో
  అల శాపము తొలగు ననగ; అచ్చర లపుడే
  బిల బిల మని యరు దెంచెను
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్!

  రిప్లయితొలగించండి
 7. హనుమచ్చాస్త్రి గారూ

  ఇల, నేతా మత్కుణముల,
  జలగల, మశకముల గాట్ల సైపగఁ కనఁ వా-
  రల కగునే! నరులే ? కట!
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్!

  రిప్లయితొలగించండి
 8. మిత్రులు శాస్త్రిగారు, మిస్సన్న మహాశయుల ముచ్చట్లు
  ముచ్చట గొలుపుచున్నవి !

  02)
  ___________________________________

  వలువల దీయక నింటికి
  నలకూబర వేషధారి - నడిరేయొచ్చెన్ !
  అలసటతో నిద్రించిన
  నలకూబరు మంచ మందు - నల్లులు జేరెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 9. హనుమచ్చాస్త్రి గారూ అలాగనా ? పాపం...

  కిలకిల నవ్వుచు తిరుగక
  అలకాపురి వీధులందు హాయిగ నయ్యో !
  చెలియల కోసము వచ్చెనె?
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్ !

  రిప్లయితొలగించండి
 10. వసంత మహోదయా ధన్యవాదాలు.
  మీ పూరణలు ముచ్చట గొల్పుతున్నాయి.
  చంద్ర శేఖరుల పూరణ చమత్కారంగా బాగుంది.

  రిప్లయితొలగించండి
 11. శ్రీపతిశాస్త్రిఆదివారం, జులై 31, 2011 10:45:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  యిలపై శోభలు చూడగ
  నలకూబరుడరుగుదెంచె నాపల్లెలలోన్
  నులకల మంచము వేయగ
  నలకూబరు మంచమందు నల్లులు చేరెన్

  రిప్లయితొలగించండి
 12. మిస్సన్న మహాశయులకు కొనసాగింపు !

  03)
  ___________________________________

  కలయో వైష్ణవ మాయయో ?
  ఇల కేలను వచ్చె నకట ? - యింతుల కొఱకా ?
  అలకాపురిలో కరువా ?
  నలకూబరు మంచ మందు - నల్లులు జేరెన్ !
  ___________________________________

  రిప్లయితొలగించండి
 13. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !

  04)
  ___________________________________

  యిల కొచ్చిన రంభ వెనుక
  నలవాటుగ వెంటవెళ్ళె - నల్లులు నాడే !
  బలమును త్రాగుట కొఱకే
  నలకూబరు మంచ మందు - నల్లులు జేరెన్ !
  ___________________________________
  నాడే = విశ్వామిత్రుని తపో భంగమప్పుడే

  రిప్లయితొలగించండి
 14. చంద్ర శేఖర గారూ ! శ్రీ పతి శాస్త్రి గారు ! మీ మీ నులక మంచపు పూరణలు ముచ్చట గా వున్నవి.
  కిషోర్ జీ ! మిస్సన్న గారూ ! ముచ్చట్లు గొలుపుచున్న మన ముచ్చట్లు నల్లుల కుట్ల తో ..నలకూబరున కగచాట్లు .. అయినా పర్లేదు ..కొనసాగిద్దాం. ( సరదాగా )

  రిప్లయితొలగించండి
 15. అల రంభ యైన మాకేం !
  అలకాపురి నాధు సుతుడె యైనను మాకేం !
  అల వాటే మాకనుచును
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్ !!

  రిప్లయితొలగించండి
 16. శంకరయ్యగారూ, చాలా రోజులయ్యింది. ఇటుగా రాలేదు. శంకరాభరణాన్ని చక్కగా నడిపిస్తున్న మీకు, కవివతంసులకూ అభినందనలు, నమోవాకాలు.

  కలగనె నిద్రను రంభను,
  నలకూబరు, మంచ మందు; నల్లులు జేరెన్
  తలపులఁ విహరించు యతని
  బలవర్ధకమౌ రుధిరముఁ బడయుట కొఱకై;

  రిప్లయితొలగించండి
 17. అల రంభ ఇంద్రు పంపున
  ఇలజేరెను, తిరిగి వెడల నెక్కెను యెట్లో!
  అలకాపురి సరి జేరగ
  నలకూబరు మంచ మందు నల్లులు జేరెన్ !!

  రిప్లయితొలగించండి
 18. చెలి రంభ యడిగె నప్పుడు
  నలకూబరు; 'మంచ మందు నల్లులు జేరెన్ !
  ఇలకేగి తెత్తు మింకను
  విలువనకే డబలుకాటు విత్ స్లీప్ వెల్ బెడ్' !!

  రిప్లయితొలగించండి
 19. కలవర మాయెను మదిలో
  కలనైనన్ దలచలేదు కారణ మేమో ?
  చెలి రంభ కలువ రాదే
  నలకూబరు; 'మంచ మందు నల్లులు జేరెన్' !

  రిప్లయితొలగించండి
 20. కిషోర్ జీ ! కనిపెట్టాను.... "యిల కొచ్చిన " ...ఇంకా మిమ్మల్ని 'ఒ' దల లేదు.

  రిప్లయితొలగించండి
 21. తొలి 'కూబరు' తెల్లదొరయె
  'బొలారము'న కుదిరి కొలువు, పొందెన్ 'క్వార్టర్'
  చెలి గూడి యుండ; ఆ కా
  నల - 'కూబరు' మంచమందు నల్లులు జేరెన్!

  రిప్లయితొలగించండి
 22. భళి కూబరు తెల్ల దొరను
  అల వోకగ తెచ్చి నేడు ఆచార్య ఫణీం
  ద్రులె పూరణ చేసిరి "కా
  నల - 'కూబరు' మంచమందు నల్లులు జేరెన్!"

  రిప్లయితొలగించండి
 23. ఓ ఇద్దరు మిత్రులు చచ్చి ( కొత్తబట్టలు వేసుకోవటానికి)స్వర్గానికి వెళ్లి- అక్కడ రంభాపరిష్వంగంకోరి, పూర్వకర్మఫలమూ, వీరల కోరికా తోడై తరువాత జన్మలో నల్లులైనారన్న భావాన్ని - కంద పద్యం లో పెట్టటానికి తలకు మించిన ప్రయత్నం చేస్తూ -

  తలగుమ్మమునవిడిశషభి
  షల,నడిగిరిరంభతోడశయ్యాసుఖమున్
  చెలికాండ్రిర్వురు; ఫలితమె-
  నలకూబరుమంచమందు నల్లులు జేరెన్!

  రిప్లయితొలగించండి
 24. మిత్రులకు మనవి,
  అనారోగ్యంతో బాధపడుతున్నా అత్యవసరంగా `నల్గొండ" రావలసి వచ్చింది. ఇక్కడి నెట్ సెంటర్‌లో కూర్చుని అందరి పూరణలూ చదివాను. ఒకరిని మించి ఒకరు చక్కని పూరణ లిచ్చారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  తిరుగు ప్రయాణంలో ఉన్నాను. అందరి పూరణల మీద రేపు ఉదయం వ్యాఖ్యానిస్తాను.

  రిప్లయితొలగించండి
 25. మిత్రుల పూరణలు ముచ్చటగా ఉన్నాయి.


  చెలి కోర్కెఁ దీర్చు సందడి
  అలనాడే చేరె నంట నద్భుత న్యూయార్క్
  తల దాచ పటేల్-మోటెల్
  నల కూబరు మంచ మందు నల్లులు చేరెన్ !

  ( అమెరికా దేశములో ప్రతి ఊరులో ఒక పటేల్ నడిపే మోటెల్ ఉంటొంది.)


  శిల వలె తల్పము మారగ
  సిలికానున కొంటిరి యట సీలీ శయ్యన్
  అలలుగ నావను గూడిన
  నలకూబరు మంచ మందు నల్లులు చేరెన్ !

  రిప్లయితొలగించండి
 26. గురువు గారూ
  నల్లులు చేరెన్ లో సరళాదేశము రాదు కదా ? గసడదవా దేశ సంధి చేస్తే నల్లులు సేరెన్ అవుతొందికదా ?

  రిప్లయితొలగించండి
 27. డా. మూర్తి మిత్రమా!! పటేల్ మోటల్ అనుభవాలు మరువగలమా! ఒక్కొక్కచోట ఒక్కొక్కరకంగా, అందులోనూ యేకంగా న్యూయార్క్ తీసుకెళ్ళారు :-) మరి ప్రౌఢల పురంగదా, ఇంకా గట్టిగా కుట్టుంటాయి :-)

  రిప్లయితొలగించండి
 28. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  శాస్త్రీజీ ! ధన్యవాదములు ! బాగా గుర్తు చేశారు !
  ఇదిగో సవరణ !

  04అ)
  ___________________________________

  ఇలకు దిగిన రంభ వెనుక
  నలవాటుగ వెంటవెళ్ళె - నల్లులు నాడే !
  బలమును త్రాగుట కొఱకే
  నలకూబరు మంచ మందు - నల్లులు జేరెన్ !
  ___________________________________
  నాడే = రావణాసురుని తపోభంగం చెయ్యడానికి వచ్చిన నాడే
  బలము = రక్తము

  రిప్లయితొలగించండి
 29. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నిజమే! నాదే పొరపాటు. అక్కడ సరళాదేశం రాదు. ఒంట్లో కాస్త నలతగా ఉండి గమనించలేదు. దోషాన్ని గుర్తించి చెప్పినందుకు ధన్యవాదాలు. సవరించాను.

  రిప్లయితొలగించండి
 30. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మిస్సన్న గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  వసంత కిశోర్ గారూ,
  శ్రీపతి శాస్త్రి గారూ,
  రవి గారూ (ఎన్నాళ్ళ కెన్నాళకు?),
  డా. ఆచార్య ఫణీంద్ర గారూ (బహుకాలానికి దయ చూపారు),
  ఊకదంపుడు గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  అందరి పూరణలూ మనోహరంగా, వైవిధ్యంగా, చమత్కారభరితంగా ఉండి ఆనందపరిచాయి. ఆహ్లాదకరమైన చర్చకూడా జరిగింది. అభినందనలు, ధన్యవాదాలు.
  నల్లగొండనుండి తిరుగుప్రయాణంలో రాత్రంతా నిద్రలేక నలతగా ఉండి అందరి పూరణలను విడివిడిగా ప్రస్తావించలేక పోతున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 31. గురువు గారూ, ధన్యవాదములు. మీరు నలకూబరులు కాదు. మీకు నల్లుల బాధ లేదు. చక్కగా విశ్రాంతి తీసు కొనండి.

  రిప్లయితొలగించండి

 32. అల రంభను కౌగిలినిడి
  వలయమ్మున దొర్లిదొర్లు వైభోగమునన్;
  అలకాపురి పోవుదమని;
  నలకూబరు మంచ మందు నల్లులు సేరెన్

  రిప్లయితొలగించండి