20, జులై 2012, శుక్రవారం

పద్య రచన - 56

మహానంది పుణ్యక్షేత్రము
 
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. గోవు కాలి గిట్ట గుఱుతు కుంగు లింగ
    మిచట భక్తాళి రక్షించు నెల్ల వేళ
    స్వచ్ఛమైన పుష్కరిణిని జలము వెడలు
    నంది ముఖము నుండి, నిజము నమ్మవోయి

    నీట పడిన రూక నీ కంటికగుపించు
    నిర్మలమ్ములచటి నీళులెపుడు
    నందియాల చుట్టు నవనందులను పేర
    వెలయు పుణ్యక్షేత్ర వివరమిద్ది.

    రిప్లయితొలగించండి
  2. శ్రీమహానందీశు సేవల భాగ్యమ్ము
    కల్గ వేడెద నిమ్ము ఘనత నాకు
    సోమ,శివ, ప్రథమ, సూర్య, వినాయక
    విష్ణు, నాగ, గరుడ, పేరుల తోడను
    స్వామి మహానంది స్వయముభువుడు
    వెలసి యుండెనటంచు, వింటి నేను
    పుష్కరిణి జలము పొలములకెల్లను
    పాఱుచుండునిచట, పంటపండు.

    ఈశ! నీదు చరణమిచ్చెను శరణము
    నిన్ను వీడనెపుడు నిజముగాను
    చల్లగాను చూడు జగతిని జనులను
    నీలకంఠ! చేరి నిన్ను కొలుతు.

    రిప్లయితొలగించండి
  3. పుణ్య జలముల శోబిల్లు పుష్కరిణి త
    ట మున క్షేత్రంబు వెలసెను డాబు గొ లుప
    మూర్తు లన్నిటి కంటెను మూర్తి యొకటి
    నంది విగ్రహం బయ్యది విం దు గొలిపె

    రిప్లయితొలగించండి
  4. నలమల యడవి మధ్యన నడచు చుండ
    యావు త్రొక్కిన శివలింగ మైనది ఘన
    పుణ్య క్షేత్రము, వింతగా పుష్కరిణికి
    జలము జేరు, నెమ్మది జేరు జనులకెల్ల |

    అంతగునకు నిలయ మగు మహా నందికి
    పరుగుతోడ రండి పావనమగు
    జన్మ పుష్కరిణిన స్నాన మాడగనే స
    కల సుఖములు బొందు కాయమెల్ల |

    రిప్లయితొలగించండి
  5. నయనానందకరమ్ముగా వెలుగు పుణ్యక్షేత్ర మార్యా! శివా!
    నయమారన్ గనుగొంటి, మీ కొరకు దండంబుల్ సమర్పించితిన్
    దయతో బ్రోవుమటంచు వేడుచును స్తోత్రమ్ముల్ మదిన్ గూర్చితిన్
    జయ శంభో! వృషరాజవాహన! మహానందీశ్వరా! శంకరా!

    రిప్లయితొలగించండి
  6. పుణ్య క్షేత్ర మనగ పున్నెమ్ము నిడునట్టి
    గోవు కంటె మించు దైవ మేది ?
    నంది వాహ నుండు నాగా భరణుని
    కాలి గిట్త నదిమి ఖ్యాతి గాంచి

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    మహానందిపై మీ పద్యాలు మహానందాన్ని కలిగించాయి. అభినందనలు.
    *
    సుబ్బరావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    నయనానందకరమైన పుణ్యక్షేత్రాన్ని హృదయానందకరంగా వర్ణించారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారు,
    మీ అభినందనలు నాకూ మహదానందాన్ని కలిగించాయి.
    ఈ రోజు సమస్యా పూరణలో కవిమిత్రులొకరు కపి = హరి = విష్ణువు అనే అర్థంలో ప్రయోగించారేమో కదా!
    ఇప్పుడే అక్కడ మీ వ్యాఖ్య చూసి వ్రాస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    నిజమే. నేను గమనించలేదు. కపి శబ్దానికి కోతి, పంది, సూరుడు, విష్ణువు, ఉసిరిక మొదలైన నానార్థాలున్నాయి.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి