5, జులై 2011, మంగళవారం

సమస్యా పూరణం -383 (లోకపాలు లేకున్నను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
లోకపాలు లేకున్నను లోటు లేదు.
ఈ సమస్యను సూచించిన వ. రా. స. గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. చెడ్డ వారిని నిలబెట్టి చెరిగి వేసి
    మంచి వ్యక్తుల నిలబెట్టి మనము కలసి
    ప్రజల పాలన నందరు పాలుగొనగ
    లోకపాలు లేకున్నను లోటు లేదు.

    రిప్లయితొలగించండి
  2. వ్యంగ్యోక్తిలో:
    లోకపాలు లేకున్నను లోటు లేదు
    దేశమేగతి పోయిన దిక్కు లేదు
    కోటి నిధులవి పోయిన కోపమేల
    కడకు జోలెకూడె మనకు గతి యగునట!

    రిప్లయితొలగించండి
  3. చేయు పాపము హరియించు జేసు ప్రభువు
    కల్మషమ్ములు కరగించు గంగ మునుగు
    విశ్వ సంపద దాచంగ స్విస్సు పుట్ట
    లోకపాలు లేకున్నను లోటు లేదు.

    రిప్లయితొలగించండి
  4. ముచ్చటైనది, పలుకులు మోహ పఱచు
    మనదు భాషను విడువగ మనము నిమ్న
    లోకపాలు! లేకున్నను లోటు లేదు
    ఆంగ్ల పదములు! వద్దొకొ! ఆంధ్ర మెఱుగు,

    రిప్లయితొలగించండి
  5. విశ్వ శ్రేయస్సు గోరెడు విబుధులకును,
    దీనజన సేవలోగల ధీయుతులకు,
    ప్రజల కాంక్షల నెరవేర్చు పాలకులకు
    లోకపాలు లేకున్నను లోటులేదు

    రిప్లయితొలగించండి
  6. తే.గీ: సంజయుడు వచ్చి యిట్లనె " సంగరమున
    వచ్చు నెత్తుటి కూడేల ? వలదు నీకు
    ధర్మ రాజ ! విను ! వినుత ధర్మవిబుధ
    లోక ! పాలు లేకున్నను లోటు లేదు .

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    --- బ్లాగు: సుజన సృజన

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    వ్యంగ్యాత్మకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘విశ్వ సంపద దాచంగ స్విస్సు పుట్ట’ ఎంత బాగా చెప్పారు? మంచి పూరణ. అభినందనలు.

    మందాకిని గారూ,
    మాతృభాషాభిమానం లేని వాళ్ళను పాతాళానికి త్రొక్కేసారు. బాగుంది మీ పూరణ. చక్కని విషయం చెప్పారు కనుక లోపాలు మరుగున పడ్డాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘విశ్వశ్రేయస్సు’ అన్నప్పుడు ‘శ్వ’గురు వవుతుంది. ‘విశ్వసంక్షేమమును గోరు విబుధులకును" అందాం.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువు గారూ, ధన్యవాదములు. మరుగున పడ్డ లోపాలేమిటో తెలుసుకోకపోతే నిద్రపట్టదు. దయచేసి మీరు నిస్సంకోచంగా దోషవిచారణ చేయండి. సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను. "ముచ్చటైనది" గ్రామ్యమా? ముచ్చటగొలుపు అంటే ?
    లోకపు పాలు అనే అర్థానికి లోకపాలు అని పదం తప్పుగా వాడుకున్నానంటారా?
    లేక గణదోషాలా?

    రిప్లయితొలగించండి
  10. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, జులై 05, 2011 4:51:00 PM

    తాను ఖర్చును జేయడు దానమివ్వ,
    డెంత సంపాదనము జేసి యేమి ఫలము,
    కడకు పీనాసి జనులయా ధనము రాజ
    లోకపాలు, లేకున్నను లోటు లేదు.

    పిసినారుల ధనమంతా రాజులకే చెందుతుందని కదా ప్రశస్తి.

    రాజలోక పాలు = రాజులపాలవడము అనే అర్థములో వాడినాను. సరైన ప్రయోగమేనా గురువు గారూ??

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జులై 05, 2011 9:26:00 PM

    శ్రీగురుభ్యోనమ:
    శ్రీకృష్ణపరమాత్మతో ధర్మరాజు పలికేమాటలు

    ఐదు గ్రామంబులిచ్చిన యంతె చాలు
    అదియు కాకున్న నాలుగే నైన చాలు
    ఇవ్వ నోర్పడు రారాజు ఈశ బంధు
    లోక, పాలు లేకున్నను లోటు లేదు

    బంధులోక = బంధువులకు లోకమైనవాడా

    రిప్లయితొలగించండి
  12. మందాకినిగారూ , సంపత్ కుమార్ శాస్త్రి గారూ , లోక పాలు = లోకము పాలు , లేదా , లోకుల పాలు అనే అర్థంలో వాడలేము . ' లోక ' సంస్కృతం. ' పాలు ' తెలుగు . సూక్ష్మంగా గ్రహించదగినదేమంటే సంస్కృత పదం మీద తెలుగు రాదు , అదిన్నూ సమాస ఘటనంలో . ఇలాంటి సందర్భాలలో పుంప్వాదేశం ఉండనే ఉందికదా !
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ , " తాను ఖర్చును జేయడు దానమొసగ / డెంత " అని అంటే మేలు ...మూడవపాదంలో యతి సరి చూడగలరు...
    శ్రీపతిగారూ , " ఐదు గ్రామంబులిచ్చిన నంతె చాలు ; ---- నాలుగే యయిన చాలు " యడాగమంకోసం సవరణలు .
    ఇవ్వనోర్పడు బదులు ' ఈ దలంపడు ' మేలు !
    " ఇవ్వ " శబ్ద సాధుత్వాసాధుత్వాల గురించి పెద్ద చర్చే జరిగింది కదా !

    ఈరోజు విశ్రాంత సమయం .... అందుకే కాస్త స్వేచ్ఛ తీసుకున్నాను . శంకరయ్యగారూ , మన్నింపగలరు .

    రిప్లయితొలగించండి
  13. డా.విష్ణునందన్ గారు, మంచి పాఠం, ధన్యవాదాలు. "ఇవ్వ" అనేది యేరకంగా వాడకూడదో, మరి ప్రత్యామ్నాయ పదం చూపించి చెప్పారు. మీకు ఈ రకంగా తీరిక దొరకటం మాకు మేలు:-)

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రులకు నాదొక విన్నపము -
    బ్లాగును నిర్వహించు ప్రతిభాయుతు లార్యులు శంకరయ్యగా
    రీగతి జూచుచుండ- మనకేల విచారము జేయు దూల?బా
    గోగుల గోల? సత్కవులకున్ గడు పెద్దరికమ్ము నిచ్చి,బా
    గోగులు నిర్వహించు పని గూర్చగ నీయుడు శంకరార్యులన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  15. సంస్కృతంలో పొల్లు స్థానంలో ఉకారం ఉంటుందా? లోకపాలు అని కాకుండా లోకపాలిక అని వ్రాసుంటే బాగుండేది.

    Praveen Sarma http://patrika.teluguwebmedia.in

    రిప్లయితొలగించండి
  16. శర్మగారూ !ధన్యవాదములు !

    ఏం పాలో తెలియక తల కొట్టు కొంటున్నాను !
    ఇంతకీ " లోకపాలు " అంటే lokpal అనా ?
    అర్థమైంది !
    శంకరార్యా అంతేనా ?

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    ________________________________

    నీతి లేనట్టి మంత్రుల - నిగ్గదీసి
    కఠిన దండన చేయగా - కావలెనుగ
    లోకపాలు ! లేకున్నను - లోటు లేదు
    హూణ వనితల పాలనా - హొయలు మనకు !
    ________________________________

    రిప్లయితొలగించండి
  18. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, జులై 06, 2011 10:47:00 AM

    డా. విష్ణు నందన్ గారూ, ధన్యవాదములండి. మీయొక్క సవరణలు నాలోని ప్రతిభను మెరుగు పరచుననడములొ సందేహం లేదు.

    రిప్లయితొలగించండి