16, జులై 2012, సోమవారం

పద్య రచన - 52

(భీముఁ డశ్వత్థామ యను గజమును సంహరించుట)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. భారత ఘోరాహవమున ద్రోణుడు కురు
    వాహినీపతియయి బలమెసంగ
    పాండవసేనకు భయముగొల్పుచునుండ
    నాతని స్థైర్యమ్ము నణచివేయ
    గానెంచి యట భీమసేను డశ్వత్థామ
    యను భయంకర గజమ్మును వధించి
    అహహ అశ్వత్థామ హతుడయ్యెనని నినా
    దముల నొనర్చిన సమయమందు
    ధర్మరాజును పాక్షిక ధర్మ మటుల
    పలుకగా ద్రోణుడార్తితో వ్యాకులుడయి
    శస్త్ర సన్యాసమొనరించి సంగరమున
    నక్కటా నిహతుడయ్యె నయ్యరుల చేత

    రిప్లయితొలగించండి
  2. భీ ము డు చంపగ గజమును
    నామము గల యశ్వధా మ నారాచ మునన్
    నమ్మెను గొడుకని ద్రోణుడు
    నె మ్మ నమున విడిచె నంత నేరుగ నస్త్రాల్ .

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! సుబ్బారావు గారూ! శుభాభినందనలు.
    మీ పద్యమును చూచేను. మీరు ప్రాస నియమమును కూడా పాటించలేదు. మీ పద్యమును మార్చి మళ్ళీ వ్రాస్తే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    అద్భుతమైన సీసపద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి భావంతో పద్యాన్ని చెప్పినా ప్రాసను విస్మరించారు.
    మీ పద్యానికి నా సవరణ....
    భీముండు చంపె నశ్వ
    త్థామ యను గజమును తన గదాఘాతముతో
    నా మాట నమ్మె ద్రోణుం
    డే మనమున నస్త్రముల త్యజించెను వేగన్.
    *
    కవిమిత్రులారా,
    ఈ నాటి పద్యరచనకు విశేషస్పందన వస్తుందని భావించాను. కాని ఇద్దరే పంపారు. ఎందుకో?

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. నేమాని వారికి నమస్కారములు
    3,4 పాదాలు ద్విత్వాలు ప్రాసలు.పొరపాటు .
    క్షంతవ్యుడను.
    శంకరయ్య గారికి నమస్కారములు
    పద్యం సరిచేసినందులకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  7. సుతుడహొ! "నశ్వత్థామయె
    హతుడయె"నన్నట్టి పలుకు నాతండపుడే
    సతతము నిజము పలుకు యమ
    సుతు నోట వినిన ఘటనను సొక్కిన గజమే!

    గురువు గారు,
    విద్యుచ్ఛక్తి సమస్య వల్ల ఆలస్యమయినది.

    రిప్లయితొలగించండి
  8. గురు పుత్రుడని యెంచక
    శరమును సంధింఛి వడముడ శ్వద్దామ కుం !
    జర : తమని పలుకగ
    సరుడును ద్రోణుడు విడచె సరళిం చుచునే !

    " అమ్మో ! వ్రా సాను గానీ ఎన్ని తప్పులున్నాయో !

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సుతుడహొ యశ్వత్థామ’ అనాలి. అక్కడ నుగాగమం రాదు.
    ఇక కరెంటు కోతతో నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది.
    *
    అమ్మా రాజేశ్వరమ్మా,
    మీ ఆసక్తి, ప్రయత్నం అభినందనీయాలు.
    కానీ... సవరణకు లొంగనంటున్నది మీ పద్యం. చేతు లెత్తేస్తున్నా. ఈసారికి మన్నించాలి.
    (అంతమాత్రాన పద్యరచనా వ్యాసంగానికి తిలోదకాలివ్వకండి. ఈ మధ్య నిర్దోషంగా చక్కని పద్యాలు చాలా వ్రాసారు.)

    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారి పద్యములు....
    తే.గీ.
    భీష్ము నస్త్ర సన్యాసమ్ము వెనుకె ద్రోణుఁ
    డపుడు సర్వ సైన్యాధ్యక్షుఁ డగుడుఁ దీవ్ర
    యుద్ధ తంత్రములను బన్ని యోధ ముఖులఁ
    గూల్చు చుండఁగఁ గృష్ణుండుఁ గుతిలపడియు;

    కం.
    'వేఁడి గల యెత్తుగడచే
    నేఁ డీతని నిలువరించ నేరక యున్నన్
    జూఁడున్ సైన్యం బంతయుఁ
    దూఁడరి సేఁతల యుపేక్ష దోసము గాదే?'

    తే.గీ.
    అనుచు యోచించి, 'ద్రోణుండు తనయు మరణ
    మునకు మనఁ జాలఁ' డనుచు భీమునికిఁ జెవిని
    వినిచె నిట్లు "నశ్వత్థామ యను గజమును
    గూల్చి, యెలుఁగెత్తి చాటుము 'గూలె' ననియు!"

    మ.
    అనఁగ న్వాయుసుతుండు వేగిరమె యా హస్తీంద్రముం జేరియున్
    ఘనవృష్ట్యుత్కట ముష్టిఘాత హతిచేఁ గౌరవ్య సేనా తతుల్
    దను వీక్షింపఁగఁ జంపి, బిగ్గఱఁగఁ దా దర్పోద్ధతిం బల్కె నా
    వనజాక్షుండు వచించినట్లుగనె, యశ్వత్థామ సంహారమున్.

    ఆ.వె.
    భీముఁ డట్లు వల్క, విని నమ్మకుండఁగా,
    నఱచె ధర్మతనయుఁ డంత లోన,
    "సత్య మిదియ సుమ్ము! చచ్చె నశ్వత్థామ!!"
    యనియుఁ; జిన్నఁగాను "హస్తి" యనియు!

    ఆ.వె.
    ద్రోణుఁ డద్ది వినియు రోదించుచును దన
    శర శరాసనములఁ జాఱ విడిచె!
    ద్రుపద పుత్రుఁ డపుడు ద్రోణుని వధియించెఁ;
    గృష్ణుఁ డంత శాంత హృదయుఁ డయ్యె!

    (ఇది అశ్వత్థామ వధాపదేశ ద్రోణవధా వృత్తాంతము)

    రిప్లయితొలగించండి
  11. గురువు గారు,
    ధన్యవాదాలు. సుతుడను అని మొదలుపెట్టి మార్చాను. ఇక సంధి మాట మరిచాను. మన్నించండి.
    మధుసూదన్ గారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చట గా ఉన్నది. ప్రతి సారి ఖండిక లను వ్రాస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  12. మధుసూదన్ గారూ,
    మీ ఖండిక అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ ! శ్రమ పడి సవరణలు చేయ వద్దు . అసలే రెస్టు ఉండదు . ఇదేమైనా కొత్తా ? " పట్టు వదలని విక్రమార్కిని " నేను వ్రాస్తూనే ఉంటాను , శ్రమ కలిగిస్తూనే ఉంటాను . అదన్న మాట .

    రిప్లయితొలగించండి