8, జులై 2012, ఆదివారం

పద్య రచన - 44


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

కవిమిత్రుల పద్యములు

౧. లక్ష్మీదేవి
    తెలుపది నీ యందమనుచు
    తెలిసెను చెలియా! వసంత దీపిక వనుచున్
    తలచెద నే నిను, మఱువక
    తలలో ధరియించెదనిక ధవళకుసుమమా!

    ధరణిని వెలసిన ధవళపు
    విరిబోణీ! నిను వలచితి, వేణిని నిన్నే
    ధరియింపగ తలచితి, నా
    దరి చేరగ రాగదె! సిరి తావుల తోడన్.

    మల్లియ కన్నను జగతిని
    తెల్లనిది కలదె? సొబగున దీటగు సుమముల్,
    మెల్లగ దావుల్నెల్లెడ
    జల్లెడు సుగుణంబుతోడ నిచ్చట గలవే?

*     *     *     *     *
౨. సుబ్బారావు
    తెల్ల మల్లియ లయ్యవి యుల్ల మలర
    గుత్తు లొయ్యన వాసన గుప్పు మనును
    చూడ నబ్బుర మగు నయ్య ! చూపరులకు
    దాని యందము పొగడ దరమె నాకు ?
*     *     *     *     *
౩. పండిత నేమాని
    మల్లికాసుమమ్మ! నీ సమమ్ము లేదు పూలలో
    చల్లనైన గుండె నీది చక్కనైన రూపమున్
    తెల్లదనము నీదు గుణము దెల్పు స్వఛ్ఛమంచు నిన్
    మల్లికేశు డాదరించె మంగళాస్పదా! బళా!
*     *     *     *     *
౪. మిస్సన్న
    స్వచ్ఛతకు మారు పేరుగ సద్గుణముల
    శోభ లీనెడు మనసుకు సూక్తులందు
    నిన్ను పోలిక తెత్తురు నిఖిల బుధులు
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    మండు వేసవి గాడ్పుల మాడి పగలు
    చల్ల గాలిని తిరుగాడు సంధ్య వేళ
    నీ గుబాళింపు మదులను నింపు శాంతి
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    శివునకును విష్ణువునకును శివ సుతునకు
    ముజ్జగమ్ముల నేలెడు మూల శక్తి
    త్రిపుర సుందరికిని నీవు తృప్తి నిడవె
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    శంభు దివ్య గాత్ర స్వచ్ఛత చెప్పుచో
    పలుకుతల్లి శోభ తెలుపు వేళ
    నీదు దేహ కాంతి యాదరణీయము
    మల్లె! పరిమళాల తల్లి వీవు.

    బుట్ట మల్లె యంచు బొండు మల్లె యటంచు
    బొడ్డు తీగ సెంటు ముద్ద లంచు
    వివిధ జాతులగుచు విందొన రింతువు
    మల్లె! పరిమళాల తల్లి వీవు.

    చెలికి చెలువునకును సేతువై వలపుల
    ముంచి తేల్చి వారి మురియ జేసి
    నలిగి పోదు వీవు మలిగి పోదువు నీవు
    స్వార్థ మెరుగ వీవు సార్థ జీవి.
*     *     *     *     *
౫. గుండు మధుసూదన్
    శారదాభ్రేందు కుంద మందార ఫేన
    కాశ ఘనసార హిమనగాకార; ధవళ
    వర్ణ; మాత సరస్వతి; వాణి నేడు
    మల్లెపువ్వులఁ జూడంగ మదిని మెదిలె.

*     *     *     *     *
6. సంపత్ కుమార్ శాస్త్రి
    నల్లని వాని దివ్య నయనమ్ముల తీరుగ కాంతులీని తా
    నెల్లెడలన్ సువాసనలనెంతయు నింపుచు, దేవపూజకై
    తెల్లని వస్త్రమో యనెడుతీరుగ మాలికరూపుదాల్చునీ
    మల్లియపూలు ధాత్రిని సమంచితమై వెలుగొందె గాంచుమా.
*     *     *     *     *
౭. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
    తెల్లని మల్లెలఁ జూచిన
    నుల్లంబులు సంతసిల్లి యుత్సాహమగున్
    చల్లని సద్భావంబది
    యెల్లరకును గలుగుచుండు నిమ్మహిలోనన్.
*     *     *     *     *
౮. శ్రీపతిశాస్త్రి
    కూర్మాసనముపైన కూర్చున్న శివునకు
              ఫణులెల్ల పడగలు పట్టినట్లు
    ఆకుపచ్చని చెట్లు ఆనందమున తాము
              నవనీతమును పంచి నవ్వినట్లు
    చిమ్మచీకటిలోన చెలగి కాంతులు జిమ్ము
              తారలే తాముగా చేరినట్లు
    పుండరీకములట్లు పుడమితా పులకించ
              మండువేసవిలోన నిండుగాను
    శంకరుని జటాజూటాన చంద్రరేఖ
    యమరినట్లుగ విరిసెనీ సుమములిచట
    పరిమళమ్ములు వెదజల్లి పరవశమున
    మనసునాకట్టు కొన్నవీ మల్లెపూలు
*     *     *     *     *
౯. రాజేశ్వరి నేదునూరి
    తెల్లని మల్లెల పరిమళ
    ముల్లము రంజించు నల ముముక్షువు నైనన్ !
    మల్లియ మాలిక లన్నను
    మల్లేశుడు ముదము చెందు మది పొంగారన్ !

*     *     *     *     *
౧౦. కమనీయం
    ధవళ చంద్ర కాంతుల జల్లు నవవసంత
    మల్లికా కుసుమ సుపరీమళము తోట
    నిండ నా హృదయమున జనించె నొక్క
    రసభరిత కవితా హేల రంజిలంగ.

25 కామెంట్‌లు:

  1. తెలుపది నీ యందమనుచు
    తెలిసెను చెలియా! వసంత దీపిక వనుచున్
    తలచెద నే నిను, మఱువక
    తలలో ధరియించెదనిక ధవళకుసుమమా!

    రిప్లయితొలగించండి
  2. ధరణిని వెలసిన ధవళపు
    విరిబోణీ! నిను వలచితి, వేణిని నిన్నే
    ధరియింపగ తలచితి, నా
    దరి చేరగ రాగదె! సిరి తావుల తోడన్.

    రిప్లయితొలగించండి
  3. తెల్ల గులాబు లయ్యవి యుల్ల మలర
    గుత్తు లొ య్య న వాసన గుప్పు మనును
    చూడ నబ్బుర మగు నయ్య ! చూపరు లకు
    దాని యందము పొగడ దరమె నాకు ?

    రిప్లయితొలగించండి
  4. మల్లికాసుమమ్మ! నీ సమమ్ము లేదు పూలలో
    చల్లనైన గుండె నీది చక్కనైన రూపమున్
    తెల్లదనము నీదు గుణము దెల్పు స్వఛ్ఛమంచు నిన్
    మల్లికేశు డాదరించె మంగళాస్పదా! బళా!

    రిప్లయితొలగించండి
  5. స్వచ్ఛతకు మారు పేరుగ సద్గుణముల
    శోభ లీనెడు మనసుకు సూక్తులందు
    నిన్ను పోలిక తెత్తురు నిఖిల బుధులు
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    మండు వేసవి గాడ్పుల మాడి పగలు
    చల్ల గాలిని తిరుగాడు సంధ్య వేళ
    నీ గుబాళింపు మదులను నింపు శాంతి
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    శివునకును విష్ణువునకును శివ సుతునకు
    ముజ్జగమ్ముల నేలెడు మూల శక్తి
    త్రిపుర సుందరికిని నీవు తృప్తి నిడవె
    మల్లె! యనుపమ పరిమళ ఫుల్ల గాత్ర!

    శంభు దివ్య గాత్ర స్వచ్ఛత చెప్పుచో
    పలుకుతల్లి శోభ తెలుపు వేళ
    నీదు దేహ కాంతి యాదరణీయము
    మల్లె! పరిమళాల తల్లి వీవు.

    బుట్ట మల్లె యంచు బొండు మల్లె యటంచు
    బొడ్డు తీగ సెంటు ముద్ద లంచు
    వివిధ జాతులగుచు విందొన రింతువు
    మల్లె! పరిమళాల తల్లి వీవు.

    చెలికి చెలువునకును సేతువై వలపుల
    ముంచి తేల్చి వారి మురియ జేసి
    నలిగి పోదు వీవు మలిగి పోదువు నీవు
    స్వార్థ మెరుగ వీవు సార్థ జీవి.

    రిప్లయితొలగించండి
  6. లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    అందమైన పద్యం చెప్పారు. అభినందనలు.
    అందరికీ మల్లెలు కన్పిస్తే మీకు తెల్లగులాబీలు కనిపించాయి. అవి మల్లెలే!
    ‘తెల్ల గులాబు లయ్యవి’ని ‘తెల్ల మల్లియ లయ్యవి’ అంటే సరి!
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్యం ఉత్సాహంతో ఉరకలు వేసింది. చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,

    మల్లియల గొప్పదనమును
    దెల్లము చేసితివి నీ విదే పద్యములం
    దెల్లరి మనములు రంజిల
    కొల్లులుగఁ బ్రశంస లందుకో, మిస్సన్నా!

    రిప్లయితొలగించండి
  7. మల్లియ కన్నను జగతిని
    తెల్లనిది కలదె? సొబగున దీటగు సుమముల్,
    మెల్లగ దావుల్నెల్లెడ
    జల్లెడు సుగుణంబుతోడ నిచ్చట గలవే?

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పద్యము....

    శారదాభ్రేందు కుంద మందార ఫేన
    కాశ ఘనసార హిమనగాకార; ధవళ
    వర్ణ; మాత సరస్వతి; వాణి నేడు
    మల్లెపువ్వులఁ జూడంగ మదిని మెదిలె.

    రిప్లయితొలగించండి
  9. అయ్యా మిస్సన్న గారూ!
    మీ మల్లెలపై ఖండిక పరిమళమ్ములను వెదజల్లుచున్నది. సంతోషము.
    HATS OFF.

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మీదేవి గారూ,
    మీ మూడవ పద్యం కూడా బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం ధవలవర్ణశోభితమై అలరారుతున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ! ధన్యవాద శతము.
    నేమాని పండితార్యా! ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  12. నల్లని వాని దివ్య నయనమ్ముల తీరుగ కాంతులీనుచున్,
    ఎల్లెడలన్ సువాసనలనెంతయు నింపుచు, దేవపూజకై
    తెల్లని వస్త్రమో యనెడుతీరుగ మాలికరూపుదాల్చునే
    మల్లియపూలు ధాత్రిని సమంచితమై వెలుగొందె గాంచుమా.

    గురువుగారూ,

    మామూలుగా పూలతో కళ్ళకు పోలిక చూపిస్తారు కదా ( పద్మనయనములు, కమలదలేక్షణుడు ).నేను శ్రీకృష్ణుని కనులవలే మల్లె పూలు అని వ్రాసినాను. ఈ రకమైన పోలిక చేయవచ్చునా??

    రిప్లయితొలగించండి
  13. తెల్లని మల్లెలఁ జూచిన
    నుల్లంబులు సంతసిల్లి యుత్సాహమగున్
    చల్లని సద్భావంబది
    యెల్లరకును గలుగుచుండు నిమ్మహిలోనన్.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ మిస్సన్న గారూ!
    మీ ఖండిక అద్భుతంగా ఉంది. అభినందనలు

    శ్రీమన్మిస్సనవర్యా!
    మీమాటలు మల్లెలట్లు మిక్కిలి సొగసై
    ధీమన్! వెలుగుచు నున్నవి
    కామితవరదుండు మీకు ఘనయశమొసగున్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిఆదివారం, జులై 08, 2012 4:14:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    కూర్మాసనముపైన కూర్చున్న శివునకు
    ఫణులెల్ల పడగలు పట్టినట్లు
    ఆకుపచ్చని చెట్లు ఆనందమున తాము
    నవనీతమును పంచి నవ్వినట్లు
    చిమ్మచీకటిలోన చెలగి కాంతులు జిమ్ము
    తారలే తాముగా చేరినట్లు
    పుండరీకములట్లు పుడమితా పులకించ
    మండువేసవిలోన నిండుగాను

    యిందుశేఖరు శిరమున చందురుండు
    అమరినట్లుగ విరిసెనీ సుమములిచట
    పరిమళమ్ములు వెదజల్లి పరవశమున
    మనసునాకట్టు కొన్నవీ మల్లెపూలు

    గురువుగారికి నమస్సులు. సీసపద్యమును వ్రాయాలనే నా కోరిక యిన్నాళ్ళకు తీరినది. తప్పులను సవరించ ప్రార్థన. చిత్రములోకల పూవులలో అన్నిటికన్నా క్రింద గల పుష్పమును పరిశీలించగా శివలింగమునకు నాగాభరణములు పెట్టినట్లుగా ఉన్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. తెల్లని మల్లెల పరిమళ
    ముల్లము రంజిల్ల జేయు ముముక్షువు కైనన్ !
    మల్లియ మాలిక లన్నను
    మల్లేశుడు ముదము చెందు మది పొం గారన్ !

    రిప్లయితొలగించండి
  17. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ధారాశుద్ధితో చక్కని వృత్తం వ్రాసారు. అభినందనలు.
    ‘ఈనుచున్ + ఎల్లెడల’ అన్నప్పుడు విసంధిగా వ్రాయరాదు. అక్కడ కొద్దిగా సవరించాను.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం మనోహరంగా ఉంది.అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మొదటి ప్రయత్నమైనా సలక్షణంగా ధారాశుద్ధితో వ్రాసారు. సంతోషం! అభినందనలు.
    ఎత్తుగీతిలో ‘ఇందుశేఖరుడు’ అని మళ్ళీ ‘శిరమున చందురుండు’ పునరుక్తి అవుతున్నది. అలాగే ‘నిండుగాను + ఇందుశేఖరు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చందురుండు + అమరునట్లు’ అన్నప్పుడు విసంధిగా వ్రాయరాదు. నా సవరణను గమనించండి.

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నాల్గవ పాదంలో గణదోషం. నా సవరణను గమనించండి.

    రిప్లయితొలగించండి
  19. బుధ రంజకమైన పద్య సుమాలు పూయించగల మూర్తిగారూ మీ ప్రశంసకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. ధన్యవాదాలు గురువుగారూ,

    మీ సవరణ సర్వదా స్వీకరణీయమే. నమస్సులు.

    శ్రీ మిస్సన్నగారూ,

    అదరగొట్టేశారు మీరు.

    శ్రీపతిశాస్త్రిగారూ,

    మీరుకూడా తక్కువ తినలేదు సుమీ.

    రిప్లయితొలగించండి
  21. guruvugaaruu dhanyavaadamulu. cakkani savaraNa suucimcinaaru. Sampath Kumar Sastry gaaruu dhanyavaadamulu.

    రిప్లయితొలగించండి
  22. ధవళ చంద్ర కాంతుల జల్లు నవవసంత
    మల్లికా కుసుమ పరీమళము తోట
    నిండ నా హృదయమున జనించె నొక్క
    రసభరిత కవితా హేల రంజిలంగ.

    రిప్లయితొలగించండి
  23. కమనీయం గారూ,
    రసభరిత కవితను కమనీయంగా చెప్పే సమర్థులు మీరు. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘సుపరీమళము’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  24. సంపత కుమార్ శాస్త్రి గారూ ధన్యవాదాలు.
    మీ పద్యం పరిమళాలు వెదజల్లుతోంది.

    రిప్లయితొలగించండి