కవిమిత్రులారా...
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
దూతను వధించు టెంతయు నీతి యగును.
పండిత నేమాని వారి రామాయణమునుండి
ఈ పద్యపాదాన్ని సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...
దూతను వధించు టెంతయు నీతి యగును.
పండిత నేమాని వారి రామాయణమునుండి
ఈ పద్యపాదాన్ని సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.
కవిమిత్రుల పూరణలు
౧. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
చేయ దగినట్టి పని కాదు మాయతోడ
దూతను వధించు, టెంతయు నీతియగును
స్వామికార్యార్థియై వచ్చి సంప్రదించు
వానిఁ జూచుట గౌరవభావమునను.
* * * * * * *
౨. సుబ్బారావు
పాప మగు నయ్య ! పర దేశ వాసు డైన
దూతను వధించు ,టెంతయు నీతి యగును
రాయ బారిగ వచ్చిన రాజ సుతుని
నెంతొ ప్రేమ తొ కానుక లిచ్చి పంప .
* * * * * * *
౩. రవి
కృష్ణుడు అర్జునునితో - కర్ణుని చంపమని ప్రోత్సహిస్తూ -
అర్భకుండభిమన్యుని యందరొక్క
పట్టు జేరి పోరుట యపపాడిగ నవ
దూ? తను వధించు టెంతయు నీతి యగును?
పార్థ! వెరవకనిదె కర్ణు బలియొనర్చు!
* * * * * * *
౪. గుండు మధుసూదన్
(1)
"దూతను వధించు టెంతయు నీతి యగును
కుటిల శ్రీకృష్ణుఁ డహితమ్ము నిట నుడివె" న
నుచు సుయోధన దుశ్శాసనులును బలిమిఁ
బట్టఁ జన, హరి, విశ్వరూపమ్ముఁ జూపె.
(2)
(ప్రహస్తుడు రావణునితో పలికిన మాటలు)
సీత చెఱ మాన్ప వచ్చిన
యాతండు నశోకవనిని నసురులఁ గూల్చెన్
దూతను వధించు టెంతయు
నీతి యగును రాక్షసేంద్ర! నిజ మిది వినుమా!
* * * * * * *
౫. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
దూతను వధించు టెంతయు నీతి యగును
మ్లేచ్ఛులకును తుచ్ఛ తురుష్కులీ విదేశ
పాలకులకును, మనకది పాడిగాదు!
భరత మాత బోధించిన పాఠ మదియె!
* * * * * * *
౬. పండిత నేమాని
ఆధునిక రాజ తంత్రములదను బట్టి
మారుచుండును కద చాటు మాటునుండి
చంపుచుండెద రనుల నా సరణిలోన
దూతను వధించుటెంతయు నీతి యగును
చేయ దగినట్టి పని కాదు మాయతోడ
దూతను వధించు, టెంతయు నీతియగును
స్వామికార్యార్థియై వచ్చి సంప్రదించు
వానిఁ జూచుట గౌరవభావమునను.
* * * * * * *
౨. సుబ్బారావు
పాప మగు నయ్య ! పర దేశ వాసు డైన
దూతను వధించు ,టెంతయు నీతి యగును
రాయ బారిగ వచ్చిన రాజ సుతుని
నెంతొ ప్రేమ తొ కానుక లిచ్చి పంప .
* * * * * * *
౩. రవి
కృష్ణుడు అర్జునునితో - కర్ణుని చంపమని ప్రోత్సహిస్తూ -
అర్భకుండభిమన్యుని యందరొక్క
పట్టు జేరి పోరుట యపపాడిగ నవ
దూ? తను వధించు టెంతయు నీతి యగును?
పార్థ! వెరవకనిదె కర్ణు బలియొనర్చు!
* * * * * * *
౪. గుండు మధుసూదన్
(1)
"దూతను వధించు టెంతయు నీతి యగును
కుటిల శ్రీకృష్ణుఁ డహితమ్ము నిట నుడివె" న
నుచు సుయోధన దుశ్శాసనులును బలిమిఁ
బట్టఁ జన, హరి, విశ్వరూపమ్ముఁ జూపె.
(2)
(ప్రహస్తుడు రావణునితో పలికిన మాటలు)
సీత చెఱ మాన్ప వచ్చిన
యాతండు నశోకవనిని నసురులఁ గూల్చెన్
దూతను వధించు టెంతయు
నీతి యగును రాక్షసేంద్ర! నిజ మిది వినుమా!
* * * * * * *
౫. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
దూతను వధించు టెంతయు నీతి యగును
మ్లేచ్ఛులకును తుచ్ఛ తురుష్కులీ విదేశ
పాలకులకును, మనకది పాడిగాదు!
భరత మాత బోధించిన పాఠ మదియె!
* * * * * * *
౬. పండిత నేమాని
ఆధునిక రాజ తంత్రములదను బట్టి
మారుచుండును కద చాటు మాటునుండి
చంపుచుండెద రనుల నా సరణిలోన
దూతను వధించుటెంతయు నీతి యగును
దూతను వధించు టెంతయు నీతి యగును
రిప్లయితొలగించండిమ్లేచ్ఛులకును తుచ్ఛ తురుష్కులకు విదేశ
పాలకులకును, మనకది పాడిగాదు!
భరత మాత బోధించిన పాఠ మదియె!
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిభారతీయుల నీతిని తెలిపిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పించి. సవరించండి.
చేయ దగినట్టి పని కాదు మాయతోడ
రిప్లయితొలగించండిదూతను వధించు, టెంతయు నీతియగును
స్వామికార్యార్థియై వచ్చి సంప్రదించు
వానిఁ జూచుట గౌరవభావమునను.
పాప మగు నయ్య ! పర దేశ వాసు డైన
రిప్లయితొలగించండిదూతను వధించు ,టెంతయు నీతి యగును
రాయ బారిగ వచ్చిన రాజ సుతుని
నెంతొ ప్రేమ తొ కానుక లిచ్చి పంప .
P
కృష్ణుడు అర్జునునితో - కర్ణుని చంపమని ప్రోత్సహిస్తూ -
రిప్లయితొలగించండిఅర్భకుండభిమన్యుని యందరొక్క
పట్టు జేరి పోరుట యపపాడిగ నవ
దూ? తను వధించు టెంతయు నీతి యగును?
పార్థ! వెరవకనిదె కర్ణు బలియొనర్చు!
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండి"దూతను వధించు టెంతయు నీతి యగును
నిపుడు శ్రీకృష్ణుఁ డహితమ్ము నిట నుడివె" న
నుచు సుయోధన దుశ్శాసనాదు లకట!
పట్టఁ జన, హరి, విశ్వరూపమ్ముఁ జూపె.
సత్యనారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిచక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రవి గారూ,
మీ ఆలోచన వైవిధ్యంగా ఉంది. ‘దూతను’ ఖండించిన విధానంతో పూరణ బాగుంది. అభినందనలు.
కాకుంటే ‘అవదూ?’ వ్యావహారికం కదా :-)
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
వ్యావహారికం ఛందోబద్ధ పద్యకవిత్త్వంలో వర్జనీయమేనాండి? నాకు నిజంగానే తెలియదు.
రిప్లయితొలగించండిరవి గారూ,
రిప్లయితొలగించండివచనకవిత్వంలోనూ, గేయాలలోను ప్రయోగించే వ్యావహారిక పదాలను సంప్రదాయ చ్ఛందోబద్ధ కవిత్వంలో ప్రయోగించడం లక్షణవిరుద్ధం ‘అవదూ’?
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యంలో ‘తురుష్కులకు విదేశ’ అన్నదాన్ని ‘తురుష్కులీ విదేశ’ అని సవరిస్తున్నాను. యతి సరిపోతుంది. ఏమంటారు?
గుండు మదుసూదన్ గారి రెండవ పూరణ....
రిప్లయితొలగించండి(ప్రహస్తుడు రావణునితో పలికిన మాటలు)
సీత చెర మాన్ప వచ్చిన
యాతండు నశోకవనిని నసురులఁ గూల్చెన్
దూతను వధించు టెంతయు
నీతి యగును రాక్షసేంద్ర! నిజ మిది వినుమా!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండితేటగీతి పాదాన్ని కందంలో ఇమిడ్చిన మీ నైపుణ్యానికి జోహార్లు. చాలా బాగుంది పూరణ. అభినందనలు.
శంకరయ్య గారు, నిజమేనండోయ్. నాకు తట్టలేదు. పైగా ఈ కాలంలో అలాంటి ప్రయోగాలు చేసిన పెద్దలు ఉన్నారు కాబట్టి సందిగ్ధం వచ్చింది.
రిప్లయితొలగించండిగుండా సహదేవుడు గారి పూరణలు....
రిప్లయితొలగించండి(అంగద, కృష్ణ రాయబారములలో పెద్దలు రావణ, సుయోధనులతో పలికిన హితవచనాలు)
(1)
అంగదుఁడు రామకార్యార్థి యాలకించు
మతివ సీత నంపుట నీకు హితముఁ గూర్చు
రామమూర్తి వామనుఁ డౌను క్షేమ మెంచు
దూతను వధించుట నెట్లు నీతి యగును?
(2)
విశ్వమంతయు దానైన విశ్వరూపు
విజ్ఞతన్నది మరచియు వేటు వేయ
వంశ మేమగు? ఘనవిష్ణు యంశ యతడు!
దూతను వధించుట నెట్లు నీతి యగును?
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని సమస్య పాదాన్నే అర్థం మార్చి ‘పాజిటివ్’గా తీసుకున్నారు. కొన్ని లోపాలూ ఉన్నాయి.
ఆధునిక రాజ తంత్రములదను బట్టి
రిప్లయితొలగించండిమారుచుండును కద చాటు మాటునుండి
చంపుచుండెద రనులనా సరణిలోన
దూతను వధించుటెంతయు నీతి యగును
శ్రీ గుండు మధుసూదన్ గారి మొదటి పద్యములో కొన్ని సవరణలు చేయాలి. శ్రీ శంకరయ్య గారు గమనించి నటుల లేదు:
రిప్లయితొలగించండి(1) మొదటి పాదము చివర "నీతి యగును" అని యుండి దాని వెంటనే "నిపుడు" అని నుగాగమము రాదు(అని నాకు సందేహముగ నున్నది).
(2) 3వ పాదములో యతిమైత్రి లేదు. "నుచు" నకు నాదు లతో యతి చెల్లదు.
సవరించండి. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
మీ పూరణ మూడవ పాదంలో ‘అనుటనా’ అనడానికి ‘అనులనా’ అని టైపయిందనుకుంటా.
మధుసూదన్ గారి పూరణలో యతి సవరించబడింది. మీ మొదటి అభ్యంతరం నాకూ తట్టింది. సవరించే ప్రయత్నం చేస్తాను.
అయ్యా! నమస్కారములు.
రిప్లయితొలగించండిఅని(ఏ) = అనులు (బహు) - యుద్ధములందు అని నా భావము. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమన్నించాలి. నేనే పొరబడ్డాను. సవరించాను.
మాస్టారూ, సవరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారు నా పద్యములోని పొరపాటును గ్రహించి తెలియ పఱచి సవరింప జేసి నందులకు హృదయ పూర్వకముగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
చిరకాల బ్లాగు మిత్రులు వసంతకిశోర మహోదయులేమైనట్లు?
రిప్లయితొలగించండి