28, జులై 2011, గురువారం

ప్రహేళిక - 46

ఈ పదాలు ఏవి?
ఆ. వె.
ఫణము, ఘటిక, నందపత్ని, దాహము, బాష్ప
వారి, కృష్ణసతియు పదము లవ్వి
త్ర్యక్షరమ్ములు తుది యక్షరా లాదులౌ
నట్టివానిఁ జెప్పునతఁడె ఘనుఁడు.

కవిమిత్రులారా,
ఆ పదాలేమిటో చెప్పగలరా?
సమాధానాన్ని మెయిల్ చేయండి.
shankarkandi@gmail.com

6 కామెంట్‌లు:

  1. మందాకిని గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ (ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు?),
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    మీ అందరి సమాధానాలూ సరియైనవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. వి. వి. సత్యనారాయణ సెట్టి గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. చాలా సంతోషం!
    మీ సమాధానాలు సరియైనవే. అభినందనలు.
    వాటిని రేపు ఉదయం ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  3. వసంత కిశోర్ గారూ,
    మీ సమాధానాలు సరియైనవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. మందాకిని గారి సమాధానం ...
    పడగ, గడియ, యశోద, దప్పిక, కన్నీరు, రుక్మిణి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారి సమాధానం ...
    పడగ - గడియ - యశోద - దప్పిక - కన్నీరు - రుక్మిణి.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారి సమాధానం ...
    పడగ,గడియ,యశోద,దప్పిక,కన్నీరు,రుక్మిణి.
    *
    భమిడిపాటి సూర్యలక్ష్మి గారి సమాధానం ...
    ఫణము....... పడగ
    ఘటిక....... గడియ
    నందపత్ని... యశోద
    దాహము.... దప్పిక
    బాష్పవారి... కన్నీరు
    కృష్ణసతి...రుక్మిణి
    పగ, దయ, కరు (ణ)...(?)
    *
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం ...
    పడగ - గడియ - యశోద - దప్పిక - కన్నీరు - రుక్మిణి.
    *
    వసంత కిశోర్ గారి సమాధానం ...
    పడగ - గడియ - యశోద - దప్పిక - కన్నీరు - రుక్మిణి.
    *
    వి. వి. సత్యనారాయణ సెట్టి గారి సమాధానం ...
    Padaga,Gadiya,Yasoda,Dappika,Kanneeru &Rukmini.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతి శాస్త్రి గారి సమాధానం ...
    ఫణము = పడగ ; ఘటిక = గడియ ; నందపత్ని = యశోద ; దాహము = దప్పిక; భాష్పవారి = కన్నీరు ;
    కృష్ణసతి = రుక్మిణి

    రిప్లయితొలగించండి