31, జులై 2012, మంగళవారం

పద్య రచన - 67

రుద్రమదేవి
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. తెలుగింటన్ జనియించినట్టి మణియై; ధీశాలియై వెల్గుచున్,
    వెలుగై నిల్చుచు, నాంధ్రదేశమును సంపీడించు వారందరన్
    బలిమిన్ గెల్చిన రుద్రదేవికిని సంప్రాప్తించె సత్కీర్తులే
    లలనా రత్నముకై నిదే కవితనాలాపింతు సంతృప్తిగాన్.

    రిప్లయితొలగించండి
  2. కాంతారత్నముగా జనించెనిట, సంగ్రామమ్మునన్ గెల్చెనే
    పంతమ్మూని మహా రణమ్ములను సంభాళించె రౌద్రమ్ముతో
    సంతోషించి దలంపుడీ మగువ, రోషమ్మన్న జూపించె, దా
    నెంతోధైర్యము తోడ నిల్చెనట, మీరింపైన పద్యమ్ముతో.

    రిప్లయితొలగించండి
  3. వీ ర నారిగ పేరొంది విమతు లెల్ల
    తనదు శౌర్యంబు చేతన దునిమి నట్టి
    రాణి రుద్రమ దేవికి పాణు లెత్తి
    వంద నంబులు బెట్టుదు వంద లాది

    రిప్లయితొలగించండి
  4. తురగమ్మునెక్కి రుద్రమ
    కరవాలము చేతబట్టి కదనమ్మునకున్
    శిరముల్ద్రుంచగ పగతుర ,
    పరుగెత్తెనువీరనారి భద్రుకరీతిన్!!!

    రిప్లయితొలగించండి
  5. రుద్రాణిన్ దలపించు విక్రమముతో క్రోధాగ్నులన్ జిమ్ముచున్
    భద్రాశ్వమ్మున నొప్పుచున్ రణమునన్ భగ్నాశులన్ జేయుచున్
    విద్రోహాత్ముల వైరి సైన్యముల తా వెల్గొందె విఖ్యాతితో
    క్షుద్రారివ్రజ హంత్రి రుద్రమ యివే జోహారులా దేవికిన్

    రిప్లయితొలగించండి
  6. రాణీ రుద్రమ దేవన
    ప్రాణములను పణము బెట్టి రాజ్నిగ వెలిగెన్ !
    వాణిజ్యము వెల్లివిరియ ని
    ర్మాణము లెన్నొ జేసే రాజ్యము నందున్ !

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులకు మనవి...
    ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులవల్ల ఉదయం నుండి ఇప్పటివరకు బ్లాగు చూడడంం వీలుపడలేదు. తీరా ఇప్పుడు చూస్టే... నాచూపు మందగించిందో మానిటర్ లోపమో కాని వ్యాఖ్యలుగ ఉన్న మీ పూఅణ పద్యాలు ముద్దముద్దగా అలుక్కుపోయినట్లు కనిఒపిస్తున్నాయి. నేను టైపుచేసున్న అక్షరాలు కూడ సరిగా కనిపిమ్చటం లేదు. మీ పద్యాలను వ్యాఖ్యానించే అవకాశం లేఉ. దయచేసి మిత్రులు ఈాటి పూరణలను పద్యాలను పరస్పరం సమీక్షించుకోన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి