5, జులై 2012, గురువారం

సమస్యాపూరణం - 754 (సానిన్ గొల్చిన లభించు)

కవిమిత్రులారా...

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.


కవిమిత్రుల పూరణలు

౧. పండిత నేమాని
    శ్రీనీలకంఠ! శంకర!
    జ్ఞాననిధానా! మహేశ! కరుణాకల్పా!
    మానస కైలాస నివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.
*     *     *     *     *     *
౨. మిస్సన్న
    మేనన్ సగ భాగమున భ-
    వానిన్ ధరియించి నట్టివాడా! శివ! ఈ-
    శానా! యని భక్తిని మన-
    సా నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

*     *     *     *     *     *
౩. గుండు మధుసూదన్
(1)

    ఓ నీలకంఠ! ధూర్జటి!
    యో నిటలాక్ష! పరమేశ! యో త్రిపురారీ!
    యో నగజావర! నగ వా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

(2)
    శ్రీ నిలయ! చక్రధర! ల
    క్ష్మీ నాథా! పద్మనాభ! శేష శయన! శ్రే
    ష్ఠా!నంత! సప్తగిరి వా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

*     *     *     *     *     *
౪. కంది శంకరయ్య
(1)

    శ్రీనారీపీడితపద
    సూనా! పీతాంబరధర! శుభదా! విశ్వ
    క్సేనా! క్షీరాబ్ధినివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

(2)
    తా నొక సినిమా నటుఁడై
    యేనాటికినైన కీర్తినే గడియింపన్
    బూని సిని దర్శకుఁడు పో
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్. 

*     *     *     *     *     *
౫. హరి వేంకట సత్యనారాయణ మూర్తి
(1)
    శ్రీనందనందనా! దయ
    తో నన్నున్ గావు మనుచు తోరపు భక్తిన్
    బూనుచు తిరుమలగిరివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.
(2)
    శ్రీనిధి, జగదంబిక నా
    దీనజనావన నతీవదివ్యచరిత్రన్
    మానినిఁ బరమేశ్వరు దొర
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.
*     *     *     *     *     *
౬. చంద్రమౌళి
(1)
    మానుత చరణా ! కలిలో
    దీనుల సంరక్ష జేయు దివ్యసుతేజా
    మానిధి! తిరుమలగిరివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!
(2)
    ’నే నీ’యను భేదములవి
    తానేరగ లేని మహిత తత్త్వము నీవే
    మౌనీశ్వర హృదయనివా
    సా ! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!
*     *     *     *     *     *
౭. ‘మన తెలుగు’ చంద్రశేఖర్
(1)

    ఆ నల్లనయ్య మురళీ
    గానము విని చెట్టుపుట్టఁ గాలించు సఖిన్
    ఆ నందవ్రజ మందడి
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

(2)
    నేనును నా పాలనమే
    యీనాటికి దిక్కు దేశ మేగతి చనినన్
    పోని మ్మను నా యిటలీ
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

*     *     *     *     *     * 
౮. వరప్రసాద్
    మానవ రూపముగల నీ
    తేనియ బలుకులను వినిన దేశ ప్రజలకున్
    మానక ,భద్రాద్రి నివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

*     *     *     *     *     *
౯. కమనీయం
(1)
    మానితగుణసాగర! స
    మ్మానిత భూదివ్యలోక! మంగళరూపా!
    మానాథ! తిరుమలనివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.
(2)
    తానెది చెప్పిన జేయుచు
    వీనుల విందగు పలుకుల వినిపించుచు నె
    ట్లో నమ్మించుచు ,నా దొర
    సానిని గొల్చిన లభించు సంపద లెల్లన్.
    చాలా సార్లు దొరగారి కన్నా దొరసానిని ప్రసన్నురాలిగా చేసుకొంటే సులువుగా పనులు అవుతాయి.
*     *     *     *     *     *
౧౦. సుబ్బారావు
    న్యూనత భావన జూతురు
    సానిన్, గొల్చిన లభించు సంపద లెల్లన్
    మానక యా శంకరు నే
    పూనికతో గొల్వ ,మేలు పుర మంతటికిన్
*     *     *     *     *     *
౧౧. సహదేవుడు
    సానిన్నవాబు బట్టెన్
    వాని నదృష్ట మది పట్ట పాలకు డాయెన్
    కానీ లేని జవానా
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!
*     *     *     *     *     *
౧౨. రాజేశ్వరి నేదునూరి
    మానసమున పూజించెద
    కానుక లేమీయలేను కరుణించు ప్రభూ !
    మానుము కినుక గిరినివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్ !
*     *     *     *     *     *
౧౩. గోలి హనుమచ్ఛాస్త్రి
    మేనా హిమగిరి పుత్రిని
    మీనాక్షిని మూడుకండ్ల మేలగు దొరకున్
    మేనున సగమమరిన దొర
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

*     *     *     *     *
౧౪. మంద పీతాంబర్
    దీనుల మొరవిను వీనులు
    మేనేల్లన్ గల వినీలమేఘశ్యామా!
    మానసవశ తిరుమలవా
    సా!నిన్ గొల్చిన లభించుసంపదలెల్లన్ !!!

33 కామెంట్‌లు:

  1. శ్రీనీలకంఠ! శంకర!
    జ్ఞాననిధానా! మహేశ!కరుణాకల్పా!
    మానస కైలాస నివా
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

    రిప్లయితొలగించండి
  2. మేనన్ సగ భాగమున భ-
    వానిన్ ధరియించి నట్టి వాడా! శివ! ఈ-
    శానా! యని భక్తిని మన-
    సా నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

    రిప్లయితొలగించండి
  3. గుండు మధుసూదన్ గారి పూరణ....

    ఓ నీలకంఠ! ధూర్జటి!
    యో నిటలాక్ష! పరమేశ! యో త్రిపురారీ!
    యో నగజావర! నగ వా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

    రిప్లయితొలగించండి
  4. శ్రీనవలాపీడితపద
    సూనా! పీతాంబరధర! శుభదా! విశ్వ
    క్సేనా! క్షీరాబ్ధినివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

    రిప్లయితొలగించండి
  5. శ్రీనందనందనా! దయ
    తో నన్నున్ గావు మనుచు తోరపు భక్తిన్
    బూనుచు తిరుమలగిరివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

    రిప్లయితొలగించండి
  6. మానుత చరణా ! కలిలో
    దీనుల సంరక్షజేయు దివ్యసుతేజా
    మానిధి! తిరుమలగిరివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

    రిప్లయితొలగించండి
  7. శ్రీనిధి, జగదంబిక నా
    దీనజనావనైక దీక్షిత నెపుడున్
    మానినిఁ బరమేశ్వరు దొర
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

    రిప్లయితొలగించండి
  8. ’నే నీ’యను భేదములవి
    తానేరగ లేని మహతత్త్వము నీవే
    మౌనీశ్వర హృదయనివా
    సా ! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

    రిప్లయితొలగించండి
  9. ఆర్యా!
    రెండవపాదం ఇలా సవరించ వలసినదిగా ప్రార్థన.
    దీనజనావన నతీవదివ్యచరిత్రన్

    రిప్లయితొలగించండి
  10. ఆ నల్లనయ్య మురళీ
    గానము విని చెట్టుపుట్టఁ గాలించు సఖిన్
    ఆ నందవ్రజ మందడి
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    శ్రీ నిలయ! చక్రధర! ల
    క్ష్మీ నాథా! పద్మనాభ! శేష శయన! శ్రే
    ష్ఠా!నంత! సప్తగిరి వా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

    రిప్లయితొలగించండి
  12. నేనూ నా పాలనమే
    ఈనాటికి దిక్కు దేశ మేగతి పోతే
    పోనీ యనునా ఇటలీ
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

    రిప్లయితొలగించండి
  13. మాస్టారూ, "పోతే పోనీ" అనే మాటలో ఉండే ఉధృతం, ఊపు కోసం అలా వ్యావహారికం వాడాను. మీ సవరణ వల్ల చక్కటి శైలి అబ్బింది పద్యానికి. సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మనతెలుగు చంద్రశేఖర్ గారూ,

    ప్రతిభా నవనవోన్మేషశాలినీ యన్న కావ్యమీమాంసోక్తిని జ్ఞప్తికితెచ్చు మీ పూరణ ముదావహం.

    రిప్లయితొలగించండి
  15. తా నొక సినిమా నటుఁడై
    యేనాటికినైన కీర్తినే గడియింపన్
    బూని సిని దర్శకుఁడు పో
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

    రిప్లయితొలగించండి
  16. గువుగారికి ధన్యవాదము దెలుపుతూ

    -------
    గానము జేసినా రామా |
    నీనామము సద్గతులను నేరుగ బొం దున్,
    వానర జాతికి వరముల్
    దానవ జాతులను ద్రుంచి, తారక రామా
    మానవ రూపము లో నీ
    దేనియ బలుకులను వినిన దేశ ప్రజలకున్
    మానిక ,భద్రాద్రి నివా
    సా! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ!
    మీ పద్యములో "శ్రీనవలా పీడిత పద"అని వాడేరు. నవలా అనేది తెలుగు పదము, సంస్కృతము కాదు. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. 1.
    మానితగుణసాగర స
    మ్మానిత భూ దివ్యలోక మంగళరూపా
    మానాథ,
    తిరుమలనివా
    సా,నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.
    -------------
    2.
    తానెది చెప్పిన జేయుచు
    వీనుల విందగు పలుకుల వినిపిన్ చుచు నె
    ట్లో నమ్మిన్ చుచు ,నా దొర
    సానిని గొల్చిన లభించు సంపద లెల్లన్.
    చాలా సార్లు దొరగారి కన్నా దొరసాని ని ప్రసన్నురాలిగా చేసుకొంటే సులువుగా పనులు అవుతాయి.

    రిప్లయితొలగించండి
  19. న్యూనత భావన జూతురు
    సానిన్, గొల్చిన లభించు సంపద లెల్ల న్
    మానక యా శంకరు నే
    పూ నికతో గొల్వ ,మేలు పుర మంతటి కిన్

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీరు వ్రాయుచున్న కంద పద్యములను చూచు చున్నాను. కందమునకు 4 పాదములే ఉంటాయి. అందుచేత కంద మాలికలు అని 4కంటే ఎక్కువ పాదములు ఉంచరాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. చంద్రమౌళిగారూ, ధన్యవాదాలు. మీరు ఇంతకుముందు సమస్యాపూరణలో శతావధాని గణేశ్ గారి ప్రస్తావన తెచ్చారు. చాలా బాగుంది. వారు బహుభాషావధాని. వారంటే నాకు చాలా ఇష్టం, గౌరవమూనూ. వారూ, కూడా IISc Alumni కావటం ఇంకో విశేషము.

    రిప్లయితొలగించండి
  22. చంద్రశేఖర్ గాರೂ. గణేశ్ గారి పరిచయం మీకున్నది చాలా సంతోషకరం. రెండుదశాబ్దాలుకుపైగా శ్రీగణేశ్ గారి స్నేహం పోందిఊండటం, నా భాగ్యంగా భావిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  23. సానిన్నవాబు బట్టెన్
    వానిన దృష్టమది బట్ట పాలకు డాయెన్
    కానీ లేని జవానా
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

    రిప్లయితొలగించండి
  24. మానసమున పూజించెద
    కానుక లేమీ యలేను కరుణించు ప్రభూ !
    మానుము నాపై కినుకగి రీ
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్ !

    రిప్లయితొలగించండి
  25. మేనా హిమగిరి పుత్రిని

    మీనాక్షిని మూడుకండ్ల మేలగు దొరకున్

    మేనున సగమమరిన దొర

    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్.

    రిప్లయితొలగించండి
  26. దీనుల మొరవిను వీనుల
    మేనేల్లన్ గలవినీలమేఘశ్యామా!
    మానసవశ తిరుమలవా
    సా!నిన్ గొల్చిన లభించుసంపదలెల్లన్ !!!

    రిప్లయితొలగించండి
  27. పోనే పోయెను కాంగ్రెసు
    జానెడు బెత్తెడు తె.దే.కి ఛాన్సే లేదే!
    దీనుడ నేననుచు తె.రా.
    సా.! నిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్

    రిప్లయితొలగించండి
  28. దీనులు! కాంగ్రెసు వారల్!
    పోనే పోయనుగ బ్రదరు బొంకుల దిబ్బై
    వానికి బదులుగనిక దొర
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!

    రిప్లయితొలగించండి